Shuru
Apke Nagar Ki App…
వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.
Satheesh gangu
వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్‌ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు మాజీమంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. రైతులతో కలిసి జీవన్ రెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరై మొక్కజొన్న రైతుల పక్షాన అడిషనల్ కలెక్టర్ ను కలిసి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటతో రైతులకు లాభం ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, కోతులు, పందులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోతులు, అడవి పందుల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కోతుల బెడదకు నివారణ ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.3
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.1
- Post by Venu Gopal1
- వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.1