కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపణ.. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750 కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని కమలాకర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపణ.. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి
పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750 కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని కమలాకర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
- హుస్నాబాద్ మండలం పందిళ్ల వంతెన సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి శ్రీరాములపల్లి గ్రామానికి వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురిలో భార్య దివ్య తేజ (32), కుమారుడు నిహాన్ రెడ్డి (11) తీవ్రంగా గాయపడగా, భర్త గంగం శ్రీధర్ రెడ్డి (40), కూతురు శ్రీనిక (6) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.1
- ప్రజల భద్రత పూర్తిగా కుప్పకూలిందని, సీఎం రేవంత్ రెడ్డి & కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ MP బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ కరీంనగర్ సీపీ సస్పెన్షన్, నిందితుల వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్1
- కొదురుపాక రౌండప్ బోర్డు, మరియు బస్సు షెల్టర్, వెంకట్రావు పళ్లి, బస్ షెల్టర్ నిర్మాణం,మోక్షం ఎప్పుడు. సిపిఎం పార్టీ డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక మరియు వెంకట్రావుపల్లి స్టేజీల వద్ద బస్సు సెంటర్లు నిర్మాణం చేయకపోవడం వల్ల అలాగే రౌండప్ బోర్డు సుందరీకరణ పనులకు నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల మరి ఇక్కడున్న మహిళలు బస్సు సెంటర్ లేక , టాయిలెట్, లేక,అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కూర్చోవడానికి వసతులు లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న కూడా ఈ ప్రాంతం పాలకులు దృష్టి పెట్టకపోవడం అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న కూడా ఇప్పటివరకు కూడా మహిళలకు కనీస సౌకర్యాలు లేకపోవడం మరియు ఒకసారి ఎమ్మెల్యేమేడిపల్లి సత్యం, ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన బస్సు షెల్టర్లు అలాగే టాయిలెట్లు, మరియు రౌండ్ బోర్డ్ సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా మహిళల పక్షాన మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పత్రిక ముఖంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి రహదారి నిరసన చేపడుతామని మండల సిపిఎం పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది.1
- జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.1
- వరంగల్ నగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్న నేపథ్యంలో, వర్ధన్నపేట పట్టణంలో సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు పిఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు. దాదాపు కేజీ బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కరీంనగర్ చైతన్యపురిలో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు బంగారం కొంటున్నట్లు నటించి షాప్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు. దొంగలు జరిపిన కాల్పుల్లో జ్యువెలరీ షాప్ మేనేజర్ ముస్తాక్ తో పాటు నలుగురు గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంప్ కార్యాలయం సమీపంలోనే చోరీ జరగడం కలకలం సృష్టిస్తుంది. ఉదయం షాప్ తెరిచిన కొద్ది సేపటికే ఐదుగురు దుండగులు పిస్టల్స్ తో షాపులోకి ప్రవేశించి గోల్డ్ కొంటున్నట్లు ప్రవర్తించి సిబ్బందిని తమ ఆధీనంలో తీసుకొని చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సిబ్బంది తిరగబడడంతో కాల్పులు జరిపారు. పెనుగులాట జరిగినట్లు సిసి కెమెరాలో రికార్డు అయింది. సంఘటన స్థలాన్ని సిపి గౌస్ ఆలం సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. షాప్ లో మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వేసేసి బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కేజీ బంగారం ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సిసి కెమెరాలు పెట్టే చిన్ని పరిశీలిస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నగరంలో ఎటువైపు వెళ్లారని ఆరా తీస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని సిపి గౌస్ ఆలం స్పష్టం చేశారు. నలుగురు పేస్ లు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒకరు మాత్రమే మాస్క్ ధరించారని తెలిపారు. అంతరాష్ట్ర ముఠానే ఈ సంఘటన పాల్పడినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. నాలుగు బృంధాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రకటించారు.4
- కరీంనగర్ పీఎంజే జువెలరీ కాల్పుల ఘటనలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు వైద్యులను కోరారు.1
- జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఏనుగుల పరశయ్య (ప్రశాంత్) శనివారం స్థానిక రాజన్న బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు మోటర్ల సహాయంతో బావిలోని నీటిని తోడి 16 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం చివరకు యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.1