logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలి జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారి ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

2 hrs ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలి జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారి ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల్లా నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. వేములవాడను అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, వేములవాడ అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే... వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంతపాడుతున్నారని విమర్శించారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని, డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
    1
    వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల్లా నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. వేములవాడను అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, వేములవాడ అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే... వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంతపాడుతున్నారని విమర్శించారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని, డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యానికి తాళం వేసిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు చెల్లించడం లేదని గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామ్మూర్తి
    1
    పెద్దపల్లి జిల్లా 
సుల్తానాబాద్ మున్సిపల్ కార్యానికి తాళం వేసిన కాంట్రాక్టర్
రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు చెల్లించడం లేదని గేటుకు తాళం వేసి నిరసన  వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామ్మూర్తి
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి బుధవారం పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పరిశీలించారు. స్కూల్, కళాశాల ఆవరణల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని సీ నారాయణరెడ్డి కళా మందిరాల్లో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళా మందిరం లోపల స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కోసం చేస్తున్న ఏర్పాట్లను సందర్శిచారు. వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు. పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
    1
    ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి బుధవారం పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పరిశీలించారు. స్కూల్, కళాశాల ఆవరణల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని సీ నారాయణరెడ్డి కళా మందిరాల్లో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళా మందిరం లోపల స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కోసం చేస్తున్న ఏర్పాట్లను సందర్శిచారు. వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు.
పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 min ago
  • జగిత్యాల : -ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా -ఇకనైనా బుద్ధిగా ఉండు..పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో.. -అభివృద్ధి అంటే.. పక్కింటి కీ కన్నం వేయడమా...అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై, స్పీకర్ తన తీర్పులో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బీ ఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారనీ, ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. చట్ట సభలకు ఎన్నికైన వారు ఎవరైనా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉండాలనీ,మీ సంసారం చక్కబెట్టుకోకుండా.. మా  సంసారంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తె..ఆ ఫలాలు కాంగ్రెస్ కార్యకర్తలు పొందాలన్నారు. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా అని అంటూ, 20 నెలల్లో జగిత్యాల  నియోజక వర్గ అభివృద్ధికి చేసింది ఏమిటో చెప్పాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్ విధాన పరమైన నిర్ణయం.. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నారు.. ప్రతి జిల్లా లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించి ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేర్ ఏర్పాటు చేయడం..ఇవన్నీ విధానపరమైన అభివృద్ధి..గత ప్రభుత్వం తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెమెంట్ కార్పొరేషన్ మంజూరు చేసిన నిధులు ఖర్చు కాకుంటే, తిరిగి అవే నిధులు తాను తీసుకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా కంపెనీ మొదటి కాల్ లో  3 శాతం అధికంగా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 14 శాతం ఎస్టిమేషన్ లో కలుపుతారు. 17 శాతం నేరుగా లాభం పొందుతున్నారు.. దాని వెనక ఇంకా ఎంత లాభం ఉందో.. .ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి.. పక్కింటి కీ కన్నం వేయటం.. బిల్లుల కోసం తాపత్రయం..ఇదేనా మీ అభివృద్ధి అని అన్నారు.
    2
    జగిత్యాల : 
-ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా
-ఇకనైనా బుద్ధిగా ఉండు..పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో..
-అభివృద్ధి అంటే.. పక్కింటి కీ కన్నం వేయడమా...అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై, స్పీకర్ తన తీర్పులో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బీ ఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారనీ, ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు.
చట్ట సభలకు ఎన్నికైన వారు ఎవరైనా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉండాలనీ,మీ సంసారం చక్కబెట్టుకోకుండా.. మా  సంసారంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తీరుపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తె..ఆ ఫలాలు కాంగ్రెస్ కార్యకర్తలు పొందాలన్నారు.
అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా అని అంటూ, 20 నెలల్లో జగిత్యాల  నియోజక వర్గ అభివృద్ధికి చేసింది ఏమిటో చెప్పాలన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్ విధాన పరమైన నిర్ణయం..
ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నారు..
ప్రతి జిల్లా లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించి ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు.
క్రిటికల్ కేర్ ఏర్పాటు చేయడం..ఇవన్నీ విధానపరమైన అభివృద్ధి..గత ప్రభుత్వం తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెమెంట్ కార్పొరేషన్ మంజూరు చేసిన నిధులు ఖర్చు కాకుంటే, తిరిగి అవే నిధులు తాను తీసుకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
గౌరీ శంకర్ ఇన్ఫ్రా కంపెనీ మొదటి కాల్ లో  3 శాతం అధికంగా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 14 శాతం ఎస్టిమేషన్ లో కలుపుతారు. 17 శాతం నేరుగా లాభం పొందుతున్నారు.. దాని వెనక ఇంకా ఎంత లాభం ఉందో.. .ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి..
పక్కింటి కీ కన్నం వేయటం.. బిల్లుల కోసం తాపత్రయం..ఇదేనా మీ అభివృద్ధి అని అన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • *ఈరోజుకు కూడా నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే నే... ఎమ్మెల్యే సంజయ్* జగిత్యాల ఫిబ్రవరి 4 ; లోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్..నేను జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న..గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.. అదే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లెటర్ రావడం జరిగింది..ఆ తర్వాత జూన్ నెలలో నేను అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాను అని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా ఆస్పత్రి ఇంటిపై బి ఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారు..కనీసం నా నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు. అదే రోజు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు లేఖ రాశారు..నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు..ఇప్పటివరకు బి ఆర్ ఎస్ అధిష్టానాన్ని, స్థానిక నాయకులను నేను విమర్శించలేదు. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న మంత్రులు కూడా అందుకు సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను.
    1
    *ఈరోజుకు కూడా నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే నే... ఎమ్మెల్యే సంజయ్*
జగిత్యాల ఫిబ్రవరి  4 ; లోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్..నేను జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న..గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.. అదే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లెటర్ రావడం జరిగింది..ఆ తర్వాత జూన్ నెలలో నేను అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాను అని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా ఆస్పత్రి ఇంటిపై బి ఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారు..కనీసం నా నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు. 
అదే రోజు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు లేఖ రాశారు..నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు..ఇప్పటివరకు బి ఆర్ ఎస్ అధిష్టానాన్ని, స్థానిక నాయకులను నేను విమర్శించలేదు. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న మంత్రులు కూడా అందుకు సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను.
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    3 hrs ago
  • సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.
    1
    సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    23 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ లోని భగత్ నగర్ లో గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.
    1
    సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 
కరీంనగర్ లోని భగత్ నగర్ లో గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.  అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు.
జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.