హైదరాబాద్ వాతావరణం అనూహ్యం.. ఆగస్టు ముగుస్తున్నా అంతంతమాత్రంగానే వర్షాలు... హైదరాబాద్: ఆకాశం మేఘావృతమై వర్షం కురిసేలా కనిపించినా.. కొద్దిసేపటికే అక్కడక్కడా చిరుజల్లులు పడి ఆగిపోతున్నాయి. ఆ వెంటనే ఎండ తీవ్రత పెరగడంతో పాటు ఉక్కపోత కొనసాగుతోంది. మరికొద్దిసేపటికే మళ్లీ మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీంతో ప్రజలు గొడుగులు, రెయిన్‌కోట్లు వెంట తీసుకెళ్లడం సాధారణం. అయితే ఈ ఏడాది ఆగస్టులో మాత్రం వాతావరణం భిన్నంగా ఉంది. వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం మధ్య మధ్యలో ఈదురుగాలులు, మేఘావృత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెల మొత్తం వాతావరణం ఇలాగే కొనసాగినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారీ వర్షాలు కురిసే స్థాయిలో వర్షపాతం నమోదుకాలేదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం సాధారణ హెచ్చరికలు మాత్రమే జారీ చేసింది. ఆగస్టు చివరి వరకు భారీ వర్షాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు తాత్కాలికంగా వేడి నుంచి ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. వర్షాలు తక్కువగా ఉండటంతో ఉక్కపోత మాత్రం కొనసాగుతోంది. సెప్టెంబర్ 1 వరకు హైదరాబాద్‌లో గాలిలో తేమ 70 నుంచి 75 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఈసారి నైరుతి రుతుపవనాల పరిస్థితిపై ఇంకా స్పష్టమైన అంచనా లేకపోయినా.. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రజలు వర్షం వస్తుందనే ఆశతో ఆకాశం వైపు చూస్తూనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.1
- రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్ల మీద అతని ఫొటోలు వేస్తారా? మొత్తం ఖమ్మం మంత్రుల అందరి ఫోటోలు వెయ్యకపోయారా – నిలదీసిన ఖమ్మం మహిళ1
- పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులోని డేకర్ పేపర్ మిల్ లిమిటెడ్ పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు పీసీబీ ఏఈ పద్మావతి తెలిపారు. పరిశ్రమ పరిసరాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.1
- అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లతో సమావేశం నిర్వహించ1
- కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1