Shuru
Apke Nagar Ki App…
కొత్త పెన్షన్లు, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి… ఎమ్మార్వోకు బీజేపీ మెమొరండం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు మెమొరండం సమర్పించారు. అర్హులైన వారందరికీ ఆసరా, వికలాంగ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు నివారించడంతో పాటు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
M D Azizuddin
కొత్త పెన్షన్లు, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి… ఎమ్మార్వోకు బీజేపీ మెమొరండం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు మెమొరండం సమర్పించారు. అర్హులైన వారందరికీ ఆసరా, వికలాంగ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు నివారించడంతో పాటు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పరిధిలో కొంతమంది యువకులు హల్చల్ సృష్టించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులను వెంటాడి దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. బాధితులపై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా, ఒకరి తలపై బీర్ సీసాతో కొట్టినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో వరంగల్‌లో మద్యం మత్తులో యువత అల్లర్లు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్స్ కాలనీ పరిధిలో ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని చెబుతున్నారు.1
- కరీంనగర్ జిల్లా కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని ఎల్ఎండిలో ఇరిగేషన్ కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 ఏళ్ళ క్రితం కల్వల ప్రాజెక్టు ద్వంసమైతే ఇప్పటి వరకు మరమ్మత్తులు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వంసంతో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగండి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.4
- మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తన మాతృమూర్తి *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు... కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న రుగ్మతతో వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి... ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...2
- NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడలి వద్ద అధికారులు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో, కొత్తగా వచ్చే వాహనదారులు, ప్రయాణికులు ఏ గ్రామం ఎంత దూరంలో ఉందో, ఏ వైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులను ఆపి దారి తెలుసుకుంటున్నారు. అధికారులు స్పందించి, గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద సూచికలు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Sampathkumar neerudu1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో నీటి కొరత రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు ఎండిపోగా, వరి పంటలు ఎండిపోతున్నాయి. రావూరు, సీత్యాతండాకు చెందిన రైతు రమావత్ దసురు 2.16 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట నీరు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే రూ.50 వేల పెట్టుబడి పెట్టిన ఆయన, చేసేదేమీ లేక పంటను పశువులకు మేతగా వదిలివేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.1
- కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఫైర్ అయ్యారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో తనకు అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో, ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదని, అలాంటి వ్యక్తి కలిసి పని చేద్దామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం ఎవరు...పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి సంజయ్ కారణం కాదా? అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ కాంగ్రెస్ లో ఐక్యతను కొందరు చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఉగాది తర్వాత పిసిసి చీప్ మహేష్ గౌడ్ తనతో మాట్లాడతా అన్నారని తెలిపారు. పార్టీ నాయకుల అనుచరుల సలహాలు సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ అధిష్టానమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే సంజయ్ ఉడుంలా చేరారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని హితవు పలికారు. ఫిరాయించిన ఎమెల్యేపై చర్యలు ఉంటేనే తన సమస్య పరిష్కారం అవుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.2
- Post by Sampathkumar neerudu1