logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_RAMESH P
RAMESH P
కుశాల్ నగర్, సిద్దిపేట•

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఆదివారం సుడిగాలి విధ్వంసం సృష్టించింది, ఈ సుడిగాలి భీభత్సానికి 70 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒకరు మృత్యువాత పడగా పలువురు గాయాలపాలయ్యారు. అత్యంత ప్రభావితమైన ప్రాంతం కరంజియాలోని కియా గ్రామంలో బలమైన గాలులు నివాసితులలో భయాందోళనలను సృష్టించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
    1
    ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఆదివారం సుడిగాలి విధ్వంసం సృష్టించింది, ఈ సుడిగాలి భీభత్సానికి 70 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒకరు మృత్యువాత పడగా పలువురు గాయాలపాలయ్యారు. అత్యంత ప్రభావితమైన ప్రాంతం కరంజియాలోని కియా గ్రామంలో బలమైన గాలులు నివాసితులలో భయాందోళనలను సృష్టించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ సందర్భంగా సోమవారం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడంతో కృతజ్ఞతలు తెలిపారు. పేద ముస్లిం కుటుంబాలకు ఎంతో *ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్, డీటీ బాబన్న తదితరులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ సందర్భంగా సోమవారం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడంతో కృతజ్ఞతలు తెలిపారు. పేద ముస్లిం కుటుంబాలకు ఎంతో *ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్, డీటీ బాబన్న తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది..
    1
    అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది..
    user_కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    జర్నలిస్ట్ భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    8 hrs ago
  • శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    1
    కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు.‌ ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
    1
    జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు.‌ ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.
    1
    వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య సిబ్బంది సోమవారం బాలికలకు HPV | వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. హెచ్సీవీ వ్యాక్సిన్ పనితీరు, భవిష్యత్తులో రాబోయే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే అంశాలపై 14 నుంచి 15సం. వయసున్న బాలికలకు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తున్నారని తెలిపారు. MLHP, సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య సిబ్బంది సోమవారం బాలికలకు HPV | వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. హెచ్సీవీ వ్యాక్సిన్ పనితీరు, భవిష్యత్తులో రాబోయే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే అంశాలపై 14 నుంచి 15సం. వయసున్న బాలికలకు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తున్నారని తెలిపారు. MLHP, సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.