logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పులివెందుల లోని సాయిబాబ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు పులివెందులలోని షిరిడీ సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.పులివెందుల పట్టణంలోని స్థానిక భగవాన్ సత్యసాయి మందిరం,పార్నపల్లి రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలోనూ.. అలాగే బ్రాహ్మణ పల్లె సమీపంలోని సాయిబాబా ఆలయాలలో బాబాను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. బుధవారం ఉదయమే సాయిబాబాకు హారతులు, పాలాభిషేకం నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద మహిళలు సామూహిక పూజలు చేశారు.

4 hrs ago
user_LAKKU SIVA SANKAR reddy
LAKKU SIVA SANKAR reddy
Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

పులివెందుల లోని సాయిబాబ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు పులివెందులలోని షిరిడీ సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.పులివెందుల పట్టణంలోని స్థానిక భగవాన్ సత్యసాయి మందిరం,పార్నపల్లి రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలోనూ.. అలాగే బ్రాహ్మణ పల్లె సమీపంలోని సాయిబాబా ఆలయాలలో బాబాను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. బుధవారం ఉదయమే సాయిబాబాకు హారతులు, పాలాభిషేకం నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద మహిళలు సామూహిక పూజలు చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. సిద్దవటం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ ప్రకృతి, పరిరక్షణ దినోత్సవంపై జిల్లా న్యాయధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారి నుంచి నిమ్న కులాల వారిని కాపాడేందుకు, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాగరికత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇప్పటికీ అంటరానితనాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప చట్టాలను దుర్వినియోగం చెయ్యవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందాలని న్యాయం పొందకుంటే బ్రతికి ఉన్నా జీవచ్చవం లెక్కేనన్నారు. గిరిజన చట్టాలు, కాగ్నిజబుల్ ఆఫెన్స్ లో జీరో ఎఫ్ఐఆర్, అటవీ చట్టాలు, ఆర్ఓఎఎఫ్, పీఓఎ యాక్ట్, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పి. కొత్తపల్లి పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంపును నిర్వహించగా, అంగన్వాడీ సిబ్బంది పౌష్టికరమైన ఆహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ వినయ్, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, వైద్యశాఖ, అంగన్వాడీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్
సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. సిద్దవటం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ ప్రకృతి, పరిరక్షణ దినోత్సవంపై జిల్లా న్యాయధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారి నుంచి నిమ్న కులాల వారిని కాపాడేందుకు,  సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాగరికత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇప్పటికీ అంటరానితనాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప చట్టాలను దుర్వినియోగం చెయ్యవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందాలని న్యాయం పొందకుంటే బ్రతికి ఉన్నా జీవచ్చవం లెక్కేనన్నారు. గిరిజన చట్టాలు, కాగ్నిజబుల్ ఆఫెన్స్ లో జీరో ఎఫ్ఐఆర్, అటవీ చట్టాలు, ఆర్ఓఎఎఫ్, పీఓఎ యాక్ట్, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పి. కొత్తపల్లి పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంపును నిర్వహించగా, అంగన్వాడీ సిబ్బంది పౌష్టికరమైన ఆహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ వినయ్, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, వైద్యశాఖ, అంగన్వాడీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. అన్నమయ్య జిల్లా: పుంగనూరు: అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు. కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
    4
    అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.
అన్నమయ్య జిల్లా: పుంగనూరు:
అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు.
పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు.
దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు.
నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం.
పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.
చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.
కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    21 hrs ago
  • గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.
    4
    గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు నియోజకవర్గం 
చౌడేపల్లి పట్టణంలో 
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి.
దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    53 min ago
  • మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    1
    మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు 
మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • 110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పుంగనూరు నియోజకవర్గం లోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    1
    110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న  పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం లోని  సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  సీఐ సుబ్బరాయుడు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆందోళన పోరుమామిళ్ల బస్టాండ్ సమీప డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఫణిరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్యూరింగ్ సరిగా చేయకపోవడం వల్ల ప్రజాధనం వృథా కావడంతోపాటు ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందన్నారు. దీనికి ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణా లోపమే కారణమని ఆరోపించారు. ఈ పనులపై జిల్లా కలెక్టర్ తక్షణమే సాంకేతిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
    1
    డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆందోళన
పోరుమామిళ్ల బస్టాండ్ సమీప డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఫణిరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్యూరింగ్ సరిగా చేయకపోవడం వల్ల ప్రజాధనం వృథా కావడంతోపాటు ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందన్నారు. దీనికి ఆర్ అండ్
బి అధికారుల పర్యవేక్షణా లోపమే కారణమని ఆరోపించారు. ఈ పనులపై జిల్లా కలెక్టర్ తక్షణమే సాంకేతిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పుంగనూరు లో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధికారులు డుమ్మా. అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించిన దళిత నాయకులు పుంగనూరు అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు ప్రతినెలా జరిగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గత మూడు నెలల గా జరగడంలేదని అధికారులు సమావేశానికి హాజరు మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఎరుకల బంజారా తదితర సంఘాల నాయకులు నిరసన చేస్తున్న విషయం విధితమే కానీ ఈరోజు 29 7 2026 సమావేశం ఏర్పాటు చేస్తామని సర్కిల్ ఇచ్చారు సమావేశానికి అధికారులు కూడా ఒక్కొక్కరే వస్తూ ఉండగా ఎందుకో తెలియదు కానీ చివరి క్షణంలో సమావేశాన్ని రద్దు పరచారు ఈ విషయంపై మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారు ఎమ్మార్వో గారితో మాట్లాడారు ఆయన ఒకటి రెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు కానీ ఈ సమావేశంలో ఉన్న కమిటీ సభ్యులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు రాజకీయానికి ఈ కమిటీకి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ రంగు పుల్లమి సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారు వారిని కమిటీ నుండి తొలగించే పాత కమిటీని కొనసాగించాలని మండలంలోని ఎస్సీ ఎస్టీల సమస్యలను తీర్చాలని లేకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్ధ నగ్న ప్రదర్శన చేస్తారని తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు రాజా శంకర మనీ నారాయణ గంగప్ప పెంచుపల్లి కృష్ణ కుమార్ రెడ్డి రమణ కళావతి తదితరులు పాల్గొన్నారు
    2
    పుంగనూరు లో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధికారులు డుమ్మా. అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించిన దళిత నాయకులు
పుంగనూరు అన్నమయ్య జిల్లా
పుంగనూరు మండలం పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు ప్రతినెలా జరిగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గత మూడు నెలల గా జరగడంలేదని అధికారులు సమావేశానికి హాజరు 
మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఎరుకల బంజారా తదితర సంఘాల నాయకులు నిరసన చేస్తున్న విషయం విధితమే కానీ ఈరోజు 29 7 2026 సమావేశం ఏర్పాటు చేస్తామని సర్కిల్ ఇచ్చారు సమావేశానికి అధికారులు కూడా ఒక్కొక్కరే వస్తూ ఉండగా ఎందుకో తెలియదు కానీ చివరి క్షణంలో సమావేశాన్ని రద్దు పరచారు ఈ విషయంపై మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారు ఎమ్మార్వో గారితో మాట్లాడారు ఆయన ఒకటి రెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు కానీ ఈ సమావేశంలో ఉన్న కమిటీ సభ్యులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు రాజకీయానికి ఈ కమిటీకి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ రంగు పుల్లమి సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారు వారిని కమిటీ నుండి తొలగించే పాత కమిటీని కొనసాగించాలని మండలంలోని ఎస్సీ ఎస్టీల సమస్యలను తీర్చాలని లేకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్ధ నగ్న ప్రదర్శన చేస్తారని తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు రాజా శంకర మనీ నారాయణ గంగప్ప పెంచుపల్లి కృష్ణ కుమార్ రెడ్డి రమణ కళావతి తదితరులు పాల్గొన్నారు
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.
    1
    మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం 
మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం  గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను  తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో  మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఆత్మకూరులో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు ఆత్మకూరు పట్టణంలో బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ నుండి ఆత్మకూరుకు కూరగాయల లోడు తో వచ్చిన ఐచర్ వాహనం నంద్యాల టర్నింగ్లో ఓ కుక్కను తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.
    1
    ఆత్మకూరులో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు 
ఆత్మకూరు పట్టణంలో బుధవారం తెల్లవారుజామున  పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ నుండి ఆత్మకూరుకు కూరగాయల లోడు తో వచ్చిన ఐచర్ వాహనం నంద్యాల టర్నింగ్లో ఓ కుక్కను తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.