Shuru
Apke Nagar Ki App…
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు : ఎస్సై మహేష్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్ (35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మానసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఈ నెల 3వ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ.మహేష్ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గండికోట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.
Narmala Swapna
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు : ఎస్సై మహేష్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్ (35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మానసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఈ నెల 3వ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ.మహేష్ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గండికోట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.
More news from Telangana and nearby areas
- జగిత్యాల జిల్లా కేంద్రంలో 20 అడుగుల కలియుగ శ్రీవెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన గురువారం శ్రీమన్ వేణుగోపాల చారి కౌసీక ప్రారంభించనున్నారు శ్రీ వెంకటేశ్వరస్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లోలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3డి సైకత శిల్ప ప్రదర్శన తేదీ 5 గురువారం రోజు నుండి భక్తుల కొరకై ఏర్పాటు చేసిన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3డి సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శ్రీమాన్ నంబి వేణుగోపాల చారి కౌశిక గారిచే ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రారంభిస్తారని కావున పట్టణ హిందూ బంధువులు స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రోగ్రాం ఆర్గనైజర్ వేముల ఉమారాణి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు1
- సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల్లా నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. వేములవాడను అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, వేములవాడ అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే... వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంతపాడుతున్నారని విమర్శించారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని, డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు.1
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యానికి తాళం వేసిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు చెల్లించడం లేదని గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామ్మూర్తి1
- కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు ఆయన వెల్లడించారు.చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన సుశీలమ్మ (85) అనే వృద్ధురాలి హత్య కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. సుశీలమ్మ ఇంట్లో పని చేసే పని మనిషి కవిత (36) బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన కవిత, ఆమె తలపై బండరాయితో బాదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న కమ్మలు, ఉంగరం (రింగ్)తో పాటు సెల్‌ఫోన్‌ను కూడా తీసుకుని పరారైనట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన దుండిగల్ పోలీసులు, ఎస్‌ఓటీ కుత్బుల్లాపూర్, సీసీఎస్ పోలీసులను ఏసీపీ శంకర్ రెడ్డి అభినందించారు.5
- హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.1
- గాంధారి మండలం ఎక్కాకుంటా తండాకు ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బస్సు లేక తండా విద్యార్థులు నిత్యం 4 కిలోమీటర్ల మేర కాలినడకన బడికి వెళ్లాల్సి వచ్చేది. స్థానికుల విన్నపం మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బుధవారం నుంచి బస్సు సర్వీసు ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా ఈ బస్సు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.1
- *ఈరోజుకు కూడా నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే నే... ఎమ్మెల్యే సంజయ్* జగిత్యాల ఫిబ్రవరి 4 ; లోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్..నేను జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న..గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.. అదే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లెటర్ రావడం జరిగింది..ఆ తర్వాత జూన్ నెలలో నేను అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాను అని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా ఆస్పత్రి ఇంటిపై బి ఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారు..కనీసం నా నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు. అదే రోజు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు లేఖ రాశారు..నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు..ఇప్పటివరకు బి ఆర్ ఎస్ అధిష్టానాన్ని, స్థానిక నాయకులను నేను విమర్శించలేదు. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న మంత్రులు కూడా అందుకు సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను.1
- సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం1