logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ బిఆర్ఎస్ కు సింగిల్ డిజిట్...మేయర్ పీఠం బిజేపి దే... కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు.‌ ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.

10 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
10 hrs ago

కాంగ్రెస్ బిఆర్ఎస్ కు సింగిల్ డిజిట్...మేయర్ పీఠం బిజేపి దే... కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు.‌ ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు.‌ ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.
    1
    కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్  తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. 
ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు.‌ ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు  కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు  సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో  1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్  అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్  రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన... జగిత్యాల ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    1
    కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన...
జగిత్యాల ఫిబ్రవరి 3  :  మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం  కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు
బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల  హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు 
ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    18 hrs ago
  • డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు... ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝
    1
    డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు...
ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Hanamkonda, Hanumakonda•
    4 hrs ago
  • బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
    1
    బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 min ago
  • హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
    2
    హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్ తేజాస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.‌ డిఫెన్స్ లో 30 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తెజాస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల జరిగిన ఇండియన్ నేవీ పరీక్షలో 15 మంది, ఎస్ఎస్సీ జీడిలో 15 మంది ఉద్యోగులు సాధించారని చెప్పారు. వారందరూ ఈనెలాఖరులో శిక్షణలో జాయిన్ అవుతారని తెలిపారు. తేజాస్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభించి 15 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే విద్యాసంవత్సరం 2026-27 నుంచి బాలికలకు సైతం డిఫెన్స్ లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తేజాస్ అకాడమీ విద్యార్థులు ఐఐటి, నీట్ లో ప్రతిభ కనబర్చేలా ఎలవాటే అనే ప్రోగ్రాం ప్రారంభించామని, శ్రీ చైతన్య ఇన్ఫినిటి లెర్న్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. డిఫెన్స్ తో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ప్రతిభ కనబర్చేలా తేజాస్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు అడ్మిషన్ తీసుకోవాలని కోరారు.
    2
    కరీంనగర్ తేజాస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.‌ డిఫెన్స్ లో 30 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తెజాస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల జరిగిన ఇండియన్ నేవీ పరీక్షలో 15 మంది, ఎస్ఎస్సీ జీడిలో 15 మంది ఉద్యోగులు సాధించారని చెప్పారు. వారందరూ ఈనెలాఖరులో శిక్షణలో జాయిన్ అవుతారని తెలిపారు. తేజాస్  డిఫెన్స్ అకాడమీ ప్రారంభించి 15 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే విద్యాసంవత్సరం 2026-27 నుంచి బాలికలకు సైతం డిఫెన్స్ లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తేజాస్ అకాడమీ విద్యార్థులు ఐఐటి, నీట్ లో ప్రతిభ కనబర్చేలా ఎలవాటే అనే ప్రోగ్రాం ప్రారంభించామని,  శ్రీ చైతన్య ఇన్ఫినిటి లెర్న్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. డిఫెన్స్ తో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ప్రతిభ కనబర్చేలా తేజాస్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు అడ్మిషన్ తీసుకోవాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల తనిఖీలో భాగంగా తంగళ్ళపల్లి నుండి సిరిసిల్ల వైపు వస్తున్న ఓ విస్టా కార్ లో (1,40,000) లక్షా నలభై వేల రూపాయలను ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ అధికారులు. స్వాధీనం చేసుకున్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల తనిఖీలో భాగంగా తంగళ్ళపల్లి నుండి సిరిసిల్ల వైపు వస్తున్న ఓ విస్టా కార్ లో (1,40,000) లక్షా నలభై వేల రూపాయలను ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ అధికారులు. స్వాధీనం చేసుకున్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా ఆలయ లడ్డు సత్రంలో ఈరోజు 1500కు పైగా లడ్డు ట్రేలు వేడి నీరు మరియు సర్ఫ్ ఉపయోగించి శుభ్రపరచి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.ఈ పనులను ఆలయ లడ్డు సత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టగా, పనుల నాణ్యతను సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా ఆలయ లడ్డు సత్రంలో ఈరోజు 1500కు పైగా లడ్డు ట్రేలు వేడి నీరు మరియు సర్ఫ్ ఉపయోగించి శుభ్రపరచి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.ఈ పనులను ఆలయ లడ్డు సత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టగా, పనుల నాణ్యతను సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ కుమార్  ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.