Shuru
Apke Nagar Ki App…
నాగిరెడ్డిపేట మండలం తాండూర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 సం, బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ పై అవగాహన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య సిబ్బంది సోమవారం బాలికలకు HPV | వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. హెచ్సీవీ వ్యాక్సిన్ పనితీరు, భవిష్యత్తులో రాబోయే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే అంశాలపై 14 నుంచి 15సం. వయసున్న బాలికలకు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తున్నారని తెలిపారు. MLHP, సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Narmala Swapna
నాగిరెడ్డిపేట మండలం తాండూర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 సం, బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ పై అవగాహన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య సిబ్బంది సోమవారం బాలికలకు HPV | వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. హెచ్సీవీ వ్యాక్సిన్ పనితీరు, భవిష్యత్తులో రాబోయే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే అంశాలపై 14 నుంచి 15సం. వయసున్న బాలికలకు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తున్నారని తెలిపారు. MLHP, సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్లో సందీప్ కుమార్ (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన సందీప్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. శంకర్ మఠం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రస్టు అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, హిందువులపై, వేదాలపై, వేద మంత్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే హిందూ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సైనికులు ఎలాగో, హిందూ ధర్మ రక్షణకు బ్రాహ్మణులు అంతే అవసరం అన్నారు. అర్చకులపై దాడులు చేస్తున్న దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.2
- కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య సిబ్బంది సోమవారం బాలికలకు HPV | వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. హెచ్సీవీ వ్యాక్సిన్ పనితీరు, భవిష్యత్తులో రాబోయే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే అంశాలపై 14 నుంచి 15సం. వయసున్న బాలికలకు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తున్నారని తెలిపారు. MLHP, సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691