*కోరుట్ల పట్టణంలో విజయోత్సవ ర్యాలీ,కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు,ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన జువ్వాడి బ్రదర్స్.* కోరుట్ల ఫిబ్రవరి 19 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొంది మున్సిపల్ చేర్మెన్ గా ఎన్నికైన తిరుమల వసంత - గంగాధర్ కాంగ్రెస్ కౌన్సిలర్ తో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించగా ఇట్టి ర్యాలీకి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గారు లు విచ్చేశారు.ముందుగా కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల ఆవరణలో గల స్వర్గీయ మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి నంది చౌక్ కొత్త బస్టాండ్ మీదుగా డైమండ్ హోటల్ నుండి తిరిగి కొత్త బస్టాండ్ వద్దకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కొత్త బస్టాండ్ వద్దగల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అలాగే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా కోరుట్ల నియోజకవర్గం లోని కోరుట్ల మెట్ పల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అందులో భాగంగానే కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా తిరుమల వసంత గంగాధర్ ను నియమించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు.రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసి కౌన్సిలర్ల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు జువ్వాడి నర్సింగ్ రావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కావున ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కృషి చేయాలని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు గారు జువ్వాడి కృష్ణా రావు తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ వైస్ చైర్మన్. షాహిద్ ఉల్ అహ్మద్ కౌన్సిలర్లు. శీలం జయలక్ష్మి వేణుగోపాల్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్. దాసరి సునీత రాజశేఖర్. ఎడ్ల జలజ.రమేష్ రెంజర్ల కళ్యాణి తెడ్డు శ్రీజ విజయ్. ఉమేరా కౌసర్ వాసిద్ సనా సుల్తానా రిజ్వాన్. మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి. చిట్యాల లక్ష్మీనారాయణ.తోట గంగాధర్.వాసీద్. మోర్తాడ్ లక్ష్మీనారాయణ.తోట గంగాధర్ అబ్దుల్ రహీం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
*కోరుట్ల పట్టణంలో విజయోత్సవ ర్యాలీ,కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు,ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన జువ్వాడి బ్రదర్స్.* కోరుట్ల ఫిబ్రవరి 19 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొంది మున్సిపల్ చేర్మెన్ గా ఎన్నికైన తిరుమల వసంత - గంగాధర్ కాంగ్రెస్ కౌన్సిలర్ తో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించగా ఇట్టి ర్యాలీకి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గారు లు విచ్చేశారు.ముందుగా కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల ఆవరణలో గల స్వర్గీయ మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి నంది చౌక్ కొత్త బస్టాండ్ మీదుగా డైమండ్ హోటల్ నుండి తిరిగి కొత్త బస్టాండ్ వద్దకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కొత్త బస్టాండ్ వద్దగల అంబేద్కర్
గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అలాగే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా కోరుట్ల నియోజకవర్గం లోని కోరుట్ల మెట్ పల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అందులో భాగంగానే కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా తిరుమల వసంత గంగాధర్ ను నియమించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు.రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసి కౌన్సిలర్ల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు జువ్వాడి
నర్సింగ్ రావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కావున ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కృషి చేయాలని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు గారు జువ్వాడి కృష్ణా రావు తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ వైస్ చైర్మన్. షాహిద్ ఉల్ అహ్మద్ కౌన్సిలర్లు. శీలం జయలక్ష్మి వేణుగోపాల్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్. దాసరి సునీత రాజశేఖర్. ఎడ్ల జలజ.రమేష్ రెంజర్ల కళ్యాణి తెడ్డు శ్రీజ విజయ్. ఉమేరా కౌసర్ వాసిద్ సనా సుల్తానా రిజ్వాన్. మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి. చిట్యాల లక్ష్మీనారాయణ.తోట గంగాధర్.వాసీద్. మోర్తాడ్ లక్ష్మీనారాయణ.తోట గంగాధర్ అబ్దుల్ రహీం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- Post by KR NEWS 3691
- నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.1
- కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ దేశభక్తి, పరాక్రమం నేటి యువతకు ఆదర్శమని పేర్కొంటూ సమాజంలో ఐక్యత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.1
- బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....1
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.1