logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చదువును ఆయుధంగా మల్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చదువుకుంటే, జీవితమంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యను ఆయుధంగా మల్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధిని, విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్, విద్యార్థులకు పదవ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు పదవ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాలా సంసిద్దులు కావాలని సూచించారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. వార్షిక పరీక్షలు సమీపించినందున చదువు పైనే దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతీసారి తల్లితండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. పాఠాలను బట్టీ పట్టకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని ఉద్బోధించారు. ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణించాలని, తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడుల్లో చదివే వారు ఏ విషయంలోనూ వెనుకబడి ఉండరని విద్యార్థుల్లో కలెక్టర్ ఆత్మవిశ్వాసం కల్పించారు. చక్కగా చదువుకుని అందరూ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. పది పరీక్షల్లో ప్రతిభను చాటితే బిగ్ స్క్రీన్ పై టి.20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేయిస్తానని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునఃశ్చరణ జరిపించాలని ఉపాధ్యాయులకు, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలుగా అనువైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, వసతి గృహాల నిర్వాహకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

21 hrs ago
user_Sri
Sri
నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
21 hrs ago

చదువును ఆయుధంగా మల్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చదువుకుంటే, జీవితమంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యను ఆయుధంగా మల్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధిని, విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్, విద్యార్థులకు పదవ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు పదవ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాలా సంసిద్దులు కావాలని సూచించారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. వార్షిక పరీక్షలు సమీపించినందున చదువు పైనే దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతీసారి తల్లితండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. పాఠాలను బట్టీ పట్టకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని ఉద్బోధించారు. ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణించాలని, తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడుల్లో చదివే వారు ఏ విషయంలోనూ వెనుకబడి ఉండరని విద్యార్థుల్లో కలెక్టర్ ఆత్మవిశ్వాసం కల్పించారు. చక్కగా చదువుకుని అందరూ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. పది పరీక్షల్లో ప్రతిభను చాటితే బిగ్ స్క్రీన్ పై టి.20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేయిస్తానని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునఃశ్చరణ జరిపించాలని ఉపాధ్యాయులకు, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలుగా అనువైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, వసతి గృహాల నిర్వాహకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గాంధారి మండలం ఎక్కాకుంటా తండాకు ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బస్సు లేక తండా విద్యార్థులు నిత్యం 4 కిలోమీటర్ల మేర కాలినడకన బడికి వెళ్లాల్సి వచ్చేది. స్థానికుల విన్నపం మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బుధవారం నుంచి బస్సు సర్వీసు ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా ఈ బస్సు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    గాంధారి మండలం ఎక్కాకుంటా తండాకు ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బస్సు లేక తండా విద్యార్థులు నిత్యం 4 కిలోమీటర్ల మేర కాలినడకన బడికి వెళ్లాల్సి వచ్చేది. స్థానికుల విన్నపం మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బుధవారం నుంచి బస్సు సర్వీసు ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా ఈ బస్సు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభావాలకు తావు లేదుఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు తావు లేదని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు రవి కిరణ్ అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవోలు ,మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నిక జరగాలని, ఎవరైనా బలవంతంగా ప్రలోభాలు చేసిన, బెదిరించిన, చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభావాలకు తావు లేదుఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు 
మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి  కిరణ్ 
మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు తావు లేదని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు రవి కిరణ్ అన్నారు.
మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవోలు ,మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. 
వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నిక జరగాలని, ఎవరైనా బలవంతంగా ప్రలోభాలు చేసిన, బెదిరించిన, చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    20 hrs ago
  • "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    1
    "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    19 hrs ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు  కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు  సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో  1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్  అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్  రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యానికి తాళం వేసిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు చెల్లించడం లేదని గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామ్మూర్తి
    1
    పెద్దపల్లి జిల్లా 
సుల్తానాబాద్ మున్సిపల్ కార్యానికి తాళం వేసిన కాంట్రాక్టర్
రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు చెల్లించడం లేదని గేటుకు తాళం వేసి నిరసన  వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామ్మూర్తి
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 min ago
  • సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ లోని భగత్ నగర్ లో గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.
    1
    సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 
కరీంనగర్ లోని భగత్ నగర్ లో గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.  అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు.
జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    23 min ago
  • భిక్కనూరు : కుష్టు వ్యాధి లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రామేశ్వర్పల్లి గ్రామ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద ఆయన గ్రామస్తులతో కలిసి కుష్టు నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. వ్యాధిపై అవగాహన పెంచుకుని, బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, సర్పంచ్ రాణిరాజు పాల్గొన్నారు.
    1
    భిక్కనూరు : కుష్టు వ్యాధి లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రామేశ్వర్పల్లి గ్రామ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద ఆయన గ్రామస్తులతో కలిసి కుష్టు నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. వ్యాధిపై అవగాహన పెంచుకుని, బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, సర్పంచ్ రాణిరాజు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా ఆలయ లడ్డు సత్రంలో ఈరోజు 1500కు పైగా లడ్డు ట్రేలు వేడి నీరు మరియు సర్ఫ్ ఉపయోగించి శుభ్రపరచి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.ఈ పనులను ఆలయ లడ్డు సత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టగా, పనుల నాణ్యతను సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా ఆలయ లడ్డు సత్రంలో ఈరోజు 1500కు పైగా లడ్డు ట్రేలు వేడి నీరు మరియు సర్ఫ్ ఉపయోగించి శుభ్రపరచి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.ఈ పనులను ఆలయ లడ్డు సత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టగా, పనుల నాణ్యతను సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ కుమార్  ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన... జగిత్యాల ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    1
    కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ టికెట్ రాలేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన...
జగిత్యాల ఫిబ్రవరి 3  :  మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్‌కే అధిష్టానం మొగ్గు...టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి....మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం  కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ-ఫారమ్‌లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు
బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తల  హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు. చేశారు 
ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.