జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరైన మాజీమంత్రి జీవన్ రెడ్డి...వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను ప్రోత్సహించి, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్... కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో వినతి. జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు మాజీమంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. రైతులతో కలిసి జీవన్ రెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరై మొక్కజొన్న రైతుల పక్షాన అడిషనల్ కలెక్టర్ ను కలిసి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటతో రైతులకు లాభం ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, కోతులు, పందులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోతులు, అడవి పందుల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కోతుల బెడదకు నివారణ ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరైన మాజీమంత్రి జీవన్ రెడ్డి...వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను ప్రోత్సహించి, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్... కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో వినతి. జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు మాజీమంత్రి జీవన్
రెడ్డి వినతి పత్రం సమర్పించారు. రైతులతో కలిసి జీవన్ రెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరై మొక్కజొన్న రైతుల పక్షాన అడిషనల్ కలెక్టర్ ను కలిసి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటతో రైతులకు లాభం ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, కోతులు, పందులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
వరికి ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోతులు, అడవి పందుల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కోతుల బెడదకు నివారణ ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
- జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు మాజీమంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. రైతులతో కలిసి జీవన్ రెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరై మొక్కజొన్న రైతుల పక్షాన అడిషనల్ కలెక్టర్ ను కలిసి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటతో రైతులకు లాభం ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, కోతులు, పందులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోతులు, అడవి పందుల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కోతుల బెడదకు నివారణ ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.3
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్‌ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.1