logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణలో వడగండ్ల వానలు...... దెబ్బతిన్న పంటలు (వీడియో) తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

9 hrs ago
user_వేణు విలేకరి
వేణు విలేకరి
హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
9 hrs ago

తెలంగాణలో వడగండ్ల వానలు...... దెబ్బతిన్న పంటలు (వీడియో) తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ వద్ద రాజీవ్ రాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో నవ వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీలో పనిచేసే కోటిరెడ్డి కరీంనగర్ నుంచి బస్సులో వచ్చి మహాత్మానగర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రానాప్రతాప్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి అర్జున్, కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాణా ప్రతాప్ కు వారం రోజుల క్రితమే వివాహం అయింది. కాళ్ళ పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్ళింట విషాదం అలుముకుంది.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ వద్ద రాజీవ్ రాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో నవ వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీలో పనిచేసే కోటిరెడ్డి కరీంనగర్ నుంచి బస్సులో వచ్చి మహాత్మానగర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రానాప్రతాప్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి అర్జున్, కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాణా ప్రతాప్ కు వారం రోజుల క్రితమే వివాహం అయింది. కాళ్ళ పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్ళింట విషాదం అలుముకుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గార్ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గార్ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్ రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్, మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డు గ్రహీత ముంజాల రాజేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సమాజానికి రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని మన్యవర్ కాన్షిరాం తన జీవితాన్ని బహుజన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. మండల్ కమిషన్ అమలుకు ఆయన చేసిన పోరాటం ఫలితంగా 1990లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బహుజనులకు రాజకీయ అధికారం వచ్చినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయని కాన్షిరాం ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో బహుజన ఐక్యతతో ముందుకు సాగి రాజకీయ అధికారాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    2
    నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్ రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్, మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డు గ్రహీత ముంజాల రాజేందర్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సమాజానికి రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని మన్యవర్ కాన్షిరాం తన జీవితాన్ని బహుజన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. మండల్ కమిషన్ అమలుకు ఆయన చేసిన పోరాటం ఫలితంగా 1990లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బహుజనులకు రాజకీయ అధికారం వచ్చినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయని కాన్షిరాం ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో బహుజన ఐక్యతతో ముందుకు సాగి రాజకీయ అధికారాన్ని సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చ్ 15 ప్రజా తెలంగాణ న్యూస్/ డ్రగ్స్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీల్లో పాల్గొనడం సమాజానికి చెడు సందేశం ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ ప్రజాప్రతినిధులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి రీజినల్ మీట్ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌లు, క్లబ్ హౌస్‌ల పేరుతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ అధికారులు ఫామ్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు వారిపై తుపాకులతో కాల్పులు జరపడం పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని పేర్కొంటూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో అనేక దేశాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ప్రపంచ దేశాలకు టీకాలు అందించి తన సామర్థ్యాన్ని చాటుకుందని ఆయన అన్నారు.పెట్రోలియం, గ్యాస్ సరఫరాల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అపోహలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్ బాబురావు, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, సంజయ్ గుప్తా, రాధాకృష్ణ, అమర నాగేందర్ తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చ్ 15 ప్రజా తెలంగాణ న్యూస్/
డ్రగ్స్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీల్లో పాల్గొనడం సమాజానికి చెడు సందేశం ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ ప్రజాప్రతినిధులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి  రీజినల్ మీట్  సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌లు, క్లబ్ హౌస్‌ల పేరుతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ అధికారులు ఫామ్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు వారిపై తుపాకులతో కాల్పులు జరపడం పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని పేర్కొంటూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో అనేక దేశాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ప్రపంచ దేశాలకు టీకాలు అందించి తన సామర్థ్యాన్ని చాటుకుందని ఆయన అన్నారు.పెట్రోలియం, గ్యాస్ సరఫరాల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అపోహలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్ బాబురావు, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, సంజయ్ గుప్తా, రాధాకృష్ణ, అమర నాగేందర్ తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • జగిత్యాల జిల్లా ధర్మపురిలో బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. బ్రాహ్మణులను అసభ్య పదజాలంతో దూషించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ ను వెంటనే శాసనసభ సభ్యత్వం నుంచి భర్తరఫ్ చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. బ్రాహ్మణులు మహిళలు ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బ్రాహ్మణ సమాజంకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరసన ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    జగిత్యాల జిల్లా ధర్మపురిలో  బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. బ్రాహ్మణులను అసభ్య పదజాలంతో దూషించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ ను వెంటనే శాసనసభ సభ్యత్వం నుంచి భర్తరఫ్ చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. బ్రాహ్మణులు మహిళలు ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే బ్రాహ్మణ సమాజంకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరసన ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ పట్టణ పరిధిలోని మంగళి కాలనీ, పత్తిపాక ప్రాంతాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి కలకలం రేపింది. గంజాయి తాగుతున్న తాళ్ల అభిషేక్, నాయిని ఈశ్వర్లను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.50 వేల విలువైన 12 గ్రాముల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ పట్టణ పరిధిలోని మంగళి కాలనీ, పత్తిపాక ప్రాంతాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి కలకలం రేపింది. గంజాయి తాగుతున్న తాళ్ల అభిషేక్, నాయిని ఈశ్వర్లను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.50 వేల విలువైన 12 గ్రాముల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేశారని కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
    1
    ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేశారని కంచర్ల రవి గౌడ్  మండిపడ్డారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.