logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. జీజీహేచ్ లో అన్ని చోట్ల సీ.సీ కెమెరాలు నిరంతరంగా పని చేసేలా చూడాలన్నారు. మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి, సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే సి.సెక్షన్ లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్.రాములు, జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు.

9 hrs ago
user_Sri
Sri
Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
9 hrs ago

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. జీజీహేచ్ లో అన్ని చోట్ల సీ.సీ కెమెరాలు నిరంతరంగా పని చేసేలా చూడాలన్నారు. మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి, సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే సి.సెక్షన్ లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్.రాములు, జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిజామాబాద్ : విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ లో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం “ఆవిష్కార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనల నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యకరమైన ఆహారం, సన్ డయల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఒక్కో ఎగ్జిబిట్ ను సందర్శిస్తూ, వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం తరగతి గది, పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫేర్ లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్తకొత్త ప్రయోగాలు చేసేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపాల్ ఆంథోని, లత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    నిజామాబాద్ : విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ లో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం “ఆవిష్కార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనల నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యకరమైన ఆహారం, సన్ డయల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఒక్కో ఎగ్జిబిట్ ను సందర్శిస్తూ, వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం తరగతి గది, పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫేర్ లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్తకొత్త ప్రయోగాలు చేసేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపాల్ ఆంథోని, లత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ సవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    1
    కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ సవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • *వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం* మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్ గౌడ్ ను గురువారం మెదక్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలలో చేసిన కృషిని జర్నలిస్టులు కొనియాడారు. రానున్న రోజుల్లో సైతం నరేష్ గౌడ్ పట్టణ ప్రజలతో పాటు ఇటు జర్నలిస్టుల సంక్షేమానికి కోసం కూడా కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జర్నలిస్టులు కామాటి కీషన్, సురేంద్ర రెడ్డి ప్రకాష్, కె. రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
    1
    *వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం*
మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్ గౌడ్ ను గురువారం మెదక్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలలో చేసిన  కృషిని జర్నలిస్టులు కొనియాడారు. రానున్న రోజుల్లో సైతం నరేష్ గౌడ్ పట్టణ ప్రజలతో పాటు ఇటు జర్నలిస్టుల సంక్షేమానికి కోసం కూడా కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జర్నలిస్టులు కామాటి కీషన్, సురేంద్ర రెడ్డి   ప్రకాష్, కె. రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • టి.లింగంపల్లిలో శివాజీ జయంతి వేడుకలు రేగోడ్ మండలం టి.లింగంపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దిగంబర్ రావు, పీసీసీ సభ్యుడు కిషన్ శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. స్త్రీ గౌరవం, రైతు సంక్షేమం కోసం శివాజీ చేసిన కృషిని వారు కొనియాడారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    టి.లింగంపల్లిలో శివాజీ జయంతి వేడుకలు
రేగోడ్ మండలం టి.లింగంపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దిగంబర్ రావు, పీసీసీ సభ్యుడు కిషన్ శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. స్త్రీ గౌరవం, రైతు సంక్షేమం కోసం శివాజీ చేసిన కృషిని వారు కొనియాడారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_పట్లోల్ల శివాజీ రావ్
    పట్లోల్ల శివాజీ రావ్
    రేగోడు, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ నూతన పాలకవర్గం ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కమిషనర్ టీ. మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యురాలు వడ్లూరి సరిత చైర్ పర్సన్‌గా, 14వ వార్డు సభ్యురాలు పెరుమాండ్ల మానస వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన కౌన్సిలర్లు కూడా తమ పదవులను స్వీకరించగా, మున్సిపల్ అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చారు
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ నూతన పాలకవర్గం ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కమిషనర్ టీ. మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యురాలు వడ్లూరి సరిత చైర్ పర్సన్‌గా, 14వ వార్డు సభ్యురాలు పెరుమాండ్ల మానస వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన కౌన్సిలర్లు కూడా తమ పదవులను స్వీకరించగా, మున్సిపల్ అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా బాల్క సుమన్ అరెస్టును అప్రజాస్వామిక చర్యగా కండిస్తూ ఆదిలాబాద్ జైలులో సుమన్‌ను పరామర్శించెందుకు వచ్చిన హరీష్ రావు
    1
    ఆదిలాబాద్ జిల్లా బాల్క సుమన్ అరెస్టును అప్రజాస్వామిక చర్యగా కండిస్తూ ఆదిలాబాద్ జైలులో సుమన్‌ను పరామర్శించెందుకు వచ్చిన హరీష్ రావు
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    10 hrs ago
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. జీజీహేచ్ లో అన్ని చోట్ల సీ.సీ కెమెరాలు నిరంతరంగా పని చేసేలా చూడాలన్నారు. మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి, సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే సి.సెక్షన్ లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్.రాములు, జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు.
    1
    నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. జీజీహేచ్ లో అన్ని చోట్ల సీ.సీ కెమెరాలు నిరంతరంగా పని చేసేలా చూడాలన్నారు. మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి, సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే సి.సెక్షన్ లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్.రాములు, జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.