Shuru
Apke Nagar Ki App…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆందోళన బాట పట్టిన ఆశా వర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆందోళన బాట పట్టిన ఆశా వర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని మూషం రమేష్ కోరారు.1
- ప్రభుత్వాలు 'స్వచ్ఛ భారత్' అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో మాత్రం పరిస్థితి చూస్తే 'అధ్వాన్నం' అనే మాట కూడా చిన్నబోతుంది. 29 గ్రామాల ప్రజలకు కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సిగ్గుచేటు. ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమేనా? ప్రజల కనీస అవసరాలు అధికారుల కంటికి ఆనడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల 'భూమి' నాటకం.. బయటపెట్టిన జితేందర్! ఇటీవల జిల్లా స్థాయి ప్రజావాణిలో సామాజిక కార్యకర్త తుడుం జితేందర్ ఈ సమస్యను కలెక్టర్ కుమార్ దీపక్ ముందు ఉంచినప్పుడు అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. సాకు: "సార్.. జన్నారంలో మరుగుదొడ్లు కట్టడానికి ప్రభుత్వ భూమి లేదు" అని అధికారులు కలెక్టర్ ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. వాస్తవం: బస్టాండ్ దగ్గర ఇరిగేషన్ భూమి ఉండగా, కవ్వాల్ పాయింట్ వద్ద బావి సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రశ్న: ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజల అవసరాల కోసం ఒక్క గుంట భూమిని కూడా చూపలేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అని జితేందర్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. మంగళవారం 'మంట'.. మహిళల 'గోస' ప్రతి మంగళవారం జరిగే వారపు సంత రోజున జన్నారం ఒక నరకప్రాయమైన ప్రాంతంగా మారుతోంది. వ్యాపారుల ఆవేదన: ఉదయాన్నే అడవి నుంచి, తండాల నుంచి కూరగాయలు తెచ్చే మహిళా వ్యాపారులు సాయంత్రం వరకు మలమూత్ర విసర్జన ఆపుకోలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. విద్యార్థినుల ఇబ్బందులు: కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య ముప్పు: గత్యంతరం లేక రోడ్ల పక్కనే వెళ్లాల్సి రావడంతో అటు పారిశుద్ధ్యం క్షీణించి, రోగాలకు నిలయంగా మారుతోంది. కలెక్టర్ ‘డెడ్ లైన్’.. అమలు జరిగేనా? ప్రజల గోసను అర్థం చేసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించాలని, తక్షణమే మూడు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా అధికారులు 'ఫైళ్ల' మీద కాలక్షేపం చేస్తారా? లేక యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెడతారా? అని జన్నారం ప్రజలు ఎదురుచూస్తున్నారు. "ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడలేని అధికారులు, కనీసం ప్రజల ప్రాథమిక అవసరాల కోసం కేటాయించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి."1
- జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. విజయ టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగానికి చెందిన 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి లచ్చు నాయక్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే పరిమితం చేయాలని, వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.1
- జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమారుడు మణితేజ (8) కుక్కకాటుకు గురై 15 నెలల పాటు చికిత్స పొందుతూ చివరికి మృతిచెందాడు. 2024 డిసెంబర్ 26న ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క బాలుడిని కరిచింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి టీకా వేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అనంతరం జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు వెన్నుముక నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు తెలిపారు. అప్పటి నుంచి బాలుడు శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడిన మణితేజ చివరకు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.1
- పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ను విజయవంతంగా దాటి భారతదేశానికి చెందిన LPG ట్యాంకర్ Shivalik సురక్షితంగా గుజరాత్‌లోని Mundra Port కు చేరుకుంది. ఈ నౌక సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల LPG ను తీసుకువచ్చింది. � The Economic Times +1 పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ సముద్ర మార్గంలో నౌకాయానానికి ప్రమాదం ఉన్నప్పటికీ, భారతదేశం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసింది. � Reuters ఈ LPG సరుకు దేశంలోని గృహ వినియోగానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణంతో గ్యాస్ సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. � The Economic Times ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలో భారతదేశం దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను భద్రపరచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీకు కావాలంటే ఇదే వార్తను మరింత చిన్నగా (వాట్సాప్/సోషల్ మీడియా పోస్టు స్టైల్) కూడా తయారు చేసి ఇస్తాను.1
- కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఫైర్ అయ్యారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో తనకు అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో, ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదని, అలాంటి వ్యక్తి కలిసి పని చేద్దామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం ఎవరు...పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి సంజయ్ కారణం కాదా? అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ కాంగ్రెస్ లో ఐక్యతను కొందరు చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఉగాది తర్వాత పిసిసి చీప్ మహేష్ గౌడ్ తనతో మాట్లాడతా అన్నారని తెలిపారు. పార్టీ నాయకుల అనుచరుల సలహాలు సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ అధిష్టానమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే సంజయ్ ఉడుంలా చేరారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని హితవు పలికారు. ఫిరాయించిన ఎమెల్యేపై చర్యలు ఉంటేనే తన సమస్య పరిష్కారం అవుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.2
- ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, అనంతారం, రేపాక, ఓబులాపూర్, బోయినపల్లి మండలం విలాసాగర్, మల్కాపూర్, మర్లపేట, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్, వేములవాడ, గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామాల్లో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు. ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్క జొన్న, పూల మొక్కలు ఇతర పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి మండలం నుంచి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఒకే పంట సాగు చేయకూడదనే ఉద్దేశంతో, ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ఇప్పటికే పీఏసీఎస్ లలో రైతులకు అవగాహన కల్పించామని, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని, మిగతా వారు కూడా సాగు చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లాకు దగ్గరలోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ నున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు మెమొరండం సమర్పించారు. అర్హులైన వారందరికీ ఆసరా, వికలాంగ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు నివారించడంతో పాటు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1