*మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
*మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
- లైకుల వేటలో.. చావుతో ఆట! చావు అంచున చౌకబారు స్టంట్లు... వైరల్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది! ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. దూసుకొస్తున్న రైలు... మధ్యలో పట్టాలపై పడుకున్న యువకుడు! ఒక్క సెకను తేడా జరిగినా... ఒక్క ఇంచు అటు ఇటైనా మనిషి ముక్కలైపోయే పరిస్థితి. అయినా సరే ఆ యువకుడికి ఏమాత్రం భయం లేదు. ఈ భయంకరమైన స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవ్వాలనే కోరికతో ఇలాంటి ప్రాణాంతక పనులు చేయడం సాహసం కాదని... అది కేవలం "మూర్ఖత్వమేనని" ఆయన మండిపడ్డారు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని... బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుంచుకోండి సోషల్ మీడియాలో వచ్చే లైకులు "మీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు1
- గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...1
- ఉప్పల్, నియోజకవర్గం షబ్-ఎ-బరాత్ పవిత్ర సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాలకు చెందిన ముస్లిం మైనారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో అడవిలా పెరిగిన చెట్ల తొలగింపు, పరిసరాల శుభ్రత, గోడలు మరియు సమాధులకు రంగుల వేయింపు, భక్తుల సౌకర్యార్థం లైట్ల ఏర్పాటు వంటి పనులు పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ప్రజా ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఖబ్రస్తాన్లు, మసీదులు, మైనారిటీ సంక్షేమ పథకాల ద్వారా విస్తృత అభివృద్ధి జరుగుతోందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా పండుగల సందర్భంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వారు పేర్కొన్నారు. ఇటీవల కొందరు నాయకులు ఖబ్రస్తాన్‌కు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం ఫోటోలు దిగడం, ప్రచారం చేసుకోవడానికే పరిమితమయ్యారని ముస్లిం సమాజం ప్రజలు విమర్శించారు. అలాంటి చూపుడు మాటలకు భిన్నంగా ఎలాంటి ప్రచారం లేకుండా ప్రజల అవసరాలను గుర్తించి నిశ్శబ్దంగా పనులు చేసిన నాయకుడు మందమూల పరమేశ్వర్ రెడ్డిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ ముస్లిం ఖబ్రస్తాన్‌లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా అత్యంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఖబ్రస్తాన్ అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని పనులు పూర్తి చేయడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల పట్ల ఉప్పల్, బీరప్పగడ్డ ప్రాంతాల ముస్లిం మైనారిటీ ప్రజలు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తూ మందమూల పరమేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.2
- చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.1
- సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫారం లను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.1
- Post by Shobana N4
- మిర్యాలగూడ మున్సిపాలిటీలో 5 వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు పాల్గొని అశేష జన వాహిని సమక్షంలో ఇంటింటికి తిరిగి కేతావత్ జయమ్మ జవహర్ నాయక్ గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం కావున కేతావ జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు కాంగ్రెస్ పట్టణ నాయకులు కేతావత్ జవహర్ నాయక్ గారు అదే విధంగా మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప గారు ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.1
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.1
- వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ ప్రచారం ముమ్మరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నక్క సంతోష రాములు గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, 15వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న నక్క సంతోష రాములు గౌడ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు అలాగే, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నామని ఆశీర్వదించాలని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1