Shuru
Apke Nagar Ki App…
వాడిగ్రామంలో బీమయ్య ఆత్మహత్య అప్పుల బాధ తాళలేక బక్కగారి భీమయ్య 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలీఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుందని ఘన్పూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బక్కగారీ భార్య గారి దుర్గమ్మ పిర్యాదు మేరకుఎస్ఐ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇలా జనరల్ ఆసుపత్రి తరలించారు కూతురు వివాహానికి ఇల్లు నిర్మించడానికి అప్పు తెచ్చారని అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదులో భార్య పేర్కొన్నారు.శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రి తరలించారు.
మెదక్ న్యూస్
వాడిగ్రామంలో బీమయ్య ఆత్మహత్య అప్పుల బాధ తాళలేక బక్కగారి భీమయ్య 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలీఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుందని ఘన్పూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బక్కగారీ భార్య గారి దుర్గమ్మ పిర్యాదు మేరకుఎస్ఐ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇలా జనరల్ ఆసుపత్రి తరలించారు కూతురు వివాహానికి ఇల్లు నిర్మించడానికి అప్పు తెచ్చారని అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదులో భార్య పేర్కొన్నారు.శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రి తరలించారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎల్లారెడ్డి మండలంలోని మౌలానిఖేడ్ గ్రామానికి చెందిన మారటి పోచయ్య (45) మూడు రోజుల రోజుల క్రితం బైక్పై వెళ్తుండగా రోడ్డుపైకి అకస్మాత్తుగా పందులు అడ్డురావడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలోని రాంనగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తమ కాలనీవాసులు మరియు మిత్రులతో ఆత్మీయంగా పలకరించారు. నవ్వుకొని గత స్మృతులను స్మరించుకున్నారు.1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. మున్సిపల్ ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఆమోదిస్తూ 20 సీట్లు గెలిపిస్తే మాకు నూతన ఉత్సాహంగా మరింత పని చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. హుస్నాబాద్ లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్ళామన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, 250 పడకల ఆసుపత్రి, ఇండస్ట్రియల్ కారీడార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ కి ఒక విద్యాసంస్థ వస్తే బాగుంటుంది అని కోరుకున్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది.. 35 ఎకరాల్లో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి సెట్విన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. భవిష్యత్ లో పట్టణంలో ముంపు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేదని.. తాము పట్టణంలోనే 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.1
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు4
- అప్పుల బాధ తాళలేక బక్కగారి భీమయ్య 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలీఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుందని ఘన్పూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బక్కగారీ భార్య గారి దుర్గమ్మ పిర్యాదు మేరకుఎస్ఐ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇలా జనరల్ ఆసుపత్రి తరలించారు కూతురు వివాహానికి ఇల్లు నిర్మించడానికి అప్పు తెచ్చారని అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదులో భార్య పేర్కొన్నారు.శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రి తరలించారు.1
- నస్రుల్లాబాద్: 'జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి' విద్యార్థులు జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పండరీ గౌడ్ సూచించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్ధులకు మండల స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పాఠవ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంకోల్ హైస్కూల్ హెడ్మాస్టర్ బాలరాజు, సీనియర్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు మల్లెపూల ఇందిర, శ్రీనివాస్, సాయిబాబా, రత్నం తదితరులు పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లా కల్ప గురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.1