Shuru
Apke Nagar Ki App…
సోమవారం జిల్లాలో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా కలెక్టర్ ప్రతిమాసింగ్ సోమవారం కలెక్టరేట్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం *తాత్కాలికంగా వాయిదా* జిల్లాలో జనాభా గణన–2027 విధులలో అధికారులు --- , కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు వారికి కేటాయించిన విధులలో అధికారులు నిమగ్నమై ఉన్నందున నేడు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్కటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. .
మెదక్ న్యూస్
సోమవారం జిల్లాలో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా కలెక్టర్ ప్రతిమాసింగ్ సోమవారం కలెక్టరేట్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం *తాత్కాలికంగా వాయిదా* జిల్లాలో జనాభా గణన–2027 విధులలో అధికారులు --- , కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు వారికి కేటాయించిన విధులలో అధికారులు నిమగ్నమై ఉన్నందున నేడు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్కటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. .
More news from తెలంగాణ and nearby areas
- ఇఫ్తార్ విందులు శాంతి ప్రతీకలు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి. మెదక్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని క్రీస్టల్ గార్డెన్ లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ డిప్యూటీ స్పీకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.సమాజంలో సౌభ్రాతృత్వం, సామరస్యం పెపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సర్వమత సమానత్వానికి కట్టుబడి ఉంటుందని, సామరస్య వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని, మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యం. దేవేందర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ లు మల్లికార్జున్ గౌడ్, బట్టి. జగపతి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ కృష్ణ గౌడ్, కౌన్సిలర్ జుబెర్ అహ్మద్, ఖాజా సోహెల్ మోహిద్దీన్, గౌస్, రాజవ్వ,లలిత, స్వరూప,దీపక్ కుమార్, పల్లె రాణి,మైనారిటీ నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- రంజాన్ మాసంలో పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రం క్రిస్టల్ గార్డెన్ లో బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.1
- శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చ్ 15 ప్రజా తెలంగాణ న్యూస్/ డ్రగ్స్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీల్లో పాల్గొనడం సమాజానికి చెడు సందేశం ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ ప్రజాప్రతినిధులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి రీజినల్ మీట్ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌లు, క్లబ్ హౌస్‌ల పేరుతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ అధికారులు ఫామ్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు వారిపై తుపాకులతో కాల్పులు జరపడం పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని పేర్కొంటూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో అనేక దేశాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ప్రపంచ దేశాలకు టీకాలు అందించి తన సామర్థ్యాన్ని చాటుకుందని ఆయన అన్నారు.పెట్రోలియం, గ్యాస్ సరఫరాల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అపోహలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్ బాబురావు, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, సంజయ్ గుప్తా, రాధాకృష్ణ, అమర నాగేందర్ తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్లో సందీప్ కుమార్ (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన సందీప్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- సంగారెడ్డి పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రులు సంగారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ లు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు పండ్లను తినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును కొనసాగించారు.1
- రాంపూర్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా బూరుగుపల్లి మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు మృతదేహాల అంత్యక్రియల కార్యక్రమం ఖర్చును ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తాం -బూరుగుపల్లి, భూపతిపూర్ గ్రామాల మృతుల కుటుంబాలను పరామర్శించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుజాతీయ రహదారి రాంపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఆదివారం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన కలాలి అమృత గౌడ్, రిషి వర్ధన్ గౌడ్,బి.భూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయ గౌడ్ మృతి చెందారు..ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదివారం రెండు కుటుంబాలనుపరామర్శించారు.భూపతిపూర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన భార్య, తల్లిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు.కుటుంబ సభ్యుల బాధను చూసి కూడా భావోద్వేగానికి ఆయన గురయ్యారు.రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు.రెండు గ్రామాల మృతదేహాల అంత్యక్రియల ఖర్చులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సాయిలు, మండల పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, బాలకిషన్ రావ్, సాయి బాబా, తదితరులు పాల్గొన్నారు.1