Shuru
Apke Nagar Ki App…
10వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం.. కొండేటి రజితకు మద్దతు కోరిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కొండేటి రజిత–సాంబయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొండేటి రజితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
M D Azizuddin
10వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం.. కొండేటి రజితకు మద్దతు కోరిన ఎమ్మెల్యే నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కొండేటి రజిత–సాంబయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొండేటి రజితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మారుతున్న జీవనశైలి మానసిక ఒత్తిడి ఆహార కల్తి వంటి కారణాలవల్ల విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు మనం తీసుకునే ఆహారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.1
- కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.1
- మిర్యాలగూడ మున్సిపాలిటీలో 5 వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు పాల్గొని అశేష జన వాహిని సమక్షంలో ఇంటింటికి తిరిగి కేతావత్ జయమ్మ జవహర్ నాయక్ గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం కావున కేతావ జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు కాంగ్రెస్ పట్టణ నాయకులు కేతావత్ జవహర్ నాయక్ గారు అదే విధంగా మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప గారు ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.1
- సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల తనిఖీలో భాగంగా తంగళ్ళపల్లి నుండి సిరిసిల్ల వైపు వస్తున్న ఓ విస్టా కార్ లో (1,40,000) లక్షా నలభై వేల రూపాయలను ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ అధికారులు. స్వాధీనం చేసుకున్నారు1
- వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ ప్రచారం ముమ్మరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నక్క సంతోష రాములు గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, 15వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న నక్క సంతోష రాములు గౌడ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు అలాగే, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నామని ఆశీర్వదించాలని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కొండేటి రజిత–సాంబయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొండేటి రజితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అస్మిత అనే విద్యార్థిని పాముకాటుకు గురైంది దీంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కరీంనగర్ తేజాస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. డిఫెన్స్ లో 30 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తెజాస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల జరిగిన ఇండియన్ నేవీ పరీక్షలో 15 మంది, ఎస్ఎస్సీ జీడిలో 15 మంది ఉద్యోగులు సాధించారని చెప్పారు. వారందరూ ఈనెలాఖరులో శిక్షణలో జాయిన్ అవుతారని తెలిపారు. తేజాస్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభించి 15 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే విద్యాసంవత్సరం 2026-27 నుంచి బాలికలకు సైతం డిఫెన్స్ లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తేజాస్ అకాడమీ విద్యార్థులు ఐఐటి, నీట్ లో ప్రతిభ కనబర్చేలా ఎలవాటే అనే ప్రోగ్రాం ప్రారంభించామని, శ్రీ చైతన్య ఇన్ఫినిటి లెర్న్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. డిఫెన్స్ తో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ప్రతిభ కనబర్చేలా తేజాస్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు అడ్మిషన్ తీసుకోవాలని కోరారు.2