logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సంగారెడ్డిలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కాలనీవాసులతో ఆత్మీయ సంభాషణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.

13 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
13 hrs ago

సంగారెడ్డిలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కాలనీవాసులతో ఆత్మీయ సంభాషణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫారం లను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
    1
    సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫారం లను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, 
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు.
పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు.
గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    Kapra, Medchal Malkajgiri•
    2 hrs ago
  • అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    4
    అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు*
*వారి  కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె  సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    4 hrs ago
  • మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభావాలకు తావు లేదుఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు తావు లేదని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు రవి కిరణ్ అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవోలు ,మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నిక జరగాలని, ఎవరైనా బలవంతంగా ప్రలోభాలు చేసిన, బెదిరించిన, చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభావాలకు తావు లేదుఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు 
మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి  కిరణ్ 
మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు తావు లేదని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు రవి కిరణ్ అన్నారు.
మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవోలు ,మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. 
వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నిక జరగాలని, ఎవరైనా బలవంతంగా ప్రలోభాలు చేసిన, బెదిరించిన, చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • చావు అంచున చౌకబారు స్టంట్లు... వైరల్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది! ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ​దూసుకొస్తున్న రైలు... మధ్యలో పట్టాలపై పడుకున్న యువకుడు! ఒక్క సెకను తేడా జరిగినా... ఒక్క ఇంచు అటు ఇటైనా మనిషి ముక్కలైపోయే పరిస్థితి. అయినా సరే ఆ యువకుడికి ఏమాత్రం భయం లేదు. ఈ భయంకరమైన స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. ​ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైరల్ అవ్వాలనే కోరికతో ఇలాంటి ప్రాణాంతక పనులు చేయడం సాహసం కాదని... అది కేవలం "మూర్ఖత్వమేనని" ఆయన మండిపడ్డారు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని... బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుంచుకోండి.. సోషల్ మీడియాలో వచ్చే లైకులు "మీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు
    1
    చావు అంచున చౌకబారు స్టంట్లు... వైరల్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది! ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
​దూసుకొస్తున్న రైలు... మధ్యలో పట్టాలపై పడుకున్న యువకుడు! ఒక్క సెకను తేడా జరిగినా... ఒక్క ఇంచు అటు ఇటైనా మనిషి ముక్కలైపోయే పరిస్థితి. అయినా సరే ఆ యువకుడికి ఏమాత్రం భయం లేదు. ఈ భయంకరమైన స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు.
​ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైరల్ అవ్వాలనే కోరికతో ఇలాంటి ప్రాణాంతక పనులు చేయడం సాహసం కాదని... అది కేవలం "మూర్ఖత్వమేనని" ఆయన మండిపడ్డారు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని... బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు.
గుర్తుంచుకోండి.. సోషల్ మీడియాలో వచ్చే లైకులు "మీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    23 hrs ago
  • పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
    1
    పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ ప్రచారం ముమ్మరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నక్క సంతోష రాములు గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, 15వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న నక్క సంతోష రాములు గౌడ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు అలాగే, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నామని ఆశీర్వదించాలని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ ప్రచారం ముమ్మరం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నక్క సంతోష రాములు గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, 15వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న నక్క సంతోష రాములు గౌడ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు అలాగే, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నామని ఆశీర్వదించాలని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    17 hrs ago
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.