logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బ్రాహ్మణులను అవమానించిన తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌పై బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆగ్రహం ధర్మపురి మార్చ్ 15 ఈ నెల 12వ తేదీన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీ సెల్ చైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జరిగిన సభలో బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను అవమానించే విధంగా పరుష పదజాలం ఉపయోగించారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ తీవ్రంగా ఖండించారు.

20 hrs ago
user_Venu Gopal
Venu Gopal
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
20 hrs ago

బ్రాహ్మణులను అవమానించిన తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌పై బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆగ్రహం ధర్మపురి మార్చ్ 15 ఈ నెల 12వ తేదీన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీ సెల్ చైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జరిగిన సభలో బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను అవమానించే విధంగా పరుష పదజాలం ఉపయోగించారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ తీవ్రంగా ఖండించారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • ప్రభావశీలురైన నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రాణభయంలో బాధితుడి కుటుంబం. ​మంచిర్యాల/జన్నారం: చట్టం ముందు అందరూ సమానులే అని పాలకులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ ప్రభావం, ధనబలం బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఒక ఎస్సీ బాధితుడిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ​ఘటన నేపథ్యం: ఫిర్యాదు చేసినా తప్పించుకున్న పోలీసులు ​ఫిబ్రవరి 16, 2026 రాత్రి సుమారు 9 గంటల సమయంలో నస్పూర్ మోషే అనే వ్యక్తిపై కులం పేరుతో దాడి జరిగింది. బాధితుడి కుమారుడు అభినయ్ వెంటనే '100' కు నాలుగు సార్లు కాల్ చేసినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. మరుసటి రోజు (ఫిబ్రవరి 17) బాధితుడి భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, జన్నారం ఎస్హెచ్ఓ గొల్లపెల్లి అనూష ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా, నిందితుల ఒత్తిడితో బాధితుడిపైనే ఎదురు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​అధికారుల చుట్టూ తిరిగినా అందని న్యాయం ​న్యాయం కోసం బాధితురాలు ఫిబ్రవరి 23న మంచిర్యాల డీసీపీని ఆశ్రయించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విచారణకు రావడానికి మరో 12 రోజుల సమయం పట్టింది. చివరకు దాడి జరిగిన 18 రోజుల తర్వాత (మార్చి 6, 2026) ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 49/2026) నమోదైంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే స్పందించాల్సి ఉన్నా, ఈ స్థాయిలో ఆలస్యం జరగడం పోలీసుల అలసత్వానికి నిదర్శనమని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ​నిందితుడి నేర చరిత్ర – రాజకీయ రక్షణ ​ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లం రవి, ప్రస్తుత సర్పంచ్ భర్త మరియు మాజీ ఎంపీటీసీ. ఇతనిపై గతంలోనే పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి: ​SC Spl. 25/2022: ఆదిలాబాద్ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు. ​SC Spl. 19/2018 (FIR 128/2017): గతంలో జరిగిన ఒక అత్యాచార కేసులో నిందితుడు రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ​నేర చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, తనకున్న రాజకీయ మరియు ధన బలంతో నిందితుడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ​ప్రాణభయంలో బాధితుడి కుటుంబం ​మార్చి 11న రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బాధితురాలు, నిందితులు తమను రాజీ పడాలని బెదిరిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు. ఎఫ్ఐఆర్ నమోదై ఇన్ని రోజులైనా నిందితుడు అల్లం రవి, అల్లం సూరిలు బహిరంగంగానే తిరుగుతున్నారని, ఇది బాధితులను మరింత భయాందోళనలకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​డిమాండ్: "ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. బాధితుడి కుటుంబానికి తగిన రక్షణ కల్పించి, విచారణలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి."
    2
    ప్రభావశీలురైన నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రాణభయంలో బాధితుడి కుటుంబం.
​మంచిర్యాల/జన్నారం: చట్టం ముందు అందరూ సమానులే అని పాలకులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ ప్రభావం, ధనబలం బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఒక ఎస్సీ బాధితుడిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
​ఘటన నేపథ్యం: ఫిర్యాదు చేసినా తప్పించుకున్న పోలీసులు
​ఫిబ్రవరి 16, 2026 రాత్రి సుమారు 9 గంటల సమయంలో నస్పూర్ మోషే అనే వ్యక్తిపై కులం పేరుతో దాడి జరిగింది. బాధితుడి కుమారుడు అభినయ్ వెంటనే '100' కు నాలుగు సార్లు కాల్ చేసినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. మరుసటి రోజు (ఫిబ్రవరి 17) బాధితుడి భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, జన్నారం ఎస్హెచ్ఓ గొల్లపెల్లి అనూష ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా, నిందితుల ఒత్తిడితో బాధితుడిపైనే ఎదురు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
​అధికారుల చుట్టూ తిరిగినా అందని న్యాయం
​న్యాయం కోసం బాధితురాలు ఫిబ్రవరి 23న మంచిర్యాల డీసీపీని ఆశ్రయించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విచారణకు రావడానికి మరో 12 రోజుల సమయం పట్టింది. చివరకు దాడి జరిగిన 18 రోజుల తర్వాత (మార్చి 6, 2026) ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 49/2026) నమోదైంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే స్పందించాల్సి ఉన్నా, ఈ స్థాయిలో ఆలస్యం జరగడం పోలీసుల అలసత్వానికి నిదర్శనమని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
​నిందితుడి నేర చరిత్ర – రాజకీయ రక్షణ
​ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లం రవి, ప్రస్తుత సర్పంచ్ భర్త మరియు మాజీ ఎంపీటీసీ. ఇతనిపై గతంలోనే పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి:
​SC Spl. 25/2022: ఆదిలాబాద్ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు.
​SC Spl. 19/2018 (FIR 128/2017): గతంలో జరిగిన ఒక అత్యాచార కేసులో నిందితుడు రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.
​నేర చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, తనకున్న రాజకీయ మరియు ధన బలంతో నిందితుడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
​ప్రాణభయంలో బాధితుడి కుటుంబం
​మార్చి 11న రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బాధితురాలు, నిందితులు తమను రాజీ పడాలని బెదిరిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు. ఎఫ్ఐఆర్ నమోదై ఇన్ని రోజులైనా నిందితుడు అల్లం రవి, అల్లం సూరిలు బహిరంగంగానే తిరుగుతున్నారని, ఇది బాధితులను మరింత భయాందోళనలకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
​డిమాండ్: "ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. బాధితుడి కుటుంబానికి తగిన రక్షణ కల్పించి, విచారణలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి."
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
    1
    కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ లో భీమేశ్వర ఆలయంలో రాజన్నను భక్తులు దర్శించుకుని ఆలయంలో కోడె మొక్కులను చెల్లించుకున్నారు.
    1
    దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ లో భీమేశ్వర ఆలయంలో రాజన్నను భక్తులు దర్శించుకుని ఆలయంలో కోడె మొక్కులను చెల్లించుకున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
    user_విజయ్ టీవీ న్యూస్
    విజయ్ టీవీ న్యూస్
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 hrs ago
  • జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.
    1
    జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని  క్లాసులకు అనుమతించడంతో  ఆందోళన సద్దుమణిగింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • हरियाणा में हाईवे पर लड़खड़ाते हुए एक युवक की मौत हो गई। 12वीं क्लास का मोइन (19) अपने दो दोस्तों के साथ दिल्ली-मुंबई हाईवे पर घूमने गया था। वे एक इंस्टा रील बनाना चाहते थे। जब वह एक दोस्त के साथ सड़क पर चल रहा था, तो किसी दूसरे आदमी ने इसे अपने फोन में रिकॉर्ड कर लिया। इसी बीच, एक लॉरी बेकाबू हो गई। गाड़ी ने मोइन को सीधी टक्कर मार दी, जिससे उसकी मौके पर ही मौत हो गई। यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।
    1
    हरियाणा में हाईवे पर लड़खड़ाते हुए एक युवक की मौत हो गई। 12वीं क्लास का मोइन (19) अपने दो दोस्तों के साथ दिल्ली-मुंबई हाईवे पर घूमने गया था। वे एक इंस्टा रील बनाना चाहते थे। जब वह एक दोस्त के साथ सड़क पर चल रहा था, तो किसी दूसरे आदमी ने इसे अपने फोन में रिकॉर्ड कर लिया। इसी बीच, एक लॉरी बेकाबू हो गई। गाड़ी ने मोइन को सीधी टक्कर मार दी, जिससे उसकी मौके पर ही मौत हो गई। यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    2 hrs ago
  • ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమం రాజ్యాంగం ద్వారా సమానత్వానికి మార్గదర్శి మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలో తహసిల్ చౌరస్తా వద్దు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు, డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నర్మాత డా. అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మెంబర్, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు, ఆశయాలను సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ మాట్లాడుతూ డా. అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలు అపారమైనవని అన్నారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ఆయన జీవితాంతం పోరాటం చేశారని పేర్కొన్నారు.
    1
    ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమం రాజ్యాంగం ద్వారా సమానత్వానికి మార్గదర్శి మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలో తహసిల్ చౌరస్తా వద్దు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు, డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో  ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నర్మాత డా.  అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మెంబర్, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు, ఆశయాలను సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ మాట్లాడుతూ డా. అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలు అపారమైనవని అన్నారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ఆయన జీవితాంతం పోరాటం చేశారని పేర్కొన్నారు.
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.