Shuru
Apke Nagar Ki App…
దోమకొండ మండలం అంబారిపేట్ జీపీ సిబ్బంది గ్రామాభివృద్ధికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయం, సర్పంచ్ కవిత అనిల్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.
Narmala Swapna
దోమకొండ మండలం అంబారిపేట్ జీపీ సిబ్బంది గ్రామాభివృద్ధికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయం, సర్పంచ్ కవిత అనిల్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాంపూర్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా బూరుగుపల్లి మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు మృతదేహాల అంత్యక్రియల కార్యక్రమం ఖర్చును ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తాం -బూరుగుపల్లి, భూపతిపూర్ గ్రామాల మృతుల కుటుంబాలను పరామర్శించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుజాతీయ రహదారి రాంపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఆదివారం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన కలాలి అమృత గౌడ్, రిషి వర్ధన్ గౌడ్,బి.భూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయ గౌడ్ మృతి చెందారు..ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదివారం రెండు కుటుంబాలనుపరామర్శించారు.భూపతిపూర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన భార్య, తల్లిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు.కుటుంబ సభ్యుల బాధను చూసి కూడా భావోద్వేగానికి ఆయన గురయ్యారు.రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు.రెండు గ్రామాల మృతదేహాల అంత్యక్రియల ఖర్చులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సాయిలు, మండల పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, బాలకిషన్ రావ్, సాయి బాబా, తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గార్ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- నర్సాపూర్ మండలం రుస్తుం పేట్ చౌరస్తా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Venu Gopal1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్లో సందీప్ కుమార్ (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన సందీప్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- సంగారెడ్డి పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రులు సంగారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ లు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు పండ్లను తినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును కొనసాగించారు.1
- పత్రిక ప్రకటన. తేది:15.03.2026. కామారెడ్డి జిల్లా ఆదివారం. . జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ విక్టర్ ........ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ & జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐఏఎస్ ఆదేశాలమేరకు 2026సెన్సస్–2027కు సంబంధించిన దశ–1 గృహ జాబితా, గృహ గణన (HLO) కార్యక్రమం నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి/సబ్ డివిజన్ స్థాయి/ఛార్జ్ స్థాయి అధికారులకు ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విక్టర్ ఆద్వర్యం లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గృహ జాబితా, గృహ గణన కార్యక్రమం 2026 మే 11 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు , సూపర్‌వైజర్ల కు శిక్షణ సందర్భంగా జిల్లా/ఉపజిల్లా అధికారులు, ఛార్జ్ అధికారులు, ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు , ఫీల్డ్ ట్రైనర్లు వంటి జనాభా గణన 2027 విధులకు కేటాయించిన అధికారులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని జిల్లా , సబ్-డివిజనల్ అధికారులు, ఛార్జ్ అధికారులకు లెవల్–1 శిక్షణా కార్యక్రమం 15.03.2026 నుండి 17.03.2026 వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం IDOC లోని సమావేశ మందిరంలో 3 రోజులపాటు 15 నుండి 17 వరకు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అదనపు జిల్లా సెన్సస్ అధికారి, సబ్-డివిజనల్ జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ సెన్సస్ అధికారులు , అదనపు ఛార్జ్ సెన్సస్ అధికారులుగా నియమించబడిన అధికారులు ఈ శిక్షణలో దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. . ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల గణన ప్రక్రియ ను సమర్దవంతంగా నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు , మౌలిక వసతుల ప్రణాళికలను ఖచ్చితమైన జనగణన గణాంకాలు పునాదిగా ఉంటాయని తెలిపారు. జనాభా గణన ను సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించబడుతుందనిమొదటి దశలో గృహాలు, భవనాలు, కుటుంబ వివరాలు, రెండో దశలో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. అధికారులు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాలపరిమితి లో జనాభా గణన ను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ..... శిక్షణలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్, RDO వీణ, CPO రఘునందన్, జిల్లాలోని సంబంధిత అధికారులు, తహశీల్దార్లు, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ఇతర సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.1
- సోమవారం కలెక్టరేట్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం *తాత్కాలికంగా వాయిదా* జిల్లాలో జనాభా గణన–2027 విధులలో అధికారులు --- , కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు వారికి కేటాయించిన విధులలో అధికారులు నిమగ్నమై ఉన్నందున నేడు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్కటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. .1
- ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేశారని కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.1