Shuru
Apke Nagar Ki App…
అధికార పార్టీకి అండగా చిట్యాల ప్రజానీకం.. ఎమ్మెల్యే వీరేశం తో మహిళ మాట ముచ్చట చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.
Journalist Prem
అధికార పార్టీకి అండగా చిట్యాల ప్రజానీకం.. ఎమ్మెల్యే వీరేశం తో మహిళ మాట ముచ్చట చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దబోయిన దేవేంద్ర యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కకపోవడంతోనే బీఆర్ఎస్‌లో చేరినట్లు దేవేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.1
- ఉప్పల్, నియోజకవర్గం షబ్-ఎ-బరాత్ పవిత్ర సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాలకు చెందిన ముస్లిం మైనారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో అడవిలా పెరిగిన చెట్ల తొలగింపు, పరిసరాల శుభ్రత, గోడలు మరియు సమాధులకు రంగుల వేయింపు, భక్తుల సౌకర్యార్థం లైట్ల ఏర్పాటు వంటి పనులు పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ప్రజా ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఖబ్రస్తాన్లు, మసీదులు, మైనారిటీ సంక్షేమ పథకాల ద్వారా విస్తృత అభివృద్ధి జరుగుతోందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా పండుగల సందర్భంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వారు పేర్కొన్నారు. ఇటీవల కొందరు నాయకులు ఖబ్రస్తాన్‌కు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం ఫోటోలు దిగడం, ప్రచారం చేసుకోవడానికే పరిమితమయ్యారని ముస్లిం సమాజం ప్రజలు విమర్శించారు. అలాంటి చూపుడు మాటలకు భిన్నంగా ఎలాంటి ప్రచారం లేకుండా ప్రజల అవసరాలను గుర్తించి నిశ్శబ్దంగా పనులు చేసిన నాయకుడు మందమూల పరమేశ్వర్ రెడ్డిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా అత్యంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఖబ్రస్తాన్ అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని పనులు పూర్తి చేయడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల పట్ల ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాల ముస్లిం మైనారిటీ ప్రజలు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తూ మందమూల పరమేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.2
- గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...1
- లైకుల వేటలో.. చావుతో ఆట! చావు అంచున చౌకబారు స్టంట్లు... వైరల్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది! ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. దూసుకొస్తున్న రైలు... మధ్యలో పట్టాలపై పడుకున్న యువకుడు! ఒక్క సెకను తేడా జరిగినా... ఒక్క ఇంచు అటు ఇటైనా మనిషి ముక్కలైపోయే పరిస్థితి. అయినా సరే ఆ యువకుడికి ఏమాత్రం భయం లేదు. ఈ భయంకరమైన స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవ్వాలనే కోరికతో ఇలాంటి ప్రాణాంతక పనులు చేయడం సాహసం కాదని... అది కేవలం "మూర్ఖత్వమేనని" ఆయన మండిపడ్డారు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని... బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుంచుకోండి సోషల్ మీడియాలో వచ్చే లైకులు "మీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు1
- *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.1
- ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.1
- పదవుల కోసం ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మంగళవారం నకరికల్లు నియోజకవర్గం లో విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మహిళలపై దాడి చేసి నేడు మరోసారి ఓట్లు వేయమని అడిగేందుకు వస్తున్నాడని చెప్పారు. అప్రమత్తతతో ప్రజలు తమకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.1
- వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కొండేటి రజిత–సాంబయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొండేటి రజితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- మారుతున్న జీవనశైలి మానసిక ఒత్తిడి ఆహార కల్తి వంటి కారణాలవల్ల విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు మనం తీసుకునే ఆహారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.1