logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పదవుల కోసం ఓట్లు అడిగేందుకు వచ్చేవారి పట్ల అప్రమత్తత అవసరం.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య పదవుల కోసం ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మంగళవారం నకరికల్లు నియోజకవర్గం లో విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మహిళలపై దాడి చేసి నేడు మరోసారి ఓట్లు వేయమని అడిగేందుకు వస్తున్నాడని చెప్పారు. అప్రమత్తతతో ప్రజలు తమకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

16 hrs ago
user_Journalist Prem
Journalist Prem
Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
16 hrs ago

పదవుల కోసం ఓట్లు అడిగేందుకు వచ్చేవారి పట్ల అప్రమత్తత అవసరం.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య పదవుల కోసం ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మంగళవారం నకరికల్లు నియోజకవర్గం లో విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మహిళలపై దాడి చేసి నేడు మరోసారి ఓట్లు వేయమని అడిగేందుకు వస్తున్నాడని చెప్పారు. అప్రమత్తతతో ప్రజలు తమకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.
    1
    చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో
గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా  మహిళ మాట్లాడుతూ –
గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు…
కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి,
సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    16 hrs ago
  • Post by Shobana N
    4
    Post by Shobana N
    user_Shobana N
    Shobana N
    Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    22 hrs ago
  • హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
    1
    హైదరాబాద్, 
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్  ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్  నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్  నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
    user_Suresh Sagar
    Suresh Sagar
    Kapra, Medchal Malkajgiri•
    40 min ago
  • హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
    2
    హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    4
    అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు*
*వారి  కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె  సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    6 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
    1
    *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.*
అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు.
బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    20 hrs ago
  • మిర్యాలగూడ మున్సిపాలిటీలో 5 వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు పాల్గొని అశేష జన వాహిని సమక్షంలో ఇంటింటికి తిరిగి కేతావత్ జయమ్మ జవహర్ నాయక్ గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం కావున కేతావ జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు కాంగ్రెస్ పట్టణ నాయకులు కేతావత్ జవహర్ నాయక్ గారు అదే విధంగా మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప గారు ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
    1
    మిర్యాలగూడ మున్సిపాలిటీలో  5 వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు పాల్గొని అశేష జన వాహిని  సమక్షంలో ఇంటింటికి తిరిగి కేతావత్ జయమ్మ జవహర్ నాయక్ గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం కావున కేతావ జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు కాంగ్రెస్ పట్టణ నాయకులు కేతావత్ జవహర్ నాయక్ గారు అదే విధంగా మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప గారు ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.