శుక్రవారం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ పవార్ స్వప్నిల్, పట్టణ మార్కెట్లకు పైనాపిల్ విక్రయాల కోసం బయలుదేరిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రధాన నగరాలకు తరలించేందుకు గిరిజన రైతులు సుమారు 4 వేల పైనాపిల్ పండ్లను అందించారు. ఈ సందర్భంగా పీవో పవార్ స్వప్నిల్ మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పండుతున్న పైనాపిల్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, ఐటీడీఏ సీతంపేట లక్ష్యం గిరిజనుల ఆదాయాన్ని పెంచడమేనని వివరించారు.
శుక్రవారం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ పవార్ స్వప్నిల్, పట్టణ మార్కెట్లకు పైనాపిల్ విక్రయాల కోసం బయలుదేరిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రధాన నగరాలకు తరలించేందుకు గిరిజన రైతులు సుమారు 4 వేల పైనాపిల్ పండ్లను అందించారు. ఈ సందర్భంగా పీవో పవార్ స్వప్నిల్ మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పండుతున్న పైనాపిల్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, ఐటీడీఏ సీతంపేట లక్ష్యం గిరిజనుల ఆదాయాన్ని పెంచడమేనని వివరించారు.
- శుక్రవారం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ పవార్ స్వప్నిల్, పట్టణ మార్కెట్లకు పైనాపిల్ విక్రయాల కోసం బయలుదేరిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రధాన నగరాలకు తరలించేందుకు గిరిజన రైతులు సుమారు 4 వేల పైనాపిల్ పండ్లను అందించారు. ఈ సందర్భంగా పీవో పవార్ స్వప్నిల్ మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పండుతున్న పైనాపిల్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, ఐటీడీఏ సీతంపేట లక్ష్యం గిరిజనుల ఆదాయాన్ని పెంచడమేనని వివరించారు.1
- జూన్ 12న నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేక అంతర్రాష్ట్ర దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమ మద్యం తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, మంగళగిరి ఆదేశాలు మరియు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సూచనల మేరకు, పార్వతీపురం అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ దాడులు చేపట్టారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బండుగం బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో గుణుపూర్ పోలీసుల సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్‌లో పార్వతీపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్టీఎఫ్ పార్వతీపురం, ఎన్‌ఫోర్స్‌మెంట్ విజయనగరం బృందాలు పాలుపంచుకున్నాయి. ఈ దాడుల సందర్భంగా అధికారులు 4,000 లీటర్ల బెల్లం ఊట (ఎఫ్‌జే వాష్), 50 లీటర్ల నాటు సారా, 100 కిలోల అమ్మోనియా, మరియు 1,000 కిలోల నల్ల బెల్లాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. దీంతో అక్రమ మద్యం తయారీ ముఠాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు వెల్లడించారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. అక్రమ మద్యం నిర్మూలన కోసం ఇలాంటి అంతర్రాష్ట్ర సంయుక్త దాడులను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ స్పష్టం చేశారు. ఈ చర్యలు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో అక్రమ మద్యం ముఠాలకు గట్టి దెబ్బగా నిలిచి, అక్రమ మద్యం నిర్మూలనకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.2
- పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రాబోయే జూలై 1 నుండి అమలు చేయబోతున్న నూతన మార్కెట్ ఫీజ్ (సెస్) మరియు ఆన్‌లైన్ ఇ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానంపై వ్యాపార, రైతు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా, మార్కెట్ కమిటీ జారీ చేసిన అధికారిక సర్క్యులర్ (ఆర్.సి.నెం. 40/2026) లోని అసలు వాస్తవాలను, దాని వల్ల జీడి పరిశ్రమపై పడే ప్రభావాన్ని తెలియజేస్తూ, తాను ప్రస్తావించిన ప్రతి అంశం వాస్తవమేనని స్పష్టం చేశారు. నూతన నిబంధనల ప్రకారం, 'జీడిపిక్కలు' మరియు 'జీడిపప్పు' ఒకే సరుకుపై రెండు దశల్లో పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. తేదీ 27-05-2026 నాటి సర్క్యులర్‌లో, కొనుగోలు చేసిన జీడి పిక్కలు, జీడి పప్పు రవాణా చేసే ప్రతి వాహనము ఆన్‌లైన్ ద్వారా రూపొందించిన ఇ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్‌తో తరలించాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీని అర్థం, రైతు నుండి ముడి జీడిపిక్కలు కొనుగోలు చేసినప్పుడు ఒకసారి ఇ-పర్మిట్, ఆ తర్వాత పరిశ్రమలో ప్రాసెస్ అయి జీడిపప్పుగా మారిన తర్వాత దాని ఎగుమతికి 'జీడిపప్పు' పేరుతో మళ్లీ మరొక లింక్డ్ ఇ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే సరుకుపై రూపం మారిన ప్రతి దశలోనూ ఇలా పర్మిట్ల లింకులు పెట్టడం వల్ల వ్యాపార లావాదేవీలు అత్యంత క్లిష్టతరంగా, జాప్యంగా మారతాయని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, నూతన విధానంలో ప్రతి వాహనం కదలడానికి ముందే ఆన్‌లైన్‌లో మార్కెట్ ఫీజును డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పూర్తిగా చెల్లిస్తేనే ఇ-పర్మిట్ జనరేట్ అవుతుంది. అయితే, పలాస జీడి పరిశ్రమలో వ్యాపారాలు ఎక్కువగా క్రెడిట్ మరియు నమ్మకంపై ఆధారపడి నడుస్తాయి కాబట్టి, సరుకు అమ్ముడుపోకముందే ముందస్తుగా నగదు చెల్లించమనే నిబంధన చిన్న, మధ్యతరహా వ్యాపారుల వర్కింగ్ క్యాపిటల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఆన్‌లైన్ సిస్టమ్ అమలు చేసినప్పుడు సర్వర్ డౌన్ అవ్వడం, ఇంటర్నెట్ లోపాలు తలెత్తడం సాధారణమని, ఆన్‌లైన్ పర్మిట్ సకాలంలో రాకపోతే చెక్‌పోస్టుల వద్ద వాహనాలను నిలిపివేయాల్సి వస్తుందని దువ్వాడ శ్రీధర్ బాబా పేర్కొన్నారు. దీనివల్ల ఎగుమతులు ఆలస్యం కావడంతో పాటు వ్యాపారులు, డ్రైవర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే చిన్న మధ్యవర్తులను వెంటనే నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని సర్క్యులర్‌లో ఆదేశాలు ఉన్నాయని, వీరు రైతులకు, పరిశ్రమలకు మధ్య వారధిగా పనిచేస్తారని, వారిపై కఠిన నిబంధనలు రుద్దడం వల్ల గ్రామీణ ఆర్థిక లావాదేవీలు మందగించే ప్రమాదం ఉందని వివరించారు. ఈ వాదనలకు నిదర్శనంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జారీ చేసిన తేదీ 19-05-2026 నాటి సవరించిన మార్గదర్శకాల ప్రధాన సర్క్యులర్ కాపీలను మరియు పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ జారీ చేసిన తేదీ 27-05-2026 నాటి అసలు సర్క్యులర్ కాపీని ఈ పత్రికా ప్రకటనతో పాటు బహిరంగంగా జతపరుస్తున్నట్లు దువ్వాడ శ్రీధర్ బాబా తెలిపారు. పలాస ప్రాంత ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన జీడి పరిశ్రమను సంక్షోభం నుండి కాపాడాలంటే మార్కెట్ సెస్ (Cess)ను పూర్తిగా రద్దు చేయడమే ఏకైక శాశ్వత పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆన్‌లైన్ ఇ-పర్మిట్ విధానంలో ఉన్న క్లిష్టమైన లింకులను, నిబంధనలను సవరించి వ్యాపారులకు, రైతులకు సులభతరమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.1
- రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "వెన్నుపోటుకు రెండేళ్లు" ఉద్యమం పలాస నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధించింది. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. జూన్ 4వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పలాస నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. జూన్ 4న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ మేనిఫెస్టో ప్రతులను దహనం చేయడం ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామాలు, వార్డులు, మండల కేంద్రాలలో విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టగా, గత వారం రోజులుగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో మహిళలు, యువత, రైతులు, కార్మికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అయితే రెండేళ్లు పూర్తయినా వాటిలో ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదని విమర్శించారు. మహిళలకు ప్రకటించిన ఆర్థిక సహాయ పథకాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, రైతులకు గిట్టుబాటు ధరలు, సామాజిక భద్రత పథకాలు అన్నీ కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని, విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇతర సేవల రుసుములు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు పంటలకు సరైన ధరలు లేక నష్టపోతుండగా, యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని అన్నారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కొనసాగింపు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని, వివిధ పనుల విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాకుండా రాజకీయ కక్షసాధింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ఈరోజు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీ కాశీబుగ్గ వైఎస్సార్ స్క్వేర్ వరకు వేలాది మంది ప్రజలతో విజయవంతంగా సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి లభించిన అపూర్వ స్పందన ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన విభాగం, రైతు విభాగం, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.1
- మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 'గుణపాం పార్టీ'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి, వారికి గుణపం దించిన పార్టీ 'గుణపాం పార్టీ' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం కింద వైసీపీ శ్రేణులతో కలిసి జగదాంబ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన, కూటమి నేతల అక్రమాలు, అవినీతిని ఎండగట్టారు. వచ్చే ఎన్నికల్లో 'గుణపాం పార్టీ'కి ప్రజలే చరమగీతం పాడతారని, బుద్ధి చెబుతారని వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు గుణపం దించినందున, ప్రజలే ఈ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.1
- పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం, డోలమడ పంచాయతీ పరిధిలోని బర్న సీతంపేట గ్రామంలో ఇటీవల దుండగుల చేతిలో అతి కిరాతకంగా హత్యకు గురైన బిడ్డిక ఉషారాణి కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ పరామర్శించింది. పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి గారి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా, కూటమి ప్రభుత్వం దుండగులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తుందని, ఉషారాణి కుటుంబానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గండి రామి నాయుడు, మాజీ నీటి సంఘాల అధ్యక్షులు, సీతంపేట మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు, వీరఘట్టం టౌన్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు, తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బర్న సీతంపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఉషారాణి హత్య కేసులో బాధిత కుటుంబానికి పరామర్శ తెలిపినట్లు పేర్కొన్నారు.1
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాలు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలు బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నిరసనల పరంపరలో భాగంగా, జూన్ 4న బొబ్బిలి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన "బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" బాండ్ పేపర్లను దగ్ధం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసనలు తెలిపారు. జూన్ 9న శ్రీ సూర్య రెసిడెన్సీలో రైతులు, మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి ఇండోర్ మీటింగ్ నిర్వహించి, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రశ్నించారు. అలాగే, శుక్రవారం బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఓంకార్ థియేటర్ జంక్షన్ నుండి తాండ్రపాపారాయుడు విగ్రహం వరకు భారీ ఊరేగింపు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన అన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ అని చెప్పి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, బ్యాక్ డోర్ పద్ధతిలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు ₹1500 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే కాలేజీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై మాట్లాడుతూ, "మీరు ఎన్ని ఆంక్షలు విధించినా మేం వెనక్కి తగ్గేదే లేదు. మేం గోడకు కొట్టిన బంతి లాంటి వాళ్లం, ప్రజా సమస్యలపై మరింత దీటుగా ప్రజల తరుపున పోరాడుతాము" అని శంబంగి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్ ఇంటి గోపాలరావు, జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి శంబంగి వేణు గోపాల్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీ కృష్ణారావు, బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదర రావు, బొబ్బిలి పట్టణ పార్టీ అధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, తెర్లాం మండలం పార్టీ అధ్యక్షులు తెంటు సత్యం నాయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షులు యమల శివప్రసాద్, తెర్లాం మండల అధ్యక్షులు ఉమా లక్ష్మీ, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు ఇన్చార్జిలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలు, మండలాల యువజన అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు మరియు నాలుగు మండలాల & పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1