logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

"కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు

19 hrs ago
user_Venu Gopal
Venu Gopal
Jagitial, Telangana•
19 hrs ago

"కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు

More news from తెలంగాణ and nearby areas
  • జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారి ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
    1
    జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ   విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారి ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు.
కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    39 min ago
  • పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్...మీరు నిజాయితీ పరులు, మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. గతంలో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట... ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండని కోరారు.
    1
    పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్...మీరు నిజాయితీ పరులు,  మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని  గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. గతంలో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట... ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    50 min ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు  కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు  సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో  1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్  అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్  రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • గాంధారి మండలం ఎక్కాకుంటా తండాకు ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బస్సు లేక తండా విద్యార్థులు నిత్యం 4 కిలోమీటర్ల మేర కాలినడకన బడికి వెళ్లాల్సి వచ్చేది. స్థానికుల విన్నపం మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బుధవారం నుంచి బస్సు సర్వీసు ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా ఈ బస్సు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    గాంధారి మండలం ఎక్కాకుంటా తండాకు ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బస్సు లేక తండా విద్యార్థులు నిత్యం 4 కిలోమీటర్ల మేర కాలినడకన బడికి వెళ్లాల్సి వచ్చేది. స్థానికుల విన్నపం మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బుధవారం నుంచి బస్సు సర్వీసు ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా ఈ బస్సు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగాం బస్తిలో వార్డు నంబర్ 28, 26లలో బీజేపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ పోల్స్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగాం బస్తిలో వార్డు నంబర్ 28, 26లలో బీజేపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ పోల్స్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • *सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने वार्ड नंबर 28 और 26 में डोर-टू-डोर कैंपेन किया* *कागज़नगर:* सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने शहर की नौगाम बस्ती में वार्ड नंबर 28 से BJP कैंडिडेट इरला विश्वेश्वर राव और वार्ड नंबर 26 से BJP कैंडिडेट औदेती शंकर के सपोर्ट में डोर-टू-डोर कैंपेन किया। *इस मौके पर बोलते हुए, उन्होंने कहा कि नौगाम बस्ती में डेवलपमेंट पूरी तरह से रुक गया है और ड्रेनेज प्रॉब्लम का परमानेंट सॉल्यूशन निकाला जाएगा। लोकल लोगों ने करंट पोल और सड़कों की प्रॉब्लम MLA के ध्यान में लाई। उन्होंने सभी लोगों से इस बात को समझने और BJP सपोर्टेड कैंडिडेट्स को वोट देकर जिताने की अपील की।* इस प्रोग्राम में टाउन प्रेसिडेंट आर्मी शिव कुमार, वार्ड इंचार्ज कुंचला विजय, थेले बापू, दुर्गम मोतीराम, रेहान, खारा तिरुपति, शफी और दूसरे लोग शामिल हुए।
    1
    *सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने वार्ड नंबर 28 और 26 में डोर-टू-डोर कैंपेन किया*
*कागज़नगर:* सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने शहर की नौगाम बस्ती में वार्ड नंबर 28 से BJP कैंडिडेट इरला विश्वेश्वर राव और वार्ड नंबर 26 से BJP कैंडिडेट औदेती शंकर के सपोर्ट में डोर-टू-डोर कैंपेन किया।
*इस मौके पर बोलते हुए, उन्होंने कहा कि नौगाम बस्ती में डेवलपमेंट पूरी तरह से रुक गया है और ड्रेनेज प्रॉब्लम का परमानेंट सॉल्यूशन निकाला जाएगा। लोकल लोगों ने करंट पोल और सड़कों की प्रॉब्लम MLA के ध्यान में लाई। उन्होंने सभी लोगों से इस बात को समझने और BJP सपोर्टेड कैंडिडेट्स को वोट देकर जिताने की अपील की।*
इस प्रोग्राम में टाउन प्रेसिडेंट आर्मी शिव कुमार, वार्ड इंचार्ज कुंचला विजय, थेले बापू, दुर्गम मोतीराम, रेहान, खारा तिरुपति, शफी और दूसरे लोग शामिल हुए।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    8 hrs ago
  • కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన... జగిత్యాల ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    1
    కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన...
జగిత్యాల ఫిబ్రవరి 3  :  మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం  కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు
బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల  హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు 
ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    20 hrs ago
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
    1
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని  ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    44 min ago
  • మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. 
రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ  మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.