Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేశారని కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Satheesh gangu
తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేశారని కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
More news from తెలంగాణ and nearby areas
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ లో భీమేశ్వర ఆలయంలో రాజన్నను భక్తులు దర్శించుకుని ఆలయంలో కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.1
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.1
- Post by Venu Gopal1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గార్ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.1