logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

13 hrs ago
user_Ravi Poreddy
Ravi Poreddy
మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
13 hrs ago

More news from తెలంగాణ and nearby areas
  • పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్...మీరు నిజాయితీ పరులు, మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. గతంలో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట... ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండని కోరారు.
    1
    పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్...మీరు నిజాయితీ పరులు,  మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని  గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. గతంలో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట... ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    48 min ago
  • కాగజ్ నగర్: పట్టణంలోని తిలక్ నగర్ వార్డు నం.10 భాజపా అభ్యర్థి సిందం లతా శ్రీనివాస్ గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిలక్ నగర్ లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని తెలిపారు. స్థానికులు రోడ్ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని, ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి భాజపా బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    కాగజ్ నగర్: పట్టణంలోని తిలక్ నగర్ వార్డు నం.10 భాజపా అభ్యర్థి సిందం లతా శ్రీనివాస్ గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిలక్ నగర్ లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని తెలిపారు. స్థానికులు రోడ్ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని, ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి భాజపా బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Insurance Agent కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    1
    "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    19 hrs ago
  • 👉 కాంగ్రెస్ అధిష్టానం తన మెడ కోసినట్లుయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నువ్వా - నేనా అన్నట్టుగా నడుస్తున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థులకు బి -ఫారం పంపిణీకి సంబంధించి, జీవన్ రెడ్డిని  తీవ్ర ఆవేదనలోకి నెట్టింది.  వివరాల్లోకి వెళితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎప్పటిలాగే తన పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గండి కొట్టింది. ఎందుకంటే జగిత్యాల మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు 1984 నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2000 సంవత్సరంలో నేరుగా చైర్మన్ గా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మారు కైవసం చేసుకున్నప్పటికీ, పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉండి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. ఆ ఒరవడికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలన్న లక్ష్యంతో, brs ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనే బాణంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ లో అలజడి రేపుతుంది. బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ్యునిగా డా సంజయ్ కుమార్ రెండవ మారు గెలుపొందడం తెలిసిందే. రెండవ మారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం దృష్ట్యా, ఆరు నెలల వరకు కూడా తమ బిల్లులు రావడంలేదని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చురేపినట్లు అయింది. ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జెండా మోసిన కార్యకర్తలకే కౌన్సిలర్ టికెట్లని ప్రకటిస్తూ, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను విస్మరించేది లేదని వారిని కాపాడుకోవడం తన బాధ్యత అని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చివరి క్షణం వరకు, పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేచి చూస్తూనే ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ లో ఉన్న 50 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంపిన లిస్టు పక్కన పెట్టి ఆ లిస్టు నుండి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి మరో 30 మందిని డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేయడం మంగళవారం తీవ్ర అలజడి రేపింది.  అయితే సోమవారం మధ్యాహ్నం తమకు టిక్కెట్ దక్కడం లేదన్న అనుమానంతో బొల్లి శేఖర్ అనే ఒక కార్యకర్త 16వ వార్డులో నామినేషన్ వేసిన తనకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నివాసం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైతం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది  అయినప్పటికీ కూడా చివరి రోజు మంగళవారం బి ఫారం లను ఆయా అభ్యర్థులకు అందజేయడానికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చేతికి పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన లిస్టును పంపించింది. ఉదయం కల్లా ఆ లిస్టు బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను అని అంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు మాత్రమే రావడం కలకలం రేపింది.  దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారు  పార్టీ జెండా మోయని నాయకుడు, అలాగే గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకుడిగా తమపై ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగల్లో నడుస్తూ సీనియర్లైన జీవన్ రెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టడం, ఇది దేనికి నిదర్శనం అని అంటున్నారు.  అంతేకాకుండా ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తమవల్ల కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేస్తూ నాలుగు దశాబ్దాలు తన రాజకీయ జీవితం ముగింపు దశలో పార్టీ అధిష్టానం ఈ విధంగా వ్యవహరించడం "తన మెడకోసినట్లయిందని" ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి చూస్తూ ఊరుకోమంటే తన వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా తనొక్కడి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే తను పట్టించుకోకుండా ఉండడం, చూస్తూ ఊరుకోలేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ప్రవాహానికి ఎదురొడ్డి, పార్టీ జెండా మోసి జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ ను కాపాడుకున్న తమను ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో పక్కకు నెట్టేసినట్లే అవుతుందని అంటున్నారు.  తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయింది అని, ప్రజలకు ఎన్నడు దూరంగా లేనని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే నాకు ప్రాణం అని అన్నారు.  అంతేకాకుండా తనకు ఏ వర్గం అంటూ లేదని, కేవలం కార్యకర్తలే నా వర్గం అని, వారే తన నాయకులని స్పష్టం చేస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మీడియాతో చిట్ చాట్ లో నవ్వుతూ మాట్లాడుతుండడం కనిపించింది.  మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బి ఫారంల నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో ఏ విధమైన అలజడిని సృష్టిస్తుందో వేచి చూడాలి.  ఇదిలా ఉండగా, డా. సంజయ్ కుమార్ ఏ విధమైన టెన్షన్ లేకుండా తన అనుచరులను కాపాడుకునే రీతిలో పార్టీ అధిష్టానం వద్దకు దాదాపు ప్రతిరోజు వెళ్లినట్టే వెళుతూ, 50 వార్డులకు గాను 30 వార్డుల టికెట్లు పొందడం గమనార్హం. అయితే జీవన్ రెడ్డికి కేటాయించిన 20 టికెట్లకు పోను, డా. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 సీట్లలో 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారు అన్న అభిప్రాయాన్ని జీవన్ రెడ్డితో పాటు నాయకులు ఈ సందర్భంగా అంటున్నారు.  మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో అగ్గి రాజుకుందని మంగళవారం నాటి కార్యకర్తల అభిప్రాయాలు, వారి ఆవేదనలు, ఆక్రోషం, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం లాంటి ఘటనలు చెబుతున్నాయి.
    4
    👉 కాంగ్రెస్ అధిష్టానం తన మెడ కోసినట్లుయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నువ్వా - నేనా అన్నట్టుగా నడుస్తున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థులకు బి -ఫారం పంపిణీకి సంబంధించి, జీవన్ రెడ్డిని  తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. 
వివరాల్లోకి వెళితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎప్పటిలాగే తన పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గండి కొట్టింది.
ఎందుకంటే జగిత్యాల మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు 1984 నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2000 సంవత్సరంలో నేరుగా చైర్మన్ గా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మారు కైవసం చేసుకున్నప్పటికీ, పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉండి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది.
ఆ ఒరవడికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలన్న లక్ష్యంతో, brs ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనే బాణంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ లో అలజడి రేపుతుంది.
బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ్యునిగా డా సంజయ్ కుమార్ రెండవ మారు గెలుపొందడం తెలిసిందే. రెండవ మారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం దృష్ట్యా, ఆరు నెలల వరకు కూడా తమ బిల్లులు రావడంలేదని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చురేపినట్లు అయింది.
ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జెండా మోసిన కార్యకర్తలకే కౌన్సిలర్ టికెట్లని ప్రకటిస్తూ, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను విస్మరించేది లేదని వారిని కాపాడుకోవడం తన బాధ్యత అని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చివరి క్షణం వరకు, పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేచి చూస్తూనే ఉన్నారు.
జగిత్యాల మున్సిపల్ లో ఉన్న 50 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ అధిష్టానానికి పంపించారు.
అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంపిన లిస్టు పక్కన పెట్టి ఆ లిస్టు నుండి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి మరో 30 మందిని డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేయడం మంగళవారం తీవ్ర అలజడి రేపింది. 
అయితే సోమవారం మధ్యాహ్నం తమకు టిక్కెట్ దక్కడం లేదన్న అనుమానంతో బొల్లి శేఖర్ అనే ఒక కార్యకర్త 16వ వార్డులో నామినేషన్ వేసిన తనకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నివాసం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైతం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది 
అయినప్పటికీ కూడా చివరి రోజు మంగళవారం బి ఫారం లను ఆయా అభ్యర్థులకు అందజేయడానికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చేతికి పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన లిస్టును పంపించింది.
ఉదయం కల్లా ఆ లిస్టు బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను అని అంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు మాత్రమే రావడం కలకలం రేపింది. 
దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారు 
పార్టీ జెండా మోయని నాయకుడు, అలాగే గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకుడిగా తమపై ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగల్లో నడుస్తూ సీనియర్లైన జీవన్ రెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టడం, ఇది దేనికి నిదర్శనం అని అంటున్నారు. 
అంతేకాకుండా ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తమవల్ల కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ సందర్భంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేస్తూ నాలుగు దశాబ్దాలు తన రాజకీయ జీవితం ముగింపు దశలో పార్టీ అధిష్టానం ఈ విధంగా వ్యవహరించడం "తన మెడకోసినట్లయిందని" ఆవేదన వ్యక్తం చేశారు.
క్రమశిక్షణ పేరుతో తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి చూస్తూ ఊరుకోమంటే తన వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా తనొక్కడి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే తను పట్టించుకోకుండా ఉండడం, చూస్తూ ఊరుకోలేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పార్టీ కష్టకాలంలో ప్రవాహానికి ఎదురొడ్డి, పార్టీ జెండా మోసి జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ ను కాపాడుకున్న తమను ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో పక్కకు నెట్టేసినట్లే అవుతుందని అంటున్నారు. 
తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయింది అని, ప్రజలకు ఎన్నడు దూరంగా లేనని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే నాకు ప్రాణం అని అన్నారు. 
అంతేకాకుండా తనకు ఏ వర్గం అంటూ లేదని, కేవలం కార్యకర్తలే నా వర్గం అని, వారే తన నాయకులని స్పష్టం చేస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మీడియాతో చిట్ చాట్ లో నవ్వుతూ మాట్లాడుతుండడం కనిపించింది. 
మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బి ఫారంల నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో ఏ విధమైన అలజడిని సృష్టిస్తుందో వేచి చూడాలి. 
ఇదిలా ఉండగా, డా. సంజయ్ కుమార్ ఏ విధమైన టెన్షన్ లేకుండా తన అనుచరులను కాపాడుకునే రీతిలో పార్టీ అధిష్టానం వద్దకు దాదాపు ప్రతిరోజు వెళ్లినట్టే వెళుతూ, 50 వార్డులకు గాను 30 వార్డుల టికెట్లు పొందడం గమనార్హం.
అయితే జీవన్ రెడ్డికి కేటాయించిన 20 టికెట్లకు పోను, డా. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 సీట్లలో 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారు అన్న అభిప్రాయాన్ని జీవన్ రెడ్డితో పాటు నాయకులు ఈ సందర్భంగా అంటున్నారు. 
మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో అగ్గి రాజుకుందని మంగళవారం నాటి కార్యకర్తల అభిప్రాయాలు, వారి ఆవేదనలు, ఆక్రోషం, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం లాంటి ఘటనలు చెబుతున్నాయి.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • ASF మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన పలువురు కాంగ్రెస్ ఆశావాహులకు టికెట్లు దక్కలేదు. చివరి వరకు టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం ఆశలు కల్పించి, చివరి సమయంలో తమకు నచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని వారు ఆరోపించారు. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన ఆశావాహులు రెబల్స్‌గా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రజల మద్దతుతో గెలిచి తమ సత్తా చాటుతామని వారు ప్రకటించారు.
    1
    ASF మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన పలువురు కాంగ్రెస్ ఆశావాహులకు టికెట్లు దక్కలేదు. చివరి వరకు టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం ఆశలు కల్పించి, చివరి సమయంలో తమకు నచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని వారు ఆరోపించారు. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన ఆశావాహులు రెబల్స్‌గా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రజల మద్దతుతో గెలిచి తమ సత్తా చాటుతామని వారు ప్రకటించారు.
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.వారు మాట్లాడుతూ ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.గతంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని,గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ మీకు అండగా ఉన్నారని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించలని పిలుపునిచ్చారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.వారు మాట్లాడుతూ ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.గతంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని,గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ మీకు అండగా ఉన్నారని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించలని పిలుపునిచ్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
    1
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని  ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    42 min ago
  • మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. 
రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ  మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన... జగిత్యాల ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    1
    కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన...
జగిత్యాల ఫిబ్రవరి 3  :  మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం  కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు
బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల  హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు 
ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.