ఎల్లంపేటలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్–బీఆర్‌ఎస్ హామీలు విఫలం: ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...1
- లైకుల వేటలో.. చావుతో ఆట! చావు అంచున చౌకబారు స్టంట్లు... వైరల్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది! ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. దూసుకొస్తున్న రైలు... మధ్యలో పట్టాలపై పడుకున్న యువకుడు! ఒక్క సెకను తేడా జరిగినా... ఒక్క ఇంచు అటు ఇటైనా మనిషి ముక్కలైపోయే పరిస్థితి. అయినా సరే ఆ యువకుడికి ఏమాత్రం భయం లేదు. ఈ భయంకరమైన స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవ్వాలనే కోరికతో ఇలాంటి ప్రాణాంతక పనులు చేయడం సాహసం కాదని... అది కేవలం "మూర్ఖత్వమేనని" ఆయన మండిపడ్డారు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని... బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుంచుకోండి సోషల్ మీడియాలో వచ్చే లైకులు "మీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు1
- కేశంపేట మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు దుప్పట్లు, మఫ్లర్లతో చలిని తట్టుకుంటున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. చలి ప్రభావంతో జ్వరాలు, దగ్గు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.1
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.1
- మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభావాలకు తావు లేదుఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు తావు లేదని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు రవి కిరణ్ అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవోలు ,మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నిక జరగాలని, ఎవరైనా బలవంతంగా ప్రలోభాలు చేసిన, బెదిరించిన, చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.1
- సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.1
- సంగారెడ్డి జిల్లా కల్ప గురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.1
- హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. మున్సిపల్ ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఆమోదిస్తూ 20 సీట్లు గెలిపిస్తే మాకు నూతన ఉత్సాహంగా మరింత పని చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. హుస్నాబాద్ లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్ళామన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, 250 పడకల ఆసుపత్రి, ఇండస్ట్రియల్ కారీడార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ కి ఒక విద్యాసంస్థ వస్తే బాగుంటుంది అని కోరుకున్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది.. 35 ఎకరాల్లో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి సెట్విన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. భవిష్యత్ లో పట్టణంలో ముంపు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేదని.. తాము పట్టణంలోనే 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.1
- అప్పుల బాధ తాళలేక బక్కగారి భీమయ్య 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలీఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుందని ఘన్పూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బక్కగారీ భార్య గారి దుర్గమ్మ పిర్యాదు మేరకుఎస్ఐ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇలా జనరల్ ఆసుపత్రి తరలించారు కూతురు వివాహానికి ఇల్లు నిర్మించడానికి అప్పు తెచ్చారని అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదులో భార్య పేర్కొన్నారు.శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రి తరలించారు.1