జగిత్యాల ఇందిరా భవన్ లో అగ్గిరాజుకుంది.... 👉 కాంగ్రెస్ అధిష్టానం తన మెడ కోసినట్లుయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నువ్వా - నేనా అన్నట్టుగా నడుస్తున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థులకు బి -ఫారం పంపిణీకి సంబంధించి, జీవన్ రెడ్డిని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎప్పటిలాగే తన పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గండి కొట్టింది. ఎందుకంటే జగిత్యాల మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు 1984 నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2000 సంవత్సరంలో నేరుగా చైర్మన్ గా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మారు కైవసం చేసుకున్నప్పటికీ, పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉండి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. ఆ ఒరవడికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలన్న లక్ష్యంతో, brs ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనే బాణంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ లో అలజడి రేపుతుంది. బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ్యునిగా డా సంజయ్ కుమార్ రెండవ మారు గెలుపొందడం తెలిసిందే. రెండవ మారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం దృష్ట్యా, ఆరు నెలల వరకు కూడా తమ బిల్లులు రావడంలేదని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చురేపినట్లు అయింది. ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జెండా మోసిన కార్యకర్తలకే కౌన్సిలర్ టికెట్లని ప్రకటిస్తూ, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను విస్మరించేది లేదని వారిని కాపాడుకోవడం తన బాధ్యత అని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చివరి క్షణం వరకు, పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేచి చూస్తూనే ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ లో ఉన్న 50 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంపిన లిస్టు పక్కన పెట్టి ఆ లిస్టు నుండి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి మరో 30 మందిని డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేయడం మంగళవారం తీవ్ర అలజడి రేపింది. అయితే సోమవారం మధ్యాహ్నం తమకు టిక్కెట్ దక్కడం లేదన్న అనుమానంతో బొల్లి శేఖర్ అనే ఒక కార్యకర్త 16వ వార్డులో నామినేషన్ వేసిన తనకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నివాసం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైతం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది అయినప్పటికీ కూడా చివరి రోజు మంగళవారం బి ఫారం లను ఆయా అభ్యర్థులకు అందజేయడానికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చేతికి పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన లిస్టును పంపించింది. ఉదయం కల్లా ఆ లిస్టు బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను అని అంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు మాత్రమే రావడం కలకలం రేపింది. దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారు పార్టీ జెండా మోయని నాయకుడు, అలాగే గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకుడిగా తమపై ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగల్లో నడుస్తూ సీనియర్లైన జీవన్ రెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టడం, ఇది దేనికి నిదర్శనం అని అంటున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తమవల్ల కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేస్తూ నాలుగు దశాబ్దాలు తన రాజకీయ జీవితం ముగింపు దశలో పార్టీ అధిష్టానం ఈ విధంగా వ్యవహరించడం "తన మెడకోసినట్లయిందని" ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి చూస్తూ ఊరుకోమంటే తన వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా తనొక్కడి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే తను పట్టించుకోకుండా ఉండడం, చూస్తూ ఊరుకోలేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ప్రవాహానికి ఎదురొడ్డి, పార్టీ జెండా మోసి జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ ను కాపాడుకున్న తమను ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో పక్కకు నెట్టేసినట్లే అవుతుందని అంటున్నారు. తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయింది అని, ప్రజలకు ఎన్నడు దూరంగా లేనని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే నాకు ప్రాణం అని అన్నారు. అంతేకాకుండా తనకు ఏ వర్గం అంటూ లేదని, కేవలం కార్యకర్తలే నా వర్గం అని, వారే తన నాయకులని స్పష్టం చేస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మీడియాతో చిట్ చాట్ లో నవ్వుతూ మాట్లాడుతుండడం కనిపించింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బి ఫారంల నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో ఏ విధమైన అలజడిని సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా, డా. సంజయ్ కుమార్ ఏ విధమైన టెన్షన్ లేకుండా తన అనుచరులను కాపాడుకునే రీతిలో పార్టీ అధిష్టానం వద్దకు దాదాపు ప్రతిరోజు వెళ్లినట్టే వెళుతూ, 50 వార్డులకు గాను 30 వార్డుల టికెట్లు పొందడం గమనార్హం. అయితే జీవన్ రెడ్డికి కేటాయించిన 20 టికెట్లకు పోను, డా. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 సీట్లలో 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారు అన్న అభిప్రాయాన్ని జీవన్ రెడ్డితో పాటు నాయకులు ఈ సందర్భంగా అంటున్నారు. మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో అగ్గి రాజుకుందని మంగళవారం నాటి కార్యకర్తల అభిప్రాయాలు, వారి ఆవేదనలు, ఆక్రోషం, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం లాంటి ఘటనలు చెబుతున్నాయి.
జగిత్యాల ఇందిరా భవన్ లో అగ్గిరాజుకుంది.... 👉 కాంగ్రెస్ అధిష్టానం తన మెడ కోసినట్లుయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నువ్వా - నేనా అన్నట్టుగా నడుస్తున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థులకు బి -ఫారం పంపిణీకి సంబంధించి, జీవన్ రెడ్డిని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎప్పటిలాగే తన పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గండి కొట్టింది. ఎందుకంటే జగిత్యాల మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు 1984 నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2000 సంవత్సరంలో నేరుగా చైర్మన్ గా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మారు కైవసం చేసుకున్నప్పటికీ, పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉండి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. ఆ ఒరవడికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలన్న లక్ష్యంతో, brs ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనే బాణంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ లో అలజడి రేపుతుంది. బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ్యునిగా డా సంజయ్ కుమార్ రెండవ మారు గెలుపొందడం తెలిసిందే. రెండవ మారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం దృష్ట్యా, ఆరు నెలల వరకు కూడా తమ బిల్లులు రావడంలేదని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ
కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చురేపినట్లు అయింది. ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జెండా మోసిన కార్యకర్తలకే కౌన్సిలర్ టికెట్లని ప్రకటిస్తూ, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను విస్మరించేది లేదని వారిని కాపాడుకోవడం తన బాధ్యత అని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చివరి క్షణం వరకు, పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేచి చూస్తూనే ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ లో ఉన్న 50 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంపిన లిస్టు పక్కన పెట్టి ఆ లిస్టు నుండి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి మరో 30 మందిని డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేయడం మంగళవారం తీవ్ర అలజడి రేపింది. అయితే సోమవారం మధ్యాహ్నం తమకు టిక్కెట్ దక్కడం లేదన్న అనుమానంతో బొల్లి శేఖర్ అనే ఒక కార్యకర్త 16వ వార్డులో నామినేషన్ వేసిన తనకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నివాసం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైతం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది అయినప్పటికీ కూడా చివరి రోజు మంగళవారం బి ఫారం లను ఆయా అభ్యర్థులకు అందజేయడానికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి
చేతికి పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన లిస్టును పంపించింది. ఉదయం కల్లా ఆ లిస్టు బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను అని అంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు మాత్రమే రావడం కలకలం రేపింది. దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారు పార్టీ జెండా మోయని నాయకుడు, అలాగే గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకుడిగా తమపై ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగల్లో నడుస్తూ సీనియర్లైన జీవన్ రెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టడం, ఇది దేనికి నిదర్శనం అని అంటున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తమవల్ల కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేస్తూ నాలుగు దశాబ్దాలు తన రాజకీయ జీవితం ముగింపు దశలో పార్టీ అధిష్టానం ఈ విధంగా వ్యవహరించడం "తన మెడకోసినట్లయిందని" ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి చూస్తూ ఊరుకోమంటే తన వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా తనొక్కడి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే తను పట్టించుకోకుండా ఉండడం, చూస్తూ
ఊరుకోలేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ప్రవాహానికి ఎదురొడ్డి, పార్టీ జెండా మోసి జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ ను కాపాడుకున్న తమను ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో పక్కకు నెట్టేసినట్లే అవుతుందని అంటున్నారు. తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయింది అని, ప్రజలకు ఎన్నడు దూరంగా లేనని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే నాకు ప్రాణం అని అన్నారు. అంతేకాకుండా తనకు ఏ వర్గం అంటూ లేదని, కేవలం కార్యకర్తలే నా వర్గం అని, వారే తన నాయకులని స్పష్టం చేస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మీడియాతో చిట్ చాట్ లో నవ్వుతూ మాట్లాడుతుండడం కనిపించింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బి ఫారంల నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో ఏ విధమైన అలజడిని సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా, డా. సంజయ్ కుమార్ ఏ విధమైన టెన్షన్ లేకుండా తన అనుచరులను కాపాడుకునే రీతిలో పార్టీ అధిష్టానం వద్దకు దాదాపు ప్రతిరోజు వెళ్లినట్టే వెళుతూ, 50 వార్డులకు గాను 30 వార్డుల టికెట్లు పొందడం గమనార్హం. అయితే జీవన్ రెడ్డికి కేటాయించిన 20 టికెట్లకు పోను, డా. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 సీట్లలో 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారు అన్న అభిప్రాయాన్ని జీవన్ రెడ్డితో పాటు నాయకులు ఈ సందర్భంగా అంటున్నారు. మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో అగ్గి రాజుకుందని మంగళవారం నాటి కార్యకర్తల అభిప్రాయాలు, వారి ఆవేదనలు, ఆక్రోషం, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం లాంటి ఘటనలు చెబుతున్నాయి.
- జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారి ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.1
- పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్...మీరు నిజాయితీ పరులు, మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. గతంలో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట... ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండని కోరారు.1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- గాంధారి మండలం ఎక్కాకుంటా తండాకు ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బస్సు లేక తండా విద్యార్థులు నిత్యం 4 కిలోమీటర్ల మేర కాలినడకన బడికి వెళ్లాల్సి వచ్చేది. స్థానికుల విన్నపం మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బుధవారం నుంచి బస్సు సర్వీసు ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా ఈ బస్సు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.1
- కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగాం బస్తిలో వార్డు నంబర్ 28, 26లలో బీజేపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ పోల్స్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने वार्ड नंबर 28 और 26 में डोर-टू-डोर कैंपेन किया* *कागज़नगर:* सिरपुर MLA डॉ. पलवई हरीश बाबू ने शहर की नौगाम बस्ती में वार्ड नंबर 28 से BJP कैंडिडेट इरला विश्वेश्वर राव और वार्ड नंबर 26 से BJP कैंडिडेट औदेती शंकर के सपोर्ट में डोर-टू-डोर कैंपेन किया। *इस मौके पर बोलते हुए, उन्होंने कहा कि नौगाम बस्ती में डेवलपमेंट पूरी तरह से रुक गया है और ड्रेनेज प्रॉब्लम का परमानेंट सॉल्यूशन निकाला जाएगा। लोकल लोगों ने करंट पोल और सड़कों की प्रॉब्लम MLA के ध्यान में लाई। उन्होंने सभी लोगों से इस बात को समझने और BJP सपोर्टेड कैंडिडेट्स को वोट देकर जिताने की अपील की।* इस प्रोग्राम में टाउन प्रेसिडेंट आर्मी शिव कुमार, वार्ड इंचार्ज कुंचला विजय, थेले बापू, दुर्गम मोतीराम, रेहान, खारा तिरुपति, शफी और दूसरे लोग शामिल हुए।1
- కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన... జగిత్యాల ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.1
- మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.1