Shuru
Apke Nagar Ki App…
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా నిలిచిన కేటీఆర్ 6 సంవత్సరాల క్రితం ఎక్స్ వేదికగా సహాయం కోరుతూ వేసిన ట్వీట్ పై స్పందించి.. వారికి ఆర్ధిక సహాయం చేసి ఆపరేషన్ చేయించిన కేటీఆర్ అయితే ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో.. కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన శరణ్య కుటుంబసభ్యులు
Tagore
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా నిలిచిన కేటీఆర్ 6 సంవత్సరాల క్రితం ఎక్స్ వేదికగా సహాయం కోరుతూ వేసిన ట్వీట్ పై స్పందించి.. వారికి ఆర్ధిక సహాయం చేసి ఆపరేషన్ చేయించిన కేటీఆర్ అయితే ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో.. కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన శరణ్య కుటుంబసభ్యులు
More news from తెలంగాణ and nearby areas
- Post by Tagore1
- గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి T. Harish Rao మరియు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ Vanteru Pratap Reddy సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ కండువాలు వేసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వారిలో బుడుగు ఎల్లం (సింగర్), మాదరబోయిన శేఖర్, మంద రవి, బత్తిని భాను, గుండబోయిన రాజు, దామరకుంట మహేందర్, రాహుల్, విజయ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ Yadav Reddy, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మరియు మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు గోలి మమత సంతోష్, అత్తిలి, శ్రీనివాస్, మన్నే రూపా వెంకటేష్, కనక సేన, కప్ప పోచయ్య, మాజీ కౌన్సిలర్లు గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, అక్కారం మాజీ సర్పంచ్ బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.4
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిజెపి వ్యతిరేకం కాదు: సంగారెడ్డిలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో నల్లచెరువు కట్ట పరిసరాల్లో జరుగుతున్న చెట్ల నరికివేతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని నల్లచెరువు కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారని స్థానికులు గమనించారు. ఈ విషయం గురించి ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ మరియు ఆమె భర్త తాళ్ళ ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు చెట్లు నరుకుతున్నామని కొందరు తెలిపారు అని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే ఈ నిర్ణయం గురించి కనీసం వార్డ్ మెంబర్లకు లేదా ఉప సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా, సర్పంచ్ మరియు ఆమె భర్త ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తప్పు జరిగినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.4
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోస్ట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750 కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని కమలాకర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.2
- బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, ఐలయ్య, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.1
- Post by Tagore1