logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం నిఘా పెంచిన అధికారులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.

2 hrs ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం నిఘా పెంచిన అధికారులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.
    1
    జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.
    4
    జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం  కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన  యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన  వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించబడ్డాయి. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించబడ్డాయి.
సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. 
ఈ కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    54 min ago
  • జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.
    1
    జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
    2
    అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
    user_నేనెవరైతే నీకెందుకు
    నేనెవరైతే నీకెందుకు
    అక్కన్నపేట, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న అగ్గి మల్లన్న దేవాలయంలో మల్లన్న పట్నాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇటీవల అగ్గి మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించారు. మంగళవారం దేవాలయ నిర్వాహకులు భక్తులు మల్లన్న మూల విగ్రహాన్ని సమీప గోదావరికి తీసుకువెళ్లి జలాలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం సుంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు స్వామి వారి కళ్యాణం, బోనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
    1
    జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న అగ్గి మల్లన్న దేవాలయంలో మల్లన్న పట్నాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇటీవల అగ్గి మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించారు. మంగళవారం దేవాలయ నిర్వాహకులు భక్తులు మల్లన్న మూల విగ్రహాన్ని సమీప గోదావరికి తీసుకువెళ్లి జలాలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం సుంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు స్వామి వారి కళ్యాణం, బోనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 min ago
  • ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ​అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్! ​ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ​సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. ​వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ​ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. ​మంగళవారం 'మంట'.. మహిళల 'గోస' ​ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది. ​వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. ​విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ​ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది. ​కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా? ​ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ​"ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."
    1
    ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
​అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్!
​ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది.
​సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు.
​వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి.
​ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది.
​మంగళవారం 'మంట'.. మహిళల 'గోస'
​ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది.
​వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం.
​విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
​ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది.
​కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా?
​ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
​"ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.