logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

1 hr ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో  రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షత వహించగా బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    2
    నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షత వహించగా బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.
    2
    వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    1
    మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
    1
    తెలంగాణ  రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.
    1
    జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని  క్లాసులకు అనుమతించడంతో  ఆందోళన సద్దుమణిగింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    47 min ago
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని గంగారం తండాకు చెందిన రైతు తేజావత్ నరహరి లేగదూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఉదయం పశువులను చూసేందుకు వెళ్లిన రైతులు ఈ ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. వరుసగా పెద్దపులి సంచారం వార్తలు వెలువడుతుండటంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది
    2
    జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని గంగారం తండాకు చెందిన రైతు తేజావత్ నరహరి లేగదూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఉదయం పశువులను చూసేందుకు వెళ్లిన రైతులు ఈ ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. వరుసగా పెద్దపులి సంచారం వార్తలు వెలువడుతుండటంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.