ఎన్నికలు లేకపోయినా ఎలక్షన్ హీట్… సిద్దిపేటలో హై వోల్టేజ్ పాలిటిక్స్ కార్డుల యుద్ధం… బీఆర్ఎస్ బాకీ కార్డు @ కాంగ్రెస్ డోకా కార్డు సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.

- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ ఇవే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్స్ లో రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్... అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ద్రుష్టి సారించాలని హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా కాన్ఫిడెన్స్ తో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల ద్రుష్టి అంతా కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల తనిఖీలో భాగంగా తంగళ్ళపల్లి నుండి సిరిసిల్ల వైపు వస్తున్న ఓ విస్టా కార్ లో (1,40,000) లక్షా నలభై వేల రూపాయలను ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ అధికారులు. స్వాధీనం చేసుకున్నారు1
- ఎల్లారెడ్డి మండలంలోని మౌలానిఖేడ్ గ్రామానికి చెందిన మారటి పోచయ్య (45) మూడు రోజుల రోజుల క్రితం బైక్పై వెళ్తుండగా రోడ్డుపైకి అకస్మాత్తుగా పందులు అడ్డురావడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- మెదక్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 30వ వార్డు నుండి అరుణతి వెంకటరమణ కవిత ఆస్తి కోసం పంచాయతీ నడుస్తుందని అన్నారు ప్రజల కోసం ప్రజాపాలన చేస్తున్న ము పారి పాలన చూసిన ప్రజలు మున్సిపల్ లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు మెదక్ మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు పాల్గొన్నారు.1
- హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా ఆలయ లడ్డు సత్రంలో ఈరోజు 1500కు పైగా లడ్డు ట్రేలు వేడి నీరు మరియు సర్ఫ్ ఉపయోగించి శుభ్రపరచి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.ఈ పనులను ఆలయ లడ్డు సత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టగా, పనుల నాణ్యతను సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు1
- కరీంనగర్ తేజాస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. డిఫెన్స్ లో 30 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తెజాస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల జరిగిన ఇండియన్ నేవీ పరీక్షలో 15 మంది, ఎస్ఎస్సీ జీడిలో 15 మంది ఉద్యోగులు సాధించారని చెప్పారు. వారందరూ ఈనెలాఖరులో శిక్షణలో జాయిన్ అవుతారని తెలిపారు. తేజాస్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభించి 15 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే విద్యాసంవత్సరం 2026-27 నుంచి బాలికలకు సైతం డిఫెన్స్ లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తేజాస్ అకాడమీ విద్యార్థులు ఐఐటి, నీట్ లో ప్రతిభ కనబర్చేలా ఎలవాటే అనే ప్రోగ్రాం ప్రారంభించామని, శ్రీ చైతన్య ఇన్ఫినిటి లెర్న్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. డిఫెన్స్ తో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ప్రతిభ కనబర్చేలా తేజాస్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు అడ్మిషన్ తీసుకోవాలని కోరారు.2
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కొన్ని ఏళ్ల నుంచి పరిశుభ్రం చేయక పోవడం చేత, ట్యాంక్ లో ఒక పీట్ వరకు బురద చేరి గ్రామంలో నీటి సరఫరాకు అంతరాయం కలగడంతో సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందిచే శుభ్రం చేయించి నీటి సరఫరా పునరుద్ధరించారు ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ శంకరయ్యను గ్రామస్తులు అభినందించారు1