logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని వన యోజన అటవీ పార్కులో శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తన బాధ్యతను చాటుతూ, 200 చెట్లతో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్, డిఎఫ్‌ఓ జోజి, డిఆర్‌డిఓ పిడి శ్రీనివాసరావు, ఆర్‌ అండ్ బి ఈఈ వేణు, సంబంధిత ఎఫ్‌ఆర్‌ఓ, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు యాదగిరి, శర్మ రాజశేఖర్, సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 'ఏక్ పెడ్ మా కే నామ్' అనేది ప్రతి భారతీయుడిని తమ తల్లి మరియు భూమాత గౌరవార్థం ఒక మొక్కను నాటమని ప్రోత్సహించే దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమమని ఆమె వివరించారు. మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారాలని, అందుకే ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి వాటిని సంరక్షించి, అవి వృక్షాలుగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 24% అటవీ సంపద ఉందని పేర్కొంటూ, నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోరాబాద్ వంటి అర్బన్ ఫారెస్ట్ పార్కులను హైలెట్ చేస్తూ పర్యాటకులకు వాటి గొప్పతనాన్ని ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. అటవీ సంపద, ఫారెస్ట్ పార్కులు, మొక్కల వల్ల భవిష్యత్ తరాలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు పిల్లలకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ ఫారెస్ట్‌ను టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్ జోహారి మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మానవాళి మనుగడకు చెట్లే ప్రతిరూపమని అన్నారు. విశాఖపట్నంలో సునామీ వచ్చినప్పుడు చెట్లు ఉన్న ప్రాంతాలలో దాని ప్రభావం చాలా తక్కువగా ఉందని ఉదహరిస్తూ, చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల సమన్వయంతో గ్రీన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా అడవులను పరిరక్షించేందుకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

3 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
3 hrs ago

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని వన యోజన అటవీ పార్కులో శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తన బాధ్యతను చాటుతూ, 200 చెట్లతో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్, డిఎఫ్‌ఓ జోజి, డిఆర్‌డిఓ పిడి శ్రీనివాసరావు, ఆర్‌ అండ్ బి ఈఈ వేణు, సంబంధిత ఎఫ్‌ఆర్‌ఓ, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు యాదగిరి, శర్మ రాజశేఖర్, సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 'ఏక్ పెడ్ మా కే నామ్' అనేది ప్రతి భారతీయుడిని తమ తల్లి మరియు భూమాత గౌరవార్థం ఒక మొక్కను నాటమని ప్రోత్సహించే దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమమని ఆమె వివరించారు. మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారాలని, అందుకే ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి వాటిని సంరక్షించి, అవి వృక్షాలుగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 24% అటవీ సంపద ఉందని పేర్కొంటూ, నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోరాబాద్ వంటి అర్బన్ ఫారెస్ట్ పార్కులను హైలెట్ చేస్తూ పర్యాటకులకు వాటి గొప్పతనాన్ని ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. అటవీ సంపద, ఫారెస్ట్ పార్కులు, మొక్కల వల్ల భవిష్యత్ తరాలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు పిల్లలకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ ఫారెస్ట్‌ను టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్ జోహారి మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మానవాళి మనుగడకు చెట్లే ప్రతిరూపమని అన్నారు. విశాఖపట్నంలో సునామీ వచ్చినప్పుడు చెట్లు ఉన్న ప్రాంతాలలో దాని ప్రభావం చాలా తక్కువగా ఉందని ఉదహరిస్తూ, చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల సమన్వయంతో గ్రీన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా అడవులను పరిరక్షించేందుకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని వన యోజన అటవీ పార్కులో శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తన బాధ్యతను చాటుతూ, 200 చెట్లతో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్, డిఎఫ్‌ఓ జోజి, డిఆర్‌డిఓ పిడి శ్రీనివాసరావు, ఆర్‌ అండ్ బి ఈఈ వేణు, సంబంధిత ఎఫ్‌ఆర్‌ఓ, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు యాదగిరి, శర్మ రాజశేఖర్, సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 'ఏక్ పెడ్ మా కే నామ్' అనేది ప్రతి భారతీయుడిని తమ తల్లి మరియు భూమాత గౌరవార్థం ఒక మొక్కను నాటమని ప్రోత్సహించే దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమమని ఆమె వివరించారు. మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారాలని, అందుకే ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి వాటిని సంరక్షించి, అవి వృక్షాలుగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 24% అటవీ సంపద ఉందని పేర్కొంటూ, నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోరాబాద్ వంటి అర్బన్ ఫారెస్ట్ పార్కులను హైలెట్ చేస్తూ పర్యాటకులకు వాటి గొప్పతనాన్ని ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. అటవీ సంపద, ఫారెస్ట్ పార్కులు, మొక్కల వల్ల భవిష్యత్ తరాలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు పిల్లలకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ ఫారెస్ట్‌ను టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్ జోహారి మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మానవాళి మనుగడకు చెట్లే ప్రతిరూపమని అన్నారు. విశాఖపట్నంలో సునామీ వచ్చినప్పుడు చెట్లు ఉన్న ప్రాంతాలలో దాని ప్రభావం చాలా తక్కువగా ఉందని ఉదహరిస్తూ, చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల సమన్వయంతో గ్రీన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా అడవులను పరిరక్షించేందుకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని వన యోజన అటవీ పార్కులో శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తన బాధ్యతను చాటుతూ, 200 చెట్లతో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్, డిఎఫ్‌ఓ జోజి, డిఆర్‌డిఓ పిడి శ్రీనివాసరావు, ఆర్‌ అండ్ బి ఈఈ వేణు, సంబంధిత ఎఫ్‌ఆర్‌ఓ, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు యాదగిరి, శర్మ రాజశేఖర్, సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 'ఏక్ పెడ్ మా కే నామ్' అనేది ప్రతి భారతీయుడిని తమ తల్లి మరియు భూమాత గౌరవార్థం ఒక మొక్కను నాటమని ప్రోత్సహించే దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమమని ఆమె వివరించారు. మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారాలని, అందుకే ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి వాటిని సంరక్షించి, అవి వృక్షాలుగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 24% అటవీ సంపద ఉందని పేర్కొంటూ, నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోరాబాద్ వంటి అర్బన్ ఫారెస్ట్ పార్కులను హైలెట్ చేస్తూ పర్యాటకులకు వాటి గొప్పతనాన్ని ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. అటవీ సంపద, ఫారెస్ట్ పార్కులు, మొక్కల వల్ల భవిష్యత్ తరాలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు పిల్లలకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ ఫారెస్ట్‌ను టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

అనంతరం తెలంగాణ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్ జోహారి మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మానవాళి మనుగడకు చెట్లే ప్రతిరూపమని అన్నారు. విశాఖపట్నంలో సునామీ వచ్చినప్పుడు చెట్లు ఉన్న ప్రాంతాలలో దాని ప్రభావం చాలా తక్కువగా ఉందని ఉదహరిస్తూ, చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల సమన్వయంతో గ్రీన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా అడవులను పరిరక్షించేందుకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • కామారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీపై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేసిన రూ.4 కోట్ల లంచం ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని ప్రజలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని శ్రీనివాస్ సవాల్ విసిరారు. గత 40 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ కామారెడ్డి అభివృద్ధికి చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని పేర్కొంటూ, ఆయన నైతికతను ప్రశ్నించే అర్హత చంద్రశేఖర్ రెడ్డికి లేదని విమర్శించారు. నిరాధార ఆరోపణలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన ఇప్ప శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, పార్టీ క్రమశిక్షణా సంఘం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా, "సత్యానికి రంగులు పూయలేరు... కామారెడ్డిలో అబద్ధాల రాజకీయాలు సాగవు" అని ఇప్ప శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
    1
    కామారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీపై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేసిన రూ.4 కోట్ల లంచం ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్ప శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని ప్రజలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు.

ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని శ్రీనివాస్ సవాల్ విసిరారు. గత 40 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ కామారెడ్డి అభివృద్ధికి చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని పేర్కొంటూ, ఆయన నైతికతను ప్రశ్నించే అర్హత చంద్రశేఖర్ రెడ్డికి లేదని విమర్శించారు.

నిరాధార ఆరోపణలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన ఇప్ప శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, పార్టీ క్రమశిక్షణా సంఘం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా, "సత్యానికి రంగులు పూయలేరు... కామారెడ్డిలో అబద్ధాల రాజకీయాలు సాగవు" అని ఇప్ప శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
    user_KODIPYAKA SAIRAM
    KODIPYAKA SAIRAM
    Insurance Agent బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    59 min ago
  • కామారెడ్డి జిల్లాలో 2026, జూన్ 5, శుక్రవారం నాడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. "ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం" అనే థీమ్‌తో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జూట్ బ్యాగులను పంపిణీ చేసి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని పెంచాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద, జిల్లా ప్రజా సంబంధాల అధికారిణి తిరుమల తో పాటు జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శాఖల సిబ్బందికి పర్యావరణహిత జూట్ బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. రోజువారీ జీవితంలో ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వి. గిరి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
    1
    కామారెడ్డి జిల్లాలో 2026, జూన్ 5, శుక్రవారం నాడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. "ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం" అనే థీమ్‌తో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జూట్ బ్యాగులను పంపిణీ చేసి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని పెంచాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద, జిల్లా ప్రజా సంబంధాల అధికారిణి తిరుమల తో పాటు జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శాఖల సిబ్బందికి పర్యావరణహిత జూట్ బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లను అందజేశారు.

రోజువారీ జీవితంలో ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వి. గిరి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • మహారాష్ట్రలోని కల్యాణ్ సమీపంలోని అశోక్ నగర్ ప్రాంతంలో బౌద్ధ విహార్ మరియు బుద్ధ స్మారక చిహ్నంపై బుల్డోజర్ చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కూల్చివేతను అడ్డుకునేందుకు బౌద్ధ సన్యాసులు బుల్డోజర్ ముందు పడుకుని శాంతియుత నిరసన తెలిపారు. స్థానిక బౌద్ధ సంఘాలు కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో మత, సాంస్కృతిక వారసత్వ చిహ్నాలను ధ్వంసం చేయడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొనబడింది. ప్రజల అభిప్రాయాలు వినకుండా, సరైన ప్రక్రియ పాటించకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు బయటకు రావాలని, బౌద్ధ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
    1
    మహారాష్ట్రలోని కల్యాణ్ సమీపంలోని అశోక్ నగర్ ప్రాంతంలో బౌద్ధ విహార్ మరియు బుద్ధ స్మారక చిహ్నంపై బుల్డోజర్ చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కూల్చివేతను అడ్డుకునేందుకు బౌద్ధ సన్యాసులు బుల్డోజర్ ముందు పడుకుని శాంతియుత నిరసన తెలిపారు. స్థానిక బౌద్ధ సంఘాలు కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

అభివృద్ధి పనుల పేరుతో మత, సాంస్కృతిక వారసత్వ చిహ్నాలను ధ్వంసం చేయడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొనబడింది. ప్రజల అభిప్రాయాలు వినకుండా, సరైన ప్రక్రియ పాటించకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు బయటకు రావాలని, బౌద్ధ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థకు చెందిన నాయకులు ఉత్సాహంగా పాల్గొని టిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థకు చెందిన నాయకులు ఉత్సాహంగా పాల్గొని టిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆయన, పెరుగుతున్న కాలుష్యం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వేసవిలో ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల అధిక వినియోగం వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో ప్రవేశించి క్యాన్సర్ రోగానికి కారణమవుతున్నాయని, పాలు, పెరుగు, టీ కప్పులు, ఇస్తరాకులు, త్రాగే మంచినీటితో సహా అన్నీ ప్లాస్టిక్‌లో వస్తున్నందున దేశంలో డయాబెటిక్ రోగుల కంటే క్యాన్సర్ రోగులు రోజురోజుకు పెరుగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అవగాహన పెంపొందించుకొని స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఈ నెల రోజుల్లో మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు ఒకేసారి నాటే కార్యక్రమానికి పూనుకున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. త్వరలో తేదీని ప్రకటిస్తామని, ఆ రోజున జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కదిలి వచ్చి మొక్కలు నాటి రహదారికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, రాగి రాములు, వెల్మకన్న రాజేందర్, బెండవీన నాయన ప్రసాద్, పాపన్నపేట, హవేలీ ఘన్పూర్, నర్సింగి, చిన్న శంకరంపేట, మెదక్ మండలం, మెదక్ పట్టణం బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆయన, పెరుగుతున్న కాలుష్యం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వేసవిలో ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల అధిక వినియోగం వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో ప్రవేశించి క్యాన్సర్ రోగానికి కారణమవుతున్నాయని, పాలు, పెరుగు, టీ కప్పులు, ఇస్తరాకులు, త్రాగే మంచినీటితో సహా అన్నీ ప్లాస్టిక్‌లో వస్తున్నందున దేశంలో డయాబెటిక్ రోగుల కంటే క్యాన్సర్ రోగులు రోజురోజుకు పెరుగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అవగాహన పెంపొందించుకొని స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు.

ఈ నెల రోజుల్లో మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు ఒకేసారి నాటే కార్యక్రమానికి పూనుకున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. త్వరలో తేదీని ప్రకటిస్తామని, ఆ రోజున జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కదిలి వచ్చి మొక్కలు నాటి రహదారికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, రాగి రాములు, వెల్మకన్న రాజేందర్, బెండవీన నాయన ప్రసాద్, పాపన్నపేట, హవేలీ ఘన్పూర్, నర్సింగి, చిన్న శంకరంపేట, మెదక్ మండలం, మెదక్ పట్టణం బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొంపల్లిలోని ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న దేవ్ జీ ఆరోగ్య పరిస్థితిని కవిత గారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, దేవ్ జీకి అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి టీఆర్ఎస్ చీఫ్ కవిత వివరాలు తెలుసుకున్నారు.
    1
    తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొంపల్లిలోని ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న దేవ్ జీ ఆరోగ్య పరిస్థితిని కవిత గారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, దేవ్ జీకి అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి టీఆర్ఎస్ చీఫ్ కవిత వివరాలు తెలుసుకున్నారు.
    user_RAMU
    RAMU
    Press advisory బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.