logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: SP అఖిల్ మహాజన్ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం బోరాజ్ మండలంలోని పిప్పరవాడ గ్రామంలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి కలిసి వాలిబాల్ ఆడి ఉత్సాహం నింపారు. గ్రామస్తులు గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.

3 hrs ago
user_Mallaiah Potta
Mallaiah Potta
Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
3 hrs ago
4c300de2-8b61-4482-adc9-d1d43949d611

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: SP అఖిల్ మహాజన్ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం బోరాజ్ మండలంలోని పిప్పరవాడ గ్రామంలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి కలిసి వాలిబాల్ ఆడి ఉత్సాహం నింపారు. గ్రామస్తులు గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం.......... ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    1
    బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం..........
ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ​కుంటాల బి లో మళ్లీ గులాబీ జోష్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో చేరికలు నెరడిగొండ మండలం కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా,ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ.. గతంలో మరో పార్టీలో చేరడం తప్పిదమని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో కొనసాగుతామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​కుంటాల బి లో మళ్లీ గులాబీ జోష్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో చేరికలు
నెరడిగొండ మండలం కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా,ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ.. గతంలో మరో పార్టీలో చేరడం తప్పిదమని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో కొనసాగుతామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    4 hrs ago
  • మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు.
* ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ.
మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    23 hrs ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    2
    కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది.
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ నగేశ్..... సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650 జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంపీ నగేష్, బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ పాల్గొన్నారు. సమాజంలో కుల వివక్షను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గురు రవి దాస్ బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు.
    1
    గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ నగేశ్.....
సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650 జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంపీ నగేష్, బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ పాల్గొన్నారు. సమాజంలో కుల వివక్షను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గురు రవి దాస్ బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..* *వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జులై 31 :- *మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.* *బోథ్ సిఐ డి గురుస్వామి* బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు. ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫరాస్‌గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..*

*వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.*
*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా
జులై 31 :-
*మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.*
*బోథ్ సిఐ డి గురుస్వామి* 
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు.
ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫరాస్‌గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు.
ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు.
దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. 
ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.