మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులకు సన్మానం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులను సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా చేయాలని తెలిపారు. ప్రతి మహిళా కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, తమ పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయములో భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళలు డబ్బును పొదుపు చేయాలని వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో తన కుటుంబం, దేశ వృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, వైద్యాధికారి రజిత, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించబడ్డాయి. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.1
- జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.1
- జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.4
- అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.2
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకము పట్టు వస్త్రాలంకరణ అమ్మవారి అలంకరణ గావించారు అనంతరం పుష్పాలకరణ రావించి సహస్ర మార్చిన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు ఆలయ పూజారి భక్తులను ఆశీర్వదించి తీర్థ వితరణ గావించారు.1
- జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న అగ్గి మల్లన్న దేవాలయంలో మల్లన్న పట్నాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇటీవల అగ్గి మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించారు. మంగళవారం దేవాలయ నిర్వాహకులు భక్తులు మల్లన్న మూల విగ్రహాన్ని సమీప గోదావరికి తీసుకువెళ్లి జలాలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం సుంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు స్వామి వారి కళ్యాణం, బోనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.1
- మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలు, ఉద్యోగులను సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం, యోగా చేయాలని తెలిపారు. ప్రతి మహిళా కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, తమ పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయములో భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళలు డబ్బును పొదుపు చేయాలని వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో తన కుటుంబం, దేశ వృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, వైద్యాధికారి రజిత, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.1