Shuru
Apke Nagar Ki App…
కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తుపనుల కోసం జాగృతి కార్యకర్తలు ఆందోళన...ఎల్ఎండిలో ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా కరీంనగర్ జిల్లా కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని ఎల్ఎండిలో ఇరిగేషన్ కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 ఏళ్ళ క్రితం కల్వల ప్రాజెక్టు ద్వంసమైతే ఇప్పటి వరకు మరమ్మత్తులు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వంసంతో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగండి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
K.V.REDDY
కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తుపనుల కోసం జాగృతి కార్యకర్తలు ఆందోళన...ఎల్ఎండిలో ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా కరీంనగర్ జిల్లా కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని ఎల్ఎండిలో ఇరిగేషన్ కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 ఏళ్ళ క్రితం కల్వల ప్రాజెక్టు ద్వంసమైతే ఇప్పటి వరకు మరమ్మత్తులు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వంసంతో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగండి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.4
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.1
- అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.2
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులను సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా చేయాలని తెలిపారు. ప్రతి మహిళా కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, తమ పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయములో భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళలు డబ్బును పొదుపు చేయాలని వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో తన కుటుంబం, దేశ వృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, వైద్యాధికారి రజిత, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.1
- జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. విజయ టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగానికి చెందిన 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి లచ్చు నాయక్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే పరిమితం చేయాలని, వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- కరీంనగర్ జిల్లా కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని ఎల్ఎండిలో ఇరిగేషన్ కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 ఏళ్ళ క్రితం కల్వల ప్రాజెక్టు ద్వంసమైతే ఇప్పటి వరకు మరమ్మత్తులు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వంసంతో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగండి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.4