logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, అనంతారం, రేపాక, ఓబులాపూర్, బోయినపల్లి మండలం విలాసాగర్, మల్కాపూర్, మర్లపేట, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్, వేములవాడ, గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామాల్లో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు. ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్క జొన్న, పూల మొక్కలు ఇతర పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి మండలం నుంచి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఒకే పంట సాగు చేయకూడదనే ఉద్దేశంతో, ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ఇప్పటికే పీఏసీఎస్ లలో రైతులకు అవగాహన కల్పించామని, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని, మిగతా వారు కూడా సాగు చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లాకు దగ్గరలోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ నున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు.

2 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
2 hrs ago

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, అనంతారం, రేపాక, ఓబులాపూర్, బోయినపల్లి మండలం విలాసాగర్, మల్కాపూర్, మర్లపేట, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్, వేములవాడ, గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామాల్లో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు. ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్క జొన్న, పూల మొక్కలు ఇతర పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి మండలం నుంచి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఒకే పంట సాగు చేయకూడదనే ఉద్దేశంతో, ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ఇప్పటికే పీఏసీఎస్ లలో రైతులకు అవగాహన కల్పించామని, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని, మిగతా వారు కూడా సాగు చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లాకు దగ్గరలోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ నున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని మూషం రమేష్ కోరారు.
    1
    ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని మూషం రమేష్ కోరారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే  120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు.  వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు.
ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన  తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి  సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక,  పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    20 hrs ago
  • జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.
    1
    జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    32 min ago
  • జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.
    4
    జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం  కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన  యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన  వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    51 min ago
  • కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
    1
    కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
    2
    అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
    user_నేనెవరైతే నీకెందుకు
    నేనెవరైతే నీకెందుకు
    అక్కన్నపేట, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, అనంతారం, రేపాక, ఓబులాపూర్, బోయినపల్లి మండలం విలాసాగర్, మల్కాపూర్, మర్లపేట, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్, వేములవాడ, గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామాల్లో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు. ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్క జొన్న, పూల మొక్కలు ఇతర పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి మండలం నుంచి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఒకే పంట సాగు చేయకూడదనే ఉద్దేశంతో, ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ఇప్పటికే పీఏసీఎస్ లలో రైతులకు అవగాహన కల్పించామని, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని, మిగతా వారు కూడా సాగు చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లాకు దగ్గరలోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ నున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు.
    1
    ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, అనంతారం, రేపాక, ఓబులాపూర్, బోయినపల్లి మండలం విలాసాగర్, మల్కాపూర్, మర్లపేట, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్, వేములవాడ, గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామాల్లో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు. ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్క జొన్న, పూల మొక్కలు ఇతర పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి మండలం నుంచి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఒకే పంట సాగు చేయకూడదనే ఉద్దేశంతో, ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ఇప్పటికే పీఏసీఎస్ లలో రైతులకు అవగాహన కల్పించామని, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని, మిగతా వారు కూడా సాగు చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లాకు దగ్గరలోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ నున్నారని వెల్లడించారు. 
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.