logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

6 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
6 hrs ago

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మారుతున్న జీవనశైలి మానసిక ఒత్తిడి ఆహార కల్తి వంటి కారణాలవల్ల విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు మనం తీసుకునే ఆహారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
    1
    మారుతున్న జీవనశైలి మానసిక ఒత్తిడి ఆహార కల్తి వంటి కారణాలవల్ల విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు మనం తీసుకునే ఆహారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల హడావుడి జోరందుకుంది. 40వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గంగుల దీప్తి చెందును మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రకటించారు. అనంతరం బీఫామ్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల హడావుడి జోరందుకుంది. 40వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గంగుల దీప్తి చెందును మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రకటించారు. అనంతరం బీఫామ్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    12 min ago
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ గ్రామంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మరియు ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ , చొప్పదండి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభా స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ గ్రామంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మరియు ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ , చొప్పదండి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభా స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు.‌ ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.
    1
    కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్  తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. 
ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు.‌ ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.
    1
    సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    19 hrs ago
  • వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ ప్రచారం ముమ్మరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నక్క సంతోష రాములు గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, 15వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న నక్క సంతోష రాములు గౌడ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు అలాగే, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నామని ఆశీర్వదించాలని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ ప్రచారం ముమ్మరం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నక్క సంతోష రాములు గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, 15వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న నక్క సంతోష రాములు గౌడ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు అలాగే, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నామని ఆశీర్వదించాలని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కొండేటి రజిత–సాంబయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొండేటి రజితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    1
    వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కొండేటి రజిత–సాంబయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కొండేటి రజితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అస్మిత అనే విద్యార్థిని పాముకాటుకు గురైంది దీంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అస్మిత అనే విద్యార్థిని పాముకాటుకు గురైంది దీంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు అభ్యర్థి మల్లమ్మ ఆత్మహత్యాయత్నం చేయటం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే 17వ వార్డు అభ్యర్థిగా పోటీలో ఉండి మల్లమ్మ తన నామినేషన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో వార్డు సభ్యులు ఇతర పార్టీల నుంచి భారీగా డబ్బు తీసుకుందని ఆరోపణలు చేస్తున్నడంతో తట్టుకోలేక మల్లమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు గమనించిన వెంటనే ఆమెను కాపాడారు.
    1
    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు అభ్యర్థి మల్లమ్మ ఆత్మహత్యాయత్నం చేయటం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే 17వ వార్డు అభ్యర్థిగా పోటీలో ఉండి మల్లమ్మ తన నామినేషన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో వార్డు సభ్యులు ఇతర పార్టీల నుంచి భారీగా డబ్బు తీసుకుందని ఆరోపణలు చేస్తున్నడంతో తట్టుకోలేక మల్లమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు గమనించిన వెంటనే ఆమెను కాపాడారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.