Shuru
Apke Nagar Ki App…
ఏడవ వార్డు అభ్యర్థి ఎన్ సి సంతోష్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవి రవీందర్ గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...
Gousuddin Md
ఏడవ వార్డు అభ్యర్థి ఎన్ సి సంతోష్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవి రవీందర్ గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...
More news from Hyderabad and nearby areas
- లైకుల వేటలో.. చావుతో ఆట! చావు అంచున చౌకబారు స్టంట్లు... వైరల్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది! ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. దూసుకొస్తున్న రైలు... మధ్యలో పట్టాలపై పడుకున్న యువకుడు! ఒక్క సెకను తేడా జరిగినా... ఒక్క ఇంచు అటు ఇటైనా మనిషి ముక్కలైపోయే పరిస్థితి. అయినా సరే ఆ యువకుడికి ఏమాత్రం భయం లేదు. ఈ భయంకరమైన స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవ్వాలనే కోరికతో ఇలాంటి ప్రాణాంతక పనులు చేయడం సాహసం కాదని... అది కేవలం "మూర్ఖత్వమేనని" ఆయన మండిపడ్డారు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని... బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుంచుకోండి సోషల్ మీడియాలో వచ్చే లైకులు "మీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు1
- ఉప్పల్, నియోజకవర్గం షబ్-ఎ-బరాత్ పవిత్ర సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాలకు చెందిన ముస్లిం మైనారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో అడవిలా పెరిగిన చెట్ల తొలగింపు, పరిసరాల శుభ్రత, గోడలు మరియు సమాధులకు రంగుల వేయింపు, భక్తుల సౌకర్యార్థం లైట్ల ఏర్పాటు వంటి పనులు పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ప్రజా ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఖబ్రస్తాన్లు, మసీదులు, మైనారిటీ సంక్షేమ పథకాల ద్వారా విస్తృత అభివృద్ధి జరుగుతోందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా పండుగల సందర్భంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వారు పేర్కొన్నారు. ఇటీవల కొందరు నాయకులు ఖబ్రస్తాన్‌కు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం ఫోటోలు దిగడం, ప్రచారం చేసుకోవడానికే పరిమితమయ్యారని ముస్లిం సమాజం ప్రజలు విమర్శించారు. అలాంటి చూపుడు మాటలకు భిన్నంగా ఎలాంటి ప్రచారం లేకుండా ప్రజల అవసరాలను గుర్తించి నిశ్శబ్దంగా పనులు చేసిన నాయకుడు మందమూల పరమేశ్వర్ రెడ్డిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా అత్యంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఖబ్రస్తాన్ అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని పనులు పూర్తి చేయడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల పట్ల ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాల ముస్లిం మైనారిటీ ప్రజలు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తూ మందమూల పరమేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.2
- కేశంపేట మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు దుప్పట్లు, మఫ్లర్లతో చలిని తట్టుకుంటున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. చలి ప్రభావంతో జ్వరాలు, దగ్గు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.1
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.1
- మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభావాలకు తావు లేదుఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు తావు లేదని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు రవి కిరణ్ అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవోలు ,మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నిక జరగాలని, ఎవరైనా బలవంతంగా ప్రలోభాలు చేసిన, బెదిరించిన, చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.1
- చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.1
- సంగారెడ్డి జిల్లా కల్ప గురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.1
- అప్పుల బాధ తాళలేక బక్కగారి భీమయ్య 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలీఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుందని ఘన్పూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బక్కగారీ భార్య గారి దుర్గమ్మ పిర్యాదు మేరకుఎస్ఐ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇలా జనరల్ ఆసుపత్రి తరలించారు కూతురు వివాహానికి ఇల్లు నిర్మించడానికి అప్పు తెచ్చారని అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదులో భార్య పేర్కొన్నారు.శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రి తరలించారు.1
- మిర్యాలగూడ మున్సిపాలిటీలో 5 వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు పాల్గొని అశేష జన వాహిని సమక్షంలో ఇంటింటికి తిరిగి కేతావత్ జయమ్మ జవహర్ నాయక్ గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం కావున కేతావ జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు కాంగ్రెస్ పట్టణ నాయకులు కేతావత్ జవహర్ నాయక్ గారు అదే విధంగా మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప గారు ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.1