Shuru
Apke Nagar Ki App…
సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Sangareddy News
సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
More news from Medchal Malkajgiri and nearby areas
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు4
- పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్ (35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మానసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఈ నెల 3వ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ.మహేష్ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గండికోట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.1
- ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి బుధవారం పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పరిశీలించారు. స్కూల్, కళాశాల ఆవరణల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని సీ నారాయణరెడ్డి కళా మందిరాల్లో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళా మందిరం లోపల స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కోసం చేస్తున్న ఏర్పాట్లను సందర్శిచారు. వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు. పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.1
- హిందుత్వం తమకు ఓట్ల కోసం వాడే ఆయుధం కాదని, అది తమ డీఎన్‌ఏలోనే ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అవినీతి కోసమే హిందుత్వాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి గత 17ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.8 కోట్ల మున్సిపల్ బకాయిలను ఇప్పుడు చెల్లించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- జహీరాబాద్ లో ముమ్మరంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం1
- ఉప్పల్, నియోజకవర్గం షబ్-ఎ-బరాత్ పవిత్ర సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాలకు చెందిన ముస్లిం మైనారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో అడవిలా పెరిగిన చెట్ల తొలగింపు, పరిసరాల శుభ్రత, గోడలు మరియు సమాధులకు రంగుల వేయింపు, భక్తుల సౌకర్యార్థం లైట్ల ఏర్పాటు వంటి పనులు పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ప్రజా ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఖబ్రస్తాన్లు, మసీదులు, మైనారిటీ సంక్షేమ పథకాల ద్వారా విస్తృత అభివృద్ధి జరుగుతోందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా పండుగల సందర్భంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వారు పేర్కొన్నారు. ఇటీవల కొందరు నాయకులు ఖబ్రస్తాన్‌కు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం ఫోటోలు దిగడం, ప్రచారం చేసుకోవడానికే పరిమితమయ్యారని ముస్లిం సమాజం ప్రజలు విమర్శించారు. అలాంటి చూపుడు మాటలకు భిన్నంగా ఎలాంటి ప్రచారం లేకుండా ప్రజల అవసరాలను గుర్తించి నిశ్శబ్దంగా పనులు చేసిన నాయకుడు మందమూల పరమేశ్వర్ రెడ్డిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా అత్యంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఖబ్రస్తాన్ అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని పనులు పూర్తి చేయడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల పట్ల ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాల ముస్లిం మైనారిటీ ప్రజలు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తూ మందమూల పరమేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.2
- గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...1