Shuru
Apke Nagar Ki App…
నస్రుల్లాబాద్: 'జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి నస్రుల్లాబాద్: 'జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి' విద్యార్థులు జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పండరీ గౌడ్ సూచించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్ధులకు మండల స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పాఠవ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంకోల్ హైస్కూల్ హెడ్మాస్టర్ బాలరాజు, సీనియర్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు మల్లెపూల ఇందిర, శ్రీనివాస్, సాయిబాబా, రత్నం తదితరులు పాల్గొన్నారు.
Narmala Swapna
నస్రుల్లాబాద్: 'జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి నస్రుల్లాబాద్: 'జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి' విద్యార్థులు జీవశాస్త్ర సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పండరీ గౌడ్ సూచించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్ధులకు మండల స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పాఠవ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంకోల్ హైస్కూల్ హెడ్మాస్టర్ బాలరాజు, సీనియర్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు మల్లెపూల ఇందిర, శ్రీనివాస్, సాయిబాబా, రత్నం తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 30వ వార్డు నుండి అరుణతి వెంకటరమణ కవిత ఆస్తి కోసం పంచాయతీ నడుస్తుందని అన్నారు ప్రజల కోసం ప్రజాపాలన చేస్తున్న ము పారి పాలన చూసిన ప్రజలు మున్సిపల్ లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు మెదక్ మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు పాల్గొన్నారు.1
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.వారు మాట్లాడుతూ ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.గతంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని,గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ మీకు అండగా ఉన్నారని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించలని పిలుపునిచ్చారు.1
- విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చదువుకుంటే, జీవితమంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యను ఆయుధంగా మల్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధిని, విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్, విద్యార్థులకు పదవ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు పదవ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాలా సంసిద్దులు కావాలని సూచించారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. వార్షిక పరీక్షలు సమీపించినందున చదువు పైనే దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతీసారి తల్లితండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. పాఠాలను బట్టీ పట్టకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని ఉద్బోధించారు. ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణించాలని, తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడుల్లో చదివే వారు ఏ విషయంలోనూ వెనుకబడి ఉండరని విద్యార్థుల్లో కలెక్టర్ ఆత్మవిశ్వాసం కల్పించారు. చక్కగా చదువుకుని అందరూ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. పది పరీక్షల్లో ప్రతిభను చాటితే బిగ్ స్క్రీన్ పై టి.20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేయిస్తానని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునఃశ్చరణ జరిపించాలని ఉపాధ్యాయులకు, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలుగా అనువైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, వసతి గృహాల నిర్వాహకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.1
- వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ ప్రచారం ముమ్మరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నక్క సంతోష రాములు గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, 15వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న నక్క సంతోష రాములు గౌడ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు అలాగే, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నామని ఆశీర్వదించాలని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1
- "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు1
- గాంధారి మండలం ఎక్కాకుంటా తండాకు ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బస్సు లేక తండా విద్యార్థులు నిత్యం 4 కిలోమీటర్ల మేర కాలినడకన బడికి వెళ్లాల్సి వచ్చేది. స్థానికుల విన్నపం మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బుధవారం నుంచి బస్సు సర్వీసు ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా ఈ బస్సు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.1