logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆయన, పెరుగుతున్న కాలుష్యం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వేసవిలో ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల అధిక వినియోగం వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో ప్రవేశించి క్యాన్సర్ రోగానికి కారణమవుతున్నాయని, పాలు, పెరుగు, టీ కప్పులు, ఇస్తరాకులు, త్రాగే మంచినీటితో సహా అన్నీ ప్లాస్టిక్‌లో వస్తున్నందున దేశంలో డయాబెటిక్ రోగుల కంటే క్యాన్సర్ రోగులు రోజురోజుకు పెరుగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అవగాహన పెంపొందించుకొని స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఈ నెల రోజుల్లో మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు ఒకేసారి నాటే కార్యక్రమానికి పూనుకున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. త్వరలో తేదీని ప్రకటిస్తామని, ఆ రోజున జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కదిలి వచ్చి మొక్కలు నాటి రహదారికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, రాగి రాములు, వెల్మకన్న రాజేందర్, బెండవీన నాయన ప్రసాద్, పాపన్నపేట, హవేలీ ఘన్పూర్, నర్సింగి, చిన్న శంకరంపేట, మెదక్ మండలం, మెదక్ పట్టణం బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

4 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
4 hrs ago

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆయన, పెరుగుతున్న కాలుష్యం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వేసవిలో ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల అధిక వినియోగం వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో ప్రవేశించి క్యాన్సర్ రోగానికి కారణమవుతున్నాయని, పాలు, పెరుగు, టీ కప్పులు, ఇస్తరాకులు, త్రాగే మంచినీటితో సహా అన్నీ ప్లాస్టిక్‌లో వస్తున్నందున దేశంలో డయాబెటిక్ రోగుల కంటే క్యాన్సర్ రోగులు రోజురోజుకు పెరుగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అవగాహన పెంపొందించుకొని స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఈ నెల రోజుల్లో మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు ఒకేసారి నాటే కార్యక్రమానికి పూనుకున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. త్వరలో తేదీని ప్రకటిస్తామని, ఆ రోజున జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కదిలి వచ్చి మొక్కలు నాటి రహదారికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, రాగి రాములు, వెల్మకన్న రాజేందర్, బెండవీన నాయన ప్రసాద్, పాపన్నపేట, హవేలీ ఘన్పూర్, నర్సింగి, చిన్న శంకరంపేట, మెదక్ మండలం, మెదక్ పట్టణం బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 2026 జూన్ 5వ తేదీ శుక్రవారం తన ఛాంబర్‌లో భారత రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చేపడుతున్న మానవతా సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య సేవలు మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు రెడ్ క్రాస్ జీవితకాల సభ్యత్వం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. జీవితకాల సభ్యత్వం పొందదలచిన వారు తమ దరఖాస్తు ఫారాలను 2026 జూన్ 15వ తేదీలోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఎక్కువ మంది సభ్యుల భాగస్వామ్యంతో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించవచ్చని కలెక్టర్ తెలిపారు.
    1
    కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 2026 జూన్ 5వ తేదీ శుక్రవారం తన ఛాంబర్‌లో భారత రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చేపడుతున్న మానవతా సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.

రెడ్ క్రాస్ సొసైటీ ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య సేవలు మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు రెడ్ క్రాస్ జీవితకాల సభ్యత్వం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. జీవితకాల సభ్యత్వం పొందదలచిన వారు తమ దరఖాస్తు ఫారాలను 2026 జూన్ 15వ తేదీలోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఎక్కువ మంది సభ్యుల భాగస్వామ్యంతో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించవచ్చని కలెక్టర్ తెలిపారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు (ఐఎన్‌సీ) మేడిపల్లి సత్యం తమ జన్మదిన సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న శ్రీ మేడిపల్లి సత్యంకి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు గౌరీభట్ల శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందిన శ్రీ మేడిపల్లి సత్యం గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు (ఐఎన్‌సీ) మేడిపల్లి సత్యం తమ జన్మదిన సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న శ్రీ మేడిపల్లి సత్యంకి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు గౌరీభట్ల శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.

జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందిన శ్రీ మేడిపల్లి సత్యం గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జనసేన రాష్ట్ర నాయకుడు కమ్మరి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. గజ్వేల్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేయడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మి, తులం బంగారం, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని శ్రీనివాస్ ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న విమర్శలను ఖండించిన ఆయన, తెలంగాణలోనూ జనసేన సిద్ధాంతాలను విశ్వసించే లక్షలాది మంది అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కావాలనే జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి, కరీంనగర్‌లో కాకుండా హుస్నాబాద్‌లో ఎందుకు పోటీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కమ్మరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమావేశం ముగిసిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా కమ్మరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
    4
    ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జనసేన రాష్ట్ర నాయకుడు కమ్మరి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. గజ్వేల్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేయడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని స్పష్టం చేశారు.

కళ్యాణలక్ష్మి, తులం బంగారం, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని శ్రీనివాస్ ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న విమర్శలను ఖండించిన ఆయన, తెలంగాణలోనూ జనసేన సిద్ధాంతాలను విశ్వసించే లక్షలాది మంది అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కావాలనే జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి, కరీంనగర్‌లో కాకుండా హుస్నాబాద్‌లో ఎందుకు పోటీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కమ్మరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమావేశం ముగిసిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా కమ్మరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    8 min ago
  • ప్రతి భార్య భరణం డిమాండ్ చేయలేరని, అయితే ఏ పరిస్థితులలో భరణం కోరవచ్చో తెలుసుకోవడం ప్రతి భర్త, భార్య ఇద్దరికీ అవసరమని ఒక ముఖ్యమైన చట్టపరమైన వాస్తవాన్ని ఈ పోస్ట్ నొక్కి చెబుతుంది. భరణం చట్టాలు న్యాయబద్ధంగా ఉన్నాయో లేదో తమ అభిప్రాయాలను వ్యాఖ్యలలో తెలియజేయాలని ప్రజలను కోరుతోంది.
    1
    ప్రతి భార్య భరణం డిమాండ్ చేయలేరని, అయితే ఏ పరిస్థితులలో భరణం కోరవచ్చో తెలుసుకోవడం ప్రతి భర్త, భార్య ఇద్దరికీ అవసరమని ఒక ముఖ్యమైన చట్టపరమైన వాస్తవాన్ని ఈ పోస్ట్ నొక్కి చెబుతుంది. భరణం చట్టాలు న్యాయబద్ధంగా ఉన్నాయో లేదో తమ అభిప్రాయాలను వ్యాఖ్యలలో తెలియజేయాలని ప్రజలను కోరుతోంది.
    user_Aslam Parvez
    Aslam Parvez
    Lawyer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • ఘాజీపూర్‌లో ఇటీవల జరిగిన రాళ్లదాడి ఘటన నేపథ్యంలో, డీఐజీ వైభవ్ కృష్ణ మరియు ఎస్పీ డాక్టర్ ఇరాజ్ రాజా ఐపీఎస్ లు సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. ఫుల్లన్‌పూర్, కోత్వాలి ఘాజీపూర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటన అనంతరం, వారు ప్రజలు శాంతిని నెలకొల్పాలని మరియు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజల భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    1
    ఘాజీపూర్‌లో ఇటీవల జరిగిన రాళ్లదాడి ఘటన నేపథ్యంలో, డీఐజీ వైభవ్ కృష్ణ మరియు ఎస్పీ డాక్టర్ ఇరాజ్ రాజా ఐపీఎస్ లు సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. ఫుల్లన్‌పూర్, కోత్వాలి ఘాజీపూర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటన అనంతరం, వారు ప్రజలు శాంతిని నెలకొల్పాలని మరియు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజల భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు: ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాలు గడించేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించాలి. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మిషన్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు. ఈ సమావేశంలో భాగస్వామ్య శాఖలు, నాబార్డ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్ డ్రిప్ ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా రైతులు గణనీయమైన లాభాలు పొందవచ్చని కలెక్టర్ దీపక్ తివారి నొక్కి చెప్పారు.
    1
    వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు: ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాలు గడించేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించాలి. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మిషన్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు. ఈ సమావేశంలో భాగస్వామ్య శాఖలు, నాబార్డ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్ డ్రిప్ ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా రైతులు గణనీయమైన లాభాలు పొందవచ్చని కలెక్టర్ దీపక్ తివారి నొక్కి చెప్పారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    బొమరాస్‌పేట, వికారాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యారంగ సమస్యలు 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్న చందంగా మారాయని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె మురళి, జబ్బర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వెంటనే పరిష్కరించాలని AIFDS కమిటీ తరఫున వారు ప్రభుత్వానికి విప్లవ అభివందనాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ద్వారా వారు తమ డిమాండ్లను ముందుంచారు.
    1
    తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యారంగ సమస్యలు 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్న చందంగా మారాయని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె మురళి, జబ్బర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వెంటనే పరిష్కరించాలని AIFDS కమిటీ తరఫున వారు ప్రభుత్వానికి విప్లవ అభివందనాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ద్వారా వారు తమ డిమాండ్లను ముందుంచారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ'లో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సమీపంలోని పోతిరెడ్డిపల్లె ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్‌లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఏక్ పెడ్ మా కే నామ్" పేరుతో ఎక్కువ సాంద్రత కలిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆమె మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై మాట్లాడుతూ, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడానికి గ్రామంలోని నర్సరీ ద్వారా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేలా పర్యవేక్షణ చేయాలని, అడవుల శాతం ఎక్కువగా ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అందరూ గుర్తించి మొక్కలను పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడానికి కృషి చేయాలని, ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్ నగర్ గ్రామంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసినందుకు గ్రామ సర్పంచ్ ను కలెక్టర్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై, మొక్కలను నాటి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె తిరిగి పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ ప్లేట్, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్‌ను కూడా కలెక్టర్ సందర్శించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లోని పిల్లలు ఆడుకునే స్థలం, యోగా షెడ్, వాకింగ్ ట్రాక్, గెజెబో, బెంచీలు, హెర్బల్ గార్డెన్, బుద్ధ విగ్రహం, నీటి మధ్యలో ఉండే బ్రిడ్జ్‌ను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై విస్తృత ప్రచారం కల్పించి, సందర్శకులు వచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. అందరినీ ఆకర్షించేలా పార్క్‌పై రీల్స్ పోటీలను నిర్వహించాలని, పార్క్‌లోని విశేషాలు అందరికీ తెలిసేలా సృజనాత్మకంగా రీల్స్ రూపొందించి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందుతుందని అన్నారు. రీల్స్ పోటీలలో అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, డీఏఓ అఫ్జల్ బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్‌ఓ రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వర్ రావు, హరిదాస్ నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ'లో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సమీపంలోని పోతిరెడ్డిపల్లె ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్‌లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఏక్ పెడ్ మా కే నామ్" పేరుతో ఎక్కువ సాంద్రత కలిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆమె మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై మాట్లాడుతూ, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడానికి గ్రామంలోని నర్సరీ ద్వారా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేలా పర్యవేక్షణ చేయాలని, అడవుల శాతం ఎక్కువగా ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అందరూ గుర్తించి మొక్కలను పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడానికి కృషి చేయాలని, ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్ నగర్ గ్రామంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసినందుకు గ్రామ సర్పంచ్ ను కలెక్టర్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై, మొక్కలను నాటి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె తిరిగి పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ ప్లేట్, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్‌ను కూడా కలెక్టర్ సందర్శించారు.

అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లోని పిల్లలు ఆడుకునే స్థలం, యోగా షెడ్, వాకింగ్ ట్రాక్, గెజెబో, బెంచీలు, హెర్బల్ గార్డెన్, బుద్ధ విగ్రహం, నీటి మధ్యలో ఉండే బ్రిడ్జ్‌ను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై విస్తృత ప్రచారం కల్పించి, సందర్శకులు వచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. అందరినీ ఆకర్షించేలా పార్క్‌పై రీల్స్ పోటీలను నిర్వహించాలని, పార్క్‌లోని విశేషాలు అందరికీ తెలిసేలా సృజనాత్మకంగా రీల్స్ రూపొందించి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందుతుందని అన్నారు. రీల్స్ పోటీలలో అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, డీఏఓ అఫ్జల్ బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్‌ఓ రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వర్ రావు, హరిదాస్ నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • పంట అవశేషాలు కాల్చవద్దు – నేల సారాన్ని, పర్యావరణాన్ని కాపాడండి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట: జిల్లాలో పంట పొలాల్లో పంట అవశేషాలను కాల్చకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల 65 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పంట కోతల అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు తదితర పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయని పేర్కొన్నారు.అలాగే పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతాయని తెలిపారు. దీంతో నేల సారవంతత తగ్గడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగి రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట అవశేషాలను కంపోస్ట్‌గా తయారు చేయడం, నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా వినియోగించడం, పశువుల మేతగా ఉపయోగించడం, అవశేషాలతో పాటు దుక్కి దున్నడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. హైలైట్ “పంట అవశేషాలు కాల్చవద్దు – నేల సారాన్ని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి” అని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లాలోని రైతాంగానికి పిలుపునిచ్చారు. – జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా
    1
    పంట అవశేషాలు కాల్చవద్దు – నేల సారాన్ని, పర్యావరణాన్ని కాపాడండి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట: జిల్లాలో పంట పొలాల్లో పంట అవశేషాలను కాల్చకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల 65 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పంట కోతల అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు తదితర పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయని పేర్కొన్నారు.అలాగే పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతాయని తెలిపారు. దీంతో నేల సారవంతత తగ్గడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగి రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట అవశేషాలను కంపోస్ట్‌గా తయారు చేయడం, నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా వినియోగించడం, పశువుల మేతగా ఉపయోగించడం, అవశేషాలతో పాటు దుక్కి దున్నడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు.
హైలైట్
“పంట అవశేషాలు కాల్చవద్దు – నేల సారాన్ని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి” అని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లాలోని రైతాంగానికి పిలుపునిచ్చారు.
– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    25 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.