Shuru
Apke Nagar Ki App…
*కామారెడ్డి బస్టాండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపులు దగ్ధం* తెలంగాణ : కామారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్టాండ్ వద్ద ఉన్న 12 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tagore
*కామారెడ్డి బస్టాండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపులు దగ్ధం* తెలంగాణ : కామారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్టాండ్ వద్ద ఉన్న 12 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- Post by Tagore1
- గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి T. Harish Rao మరియు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ Vanteru Pratap Reddy సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ కండువాలు వేసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వారిలో బుడుగు ఎల్లం (సింగర్), మాదరబోయిన శేఖర్, మంద రవి, బత్తిని భాను, గుండబోయిన రాజు, దామరకుంట మహేందర్, రాహుల్, విజయ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ Yadav Reddy, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మరియు మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు గోలి మమత సంతోష్, అత్తిలి, శ్రీనివాస్, మన్నే రూపా వెంకటేష్, కనక సేన, కప్ప పోచయ్య, మాజీ కౌన్సిలర్లు గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, అక్కారం మాజీ సర్పంచ్ బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.4
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిజెపి వ్యతిరేకం కాదు: సంగారెడ్డిలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో నల్లచెరువు కట్ట పరిసరాల్లో జరుగుతున్న చెట్ల నరికివేతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని నల్లచెరువు కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారని స్థానికులు గమనించారు. ఈ విషయం గురించి ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ మరియు ఆమె భర్త తాళ్ళ ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు చెట్లు నరుకుతున్నామని కొందరు తెలిపారు అని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే ఈ నిర్ణయం గురించి కనీసం వార్డ్ మెంబర్లకు లేదా ఉప సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా, సర్పంచ్ మరియు ఆమె భర్త ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తప్పు జరిగినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.4
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- _ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ పోలీసుల సడెన్ రైడ్‌తో 5 మంది గ్యాంగ్ సభ్యులు అరెస్ట్.. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షలు విలువ చేసే 5 కిలోల గంజాయి సీజ్ ,రెండు పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం... ఉడిపి హోటల్ దగ్గర గుట్టుగా డీల్ చేస్తూ చిక్కిన యువకులు... *పారిపోదాం అనుకున్నారు..* ప్లాన్ ఫెయిల్ – వెంటనే పట్టేసిన టూ టౌన్ పోలీసులు... ఒక్క కేజీ 3 వేలకే కొనుగోలు చేసి నల్గొండలో భారీ రేటుకు అమ్మకం... ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా మొదలై గంజాయి బిజినెస్‌గా మారిన కథ... ఇంకా 6 మంది పరారీలో – పోలీసుల వేట కొనసాగుతోంది... గంజాయి అంటే జైలు టికెట్ ఖాయం.. అంటూ *అడిషనల్ ఎస్పీ జి రమేష్* స్ట్రాంగ్ వార్నింగ్... నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో టూ టౌన్ సీఐ S.రాఘవ రావు,ఆద్వర్యంలో ఎస్సై వై.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.రాజు,మరియు కానిస్టేబుల్ L.బాలకోటి,MD.షకీల్ లతో లను జిల్లా S.P అభినందించనైనది...1
- బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, ఐలయ్య, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.1
- Post by Tagore1