Shuru
Apke Nagar Ki App…
గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
KHADEER REPORTER
గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చ్ 15 ప్రజా తెలంగాణ న్యూస్/ డ్రగ్స్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీల్లో పాల్గొనడం సమాజానికి చెడు సందేశం ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ ప్రజాప్రతినిధులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి రీజినల్ మీట్ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌లు, క్లబ్ హౌస్‌ల పేరుతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ అధికారులు ఫామ్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు వారిపై తుపాకులతో కాల్పులు జరపడం పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని పేర్కొంటూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో అనేక దేశాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ప్రపంచ దేశాలకు టీకాలు అందించి తన సామర్థ్యాన్ని చాటుకుందని ఆయన అన్నారు.పెట్రోలియం, గ్యాస్ సరఫరాల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అపోహలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్ బాబురావు, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, సంజయ్ గుప్తా, రాధాకృష్ణ, అమర నాగేందర్ తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం రాంపల్లిదాయర వెంకులో గుట్టపై ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన మంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి దేవస్థాన అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య వంటి అంశాలపై అర్చకులు, స్థానిక బాధ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని కలిసి ఆలయానికి సంబంధించిన సమస్యలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- Post by Ali ammu1
- Post by Anji Raju1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- నర్సాపూర్ మండలం రుస్తుం పేట్ చౌరస్తా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1