logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పని మనిషే కిరాతకం..బంగారం కోసం వృద్ధురాలి హత్య కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు ఆయన వెల్లడించారు.చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన సుశీలమ్మ (85) అనే వృద్ధురాలి హత్య కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. సుశీలమ్మ ఇంట్లో పని చేసే పని మనిషి కవిత (36) బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన కవిత, ఆమె తలపై బండరాయితో బాదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న కమ్మలు, ఉంగరం (రింగ్)తో పాటు సెల్‌ఫోన్‌ను కూడా తీసుకుని పరారైనట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన దుండిగల్ పోలీసులు, ఎస్‌ఓటీ కుత్బుల్లాపూర్, సీసీఎస్ పోలీసులను ఏసీపీ శంకర్ రెడ్డి అభినందించారు.

4 hrs ago
user_NAVEEN Kumar
NAVEEN Kumar
Qutballapur, Medchal Malkajgiri•
4 hrs ago

పని మనిషే కిరాతకం..బంగారం కోసం వృద్ధురాలి హత్య కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి

హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు ఆయన వెల్లడించారు.చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన సుశీలమ్మ (85) అనే వృద్ధురాలి హత్య కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. సుశీలమ్మ ఇంట్లో పని

చేసే పని మనిషి కవిత (36) బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన కవిత, ఆమె తలపై బండరాయితో బాదడంతో అక్కడికక్కడే మృతి

చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న కమ్మలు, ఉంగరం (రింగ్)తో పాటు సెల్‌ఫోన్‌ను కూడా తీసుకుని పరారైనట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్టు

చేసినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన దుండిగల్ పోలీసులు, ఎస్‌ఓటీ కుత్బుల్లాపూర్, సీసీఎస్ పోలీసులను ఏసీపీ శంకర్ రెడ్డి అభినందించారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు ఆయన వెల్లడించారు.చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన సుశీలమ్మ (85) అనే వృద్ధురాలి హత్య కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. సుశీలమ్మ ఇంట్లో పని చేసే పని మనిషి కవిత (36) బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన కవిత, ఆమె తలపై బండరాయితో బాదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న కమ్మలు, ఉంగరం (రింగ్)తో పాటు సెల్‌ఫోన్‌ను కూడా తీసుకుని పరారైనట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన దుండిగల్ పోలీసులు, ఎస్‌ఓటీ కుత్బుల్లాపూర్, సీసీఎస్ పోలీసులను ఏసీపీ శంకర్ రెడ్డి అభినందించారు.
    5
    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు ఆయన వెల్లడించారు.చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన సుశీలమ్మ (85) అనే వృద్ధురాలి హత్య కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. సుశీలమ్మ ఇంట్లో పని చేసే పని మనిషి కవిత (36) బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన కవిత, ఆమె తలపై బండరాయితో బాదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న కమ్మలు, ఉంగరం (రింగ్)తో పాటు సెల్‌ఫోన్‌ను కూడా తీసుకుని పరారైనట్లు వెల్లడించారు.
సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన దుండిగల్ పోలీసులు, ఎస్‌ఓటీ కుత్బుల్లాపూర్, సీసీఎస్ పోలీసులను ఏసీపీ శంకర్ రెడ్డి అభినందించారు.
    user_NAVEEN Kumar
    NAVEEN Kumar
    Qutballapur, Medchal Malkajgiri•
    4 hrs ago
  • #BreakingNews: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. మిర్యాలగూడ వేదికగా రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అర్హులైన రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రకటించారు. ​మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV9!
    1
    #BreakingNews: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. మిర్యాలగూడ వేదికగా రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అర్హులైన రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రకటించారు.
​మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV9!
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    7 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జగదేవపూర్ వెళ్ళే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ,మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్,స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాల బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మానం చేయడం అభినందనీయమని అన్నారు, అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచికమని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య లయన్ సంగునూరి సత్యనారాయణ, డాక్టర్కుమార స్వామి, రాం పనిదర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్,సంతోష్,నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డాక్టర్ శైలజ,సుజాత,స్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జగదేవపూర్ వెళ్ళే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ,మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో  బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్,స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాల బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మానం చేయడం అభినందనీయమని అన్నారు, అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచికమని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య లయన్ సంగునూరి సత్యనారాయణ, డాక్టర్కుమార స్వామి, రాం పనిదర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్,సంతోష్,నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డాక్టర్ శైలజ,సుజాత,స్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    10 hrs ago
  • హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
    1
    హైదరాబాద్, 
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్  ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్  నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్  నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
    user_Suresh Sagar
    Suresh Sagar
    Kapra, Medchal Malkajgiri•
    12 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి 15 వ వార్డ్ నుండి జోడు మౌనిక ప్రకాష్ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/
బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి 15 వ వార్డ్ నుండి జోడు మౌనిక ప్రకాష్ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    1
    సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
    1
    పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, 
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ సైదోనిగడ్డ తండాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లానని, “ఇది నా వల్ల కాదు” అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ప్రస్తుతం గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తానే పనిచేయలేకపోతున్నానని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేనే పనిచేయలేకపోతే రేపు గెలిచే వార్డ్ కౌన్సిలర్ ఏమి చేయగలడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు.
పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తామని, నాలుగు వేల పెన్షన్‌ను ఆరు వేలు చేస్తామని చెప్పినప్పటికీ, గత రెండేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని తెలిపారు. భర్తలను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు కూడా ఒక్క కొత్త పెన్షన్ రావడం లేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
తెలంగాణలో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం ఆందోళనకరమన్నారు. నిధులే లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని, కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు.
గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నదని, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి ప్రాంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎల్లంపేట అధ్యక్షులు శ్రీశైలం, నందా రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకట్, మేడ్చల్ మున్సిపల్ ప్రెసిడెంట్ శైలజ హరి, జగన్, పూడూరు నరసింహారెడ్డి, గడ్డం సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    Kapra, Medchal Malkajgiri•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.