Shuru
Apke Nagar Ki App…
బచ్చన్నపేటలో విషాదం – బావిలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు 16 గంటల గాలింపునంతరం మృతదేహంగా లభ్యం జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఏనుగుల పరశయ్య (ప్రశాంత్) శనివారం స్థానిక రాజన్న బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు మోటర్ల సహాయంతో బావిలోని నీటిని తోడి 16 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం చివరకు యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
M D Azizuddin
బచ్చన్నపేటలో విషాదం – బావిలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు 16 గంటల గాలింపునంతరం మృతదేహంగా లభ్యం జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఏనుగుల పరశయ్య (ప్రశాంత్) శనివారం స్థానిక రాజన్న బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు మోటర్ల సహాయంతో బావిలోని నీటిని తోడి 16 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం చివరకు యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ నగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్న నేపథ్యంలో, వర్ధన్నపేట పట్టణంలో సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.1
- సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి చౌరస్తా వద్ద ఈ రోజు నిర్వహించిన రైతుల ధర్నాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో అమలు చేస్తున్న గ్రేడ్‌ల విధానం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎన్నో ఆశలతో, అప్పులు చేసి, ఎండను వానను లెక్కచేయకుండా పంట పండిస్తారని, కానీ ధాన్యం అమ్ముకునే సమయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు నాయకులు తెలిపారు. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, మిల్లర్ల నిర్లక్ష్యం, గ్రేడ్‌ల పేరుతో కోతలు విధించడం రైతులను మరింత ఆర్థికంగా దెబ్బతీస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి నిలిపివేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని, రైతులు రాత్రింబవళ్లు ధాన్యం దగ్గరే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాగునీరు, టెంట్లు, హమాలీల సౌకర్యాలు కూడా సరైన విధంగా లేవని విమర్శించారు. తేమ, రంగు, గ్రేడ్ పేర్లతో ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అదే ధాన్యాన్ని తర్వాత మిల్లర్లు తీసుకుంటున్న పరిస్థితి రైతుల్లో అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, గ్రేడ్‌ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే మంగళవారం భారీ సంఖ్యలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.1
- కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు పిఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు. దాదాపు కేజీ బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కరీంనగర్ చైతన్యపురిలో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు బంగారం కొంటున్నట్లు నటించి షాప్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు. దొంగలు జరిపిన కాల్పుల్లో జ్యువెలరీ షాప్ మేనేజర్ ముస్తాక్ తో పాటు నలుగురు గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంప్ కార్యాలయం సమీపంలోనే చోరీ జరగడం కలకలం సృష్టిస్తుంది. ఉదయం షాప్ తెరిచిన కొద్ది సేపటికే ఐదుగురు దుండగులు పిస్టల్స్ తో షాపులోకి ప్రవేశించి గోల్డ్ కొంటున్నట్లు ప్రవర్తించి సిబ్బందిని తమ ఆధీనంలో తీసుకొని చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సిబ్బంది తిరగబడడంతో కాల్పులు జరిపారు. పెనుగులాట జరిగినట్లు సిసి కెమెరాలో రికార్డు అయింది. సంఘటన స్థలాన్ని సిపి గౌస్ ఆలం సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. షాప్ లో మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వేసేసి బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కేజీ బంగారం ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సిసి కెమెరాలు పెట్టే చిన్ని పరిశీలిస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నగరంలో ఎటువైపు వెళ్లారని ఆరా తీస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని సిపి గౌస్ ఆలం స్పష్టం చేశారు. నలుగురు పేస్ లు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒకరు మాత్రమే మాస్క్ ధరించారని తెలిపారు. అంతరాష్ట్ర ముఠానే ఈ సంఘటన పాల్పడినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. నాలుగు బృంధాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రకటించారు.4
- బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, ఐలయ్య, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.1
- Post by Tagore1
- పోలీస్ కమిషనర్ ఆధ్వర్వంలో పోలీసులు దుండుగుల కోసం గాలిస్తున్నారు* హుటాహుటిన జ్యువెల్లరీ షాపుకు వెళ్లిన కేంద్ర మంత్రి* *చోరీ ఘటనపై ఆరా...* *దుండుగలను అడ్డుకునేందుకు సిబ్బంది చూపిన తెగవ ప్రశంసనీయమన్న బండి సంజయ్* *కాల్పుల ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని వెల్లడి* బంగారం కొనుగోలు చేస్తామని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడి కాల్పులు జరిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘అనుకోని సంఘటన ఇది. ఈ ఘటన జరిగే సమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఏరియాలోనే పలు అభివ్రుద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న. పోలీసులు కూడా ఉన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు. దుండుగలను కచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం ఉంది’’అని తెలిపారు. కరీంనగర్ లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపు సిబ్బందిపై దుండగుల కాల్పుల ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు. జ్యువెలరీ షాపులోని సీసీ పుటేజీని పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు. అసలేం జరిగింది అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత పోలీస్ కమిషనర్ తోపాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఏమన్నారంటే.... ఇది అనుకోని సంఘటన. అత్యంత దురద్రుష్టకరం. సీసీ పుటేజీ, సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి మొత్తం ఐదుగురు దుండుగులు చోరీ చేయడానికి జ్యువెలరీ షాపులోకి వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తొలుత ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలి చూపాలన్నారు. కాసేపటికే మరో ఇద్దరు వచ్చి గోల్డ్ అభరణాలు కొంటాం... చూపాలన్నారు. బంగారు ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు వచ్చారు. దుండుగులు తెలుగు, హిందీ భాషలు మాట్లాడుకున్నారు. ఐదుగురు కలిసి తుపాకులు చూపించి బెదిరించి అభరాణలను చోరీ చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న షాపు సేల్స్ మేనేజర్, ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారు. సిబ్బంది చాలా ధైర్యంగా తెగించి అడ్డుకున్నారు. ఆ క్రమంలోనే వారికి గాయలయ్యాయి. ఇప్పటి వరకైతే ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ బాధితులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నాం. ఈ ఘటన జరిగే సమాయానికంటే 10 నిమిషాలకు ముందే షాపు సమీపంలోనే అభివ్రుద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నా. ఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై కరీంనగర్ ను చుట్టుముట్టారు. దుండుగులను పట్టుకుంటారనే నమ్మకం ఉంది. ఏదేమైనా అధికారులు సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం వచ్చింది. బాధితుల స్టేట్ మెంట్ తీసుకుంటున్నారు. దొంగ తనం చేయడానికే షాపులోకి చొరబడ్డట్లు తెలుస్తోంది. సిబ్బంది అడ్డుకోవడంతో ఒక బ్యాగును ఇక్కడే జార విడిచారు. ఎంత గోల్డ్, ఇతర అభరణాలు ఎత్తుకెళ్లారనేది పోలీసుల విచారణలో తేలుతుంది.1
- జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఏనుగుల పరశయ్య (ప్రశాంత్) శనివారం స్థానిక రాజన్న బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు మోటర్ల సహాయంతో బావిలోని నీటిని తోడి 16 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం చివరకు యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.1