Shuru
Apke Nagar Ki App…
సంగారెడ్డి పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రులు సంగారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ లు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు పండ్లను తినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును కొనసాగించారు.
Sangareddy News
సంగారెడ్డి పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రులు సంగారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ లు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు పండ్లను తినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును కొనసాగించారు.
More news from తెలంగాణ and nearby areas
- పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి1
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం రాంపల్లిదాయర వెంకులో గుట్టపై ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన మంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి దేవస్థాన అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య వంటి అంశాలపై అర్చకులు, స్థానిక బాధ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని కలిసి ఆలయానికి సంబంధించిన సమస్యలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- రాంపూర్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా బూరుగుపల్లి మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు మృతదేహాల అంత్యక్రియల కార్యక్రమం ఖర్చును ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తాం -బూరుగుపల్లి, భూపతిపూర్ గ్రామాల మృతుల కుటుంబాలను పరామర్శించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుజాతీయ రహదారి రాంపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఆదివారం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన కలాలి అమృత గౌడ్, రిషి వర్ధన్ గౌడ్,బి.భూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయ గౌడ్ మృతి చెందారు..ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదివారం రెండు కుటుంబాలనుపరామర్శించారు.భూపతిపూర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన భార్య, తల్లిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు.కుటుంబ సభ్యుల బాధను చూసి కూడా భావోద్వేగానికి ఆయన గురయ్యారు.రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు.రెండు గ్రామాల మృతదేహాల అంత్యక్రియల ఖర్చులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సాయిలు, మండల పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, బాలకిషన్ రావ్, సాయి బాబా, తదితరులు పాల్గొన్నారు.1
- రంజాన్ మాసంలో పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రం క్రిస్టల్ గార్డెన్ లో బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Anji Raju1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చ్ 15 ప్రజా తెలంగాణ న్యూస్/ డ్రగ్స్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీల్లో పాల్గొనడం సమాజానికి చెడు సందేశం ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ ప్రజాప్రతినిధులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి రీజినల్ మీట్ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌లు, క్లబ్ హౌస్‌ల పేరుతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ అధికారులు ఫామ్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు వారిపై తుపాకులతో కాల్పులు జరపడం పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని పేర్కొంటూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో అనేక దేశాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ప్రపంచ దేశాలకు టీకాలు అందించి తన సామర్థ్యాన్ని చాటుకుందని ఆయన అన్నారు.పెట్రోలియం, గ్యాస్ సరఫరాల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అపోహలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్ బాబురావు, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, సంజయ్ గుప్తా, రాధాకృష్ణ, అమర నాగేందర్ తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- సోమవారం కలెక్టరేట్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం *తాత్కాలికంగా వాయిదా* జిల్లాలో జనాభా గణన–2027 విధులలో అధికారులు --- , కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు వారికి కేటాయించిన విధులలో అధికారులు నిమగ్నమై ఉన్నందున నేడు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్కటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. .1
- చర్లపల్లి ఇందిరమ్మ గృహ కల్పన దగ్గర బొంతు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ముఖ్య తిథిగా పాల్గొన్నారు చర్లపల్లి మాజీ కార్పొరేటర్. బొంతు శ్రీదేవి యాదవ్ మరికొందరు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.1